increase prices
-
జనవరి నుంచి డీఏపీ ధర పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో యూరియా తర్వాత అత్యధికంగా వినియోగించే డై–అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) ధర జనవరి నుంచి పెరగొచ్చని తెలుస్తోంది. యాభై కిలోల బ్యాగ్‌పై కనీసంగా రూ.200 వరకు పెరిగే అవకాశముందని సమాచారం. డీఏపీ దిగుమతులకు కేంద్రం ఇప్పటివరకు అందించిన ప్రత్యేక ప్రోత్సాహకాల గడువు డిసెంబర్‌తో ముగియనుంది. దీని పొడిగింపుపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు, డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింతగా పడిపోయింది. ఈ నేపథ్యంలో దిగుమతి వ్యయం పెరిగి ఆమేరకు డీఏపీ ధర పెరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫాస్ఫేటిక్ ఎరువుల్లో 90 శాతం వరకు దిగుమతి చేసుకునేవే. దేశంలో ఏటా 100 లక్షల టన్నుల డీఏపీ వినియోగం అవుతుండగా, అందులో 60 లక్షల టన్నుల మేర దిగుమతి అవుతోంది. దేశీయ ఉత్పత్తికి ఉపయోగించే ముడి పదార్థాలైన రాక్ ఫాస్ఫేట్, ఫాస్ఫారిక్ యాసిడ్ కూడా దిగుమతి చేసుకునేవే. డీఏపీ ధరను రైతులకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దిగమతులపై టన్నుకు రూ.3,500 ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తోంది. ఈ గడువు డిసెంబర్‌తో 31తో ముగియనుంది. ఈ ప్రోత్సాహకాల కొనసాగింపుపై ఇంతవరకు కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 50 కిలోల బ్యాగ్ ధర రూ.1,350 ఉండగా, అది 12–15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంటే సుమారు రూ.200 మేర పెరిగి రూ.1,550కి చేరే అవకాశముందని అంటున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు, చైనా నుంచి తగ్గిన ముడి సరుకు సరఫరా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో రవాణా పరమైన సవాళ్లు సైతం ధరల పెరుగుదలకు కారణాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
జనవరి 1 నుంచి బెంజ్ కార్ల ధరలు పెంపు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాది జనవరి 1 నుంచి తన అన్ని రకాల కార్ల ధరల్ని 3 శాతం వరకు పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జీఎల్సీ మోడల్ నుంచి టాప్ఎండ్(ఖరీదు శ్రేణి) మేబాక్ ఈక్యూఎస్ 680 మోడల్ వరకు కారు ధరను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.9 లక్షల మేర ఈ పెంపు ఉంటుందని పేర్కొంది.‘‘అధిక ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ పెరుగుదల వ్యాపార కార్యకలాపాలపై ఒత్తిళ్లు పెంచుతున్నాయి. కమోడిటీ ధరల్లో హెచ్చుతగ్గులు, రవాణా ఖర్చులతో గత మూడు త్రైమాసికాల నుంచి నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో ధరల పెంపు నిర్ణయం తప్పలేదు’’ అని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ 31 లోపు బుక్ చేసుకునే వాహనాలకు మాత్రం పెంపు వర్తించదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్‌లు -
వంట నూనె ధరలకు రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు మొదలవుతున్న వేళ వంటనూనెల ధరలు చుక్కలనంటుతున్నాయి. గడిచిన నెల రోజులుగా క్రమంగా పెరుగుతూ సామాన్యులకు అందనంతగా పెరిగిపోతున్నాయి. నెల రోజుల్లోనే వంట నూనెల ధరలు 23 నుంచి 37 శాతం వరకు పెరగడంతో పండగ వేళ సామాన్యులకు ఇక్కట్లు తప్పేలా లేవు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత నెలలో రూ.100 ఉన్న పామాయిల్ ధర రూ.137 (37 శాతం) పెరగ్గా, సోయాబీన్ నూనె రూ.120 నుంచి రూ.148 (23 శాతం), సన్‌ఫ్లవర్ రూ.120 నుంచి రూ.149 (23.5 శాతం), ఆవ నూనె రూ.140 నుంచి రూ.181 (29శాతం), వేరుశనగ నూనె రూ.180 నుంచి రూ.187 (4 శాతం) మేర పెరిగాయి. దేశీయంగా నూనెగింజల సాగు పెద్దగా లేకపోవడంతో దేశం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా నుంచి సన్‌ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకుంటోంది. మొత్తంగా 58 శాతం ఇతర దేశాల నుంచే భారత్‌కు వస్తోంది. నూనెల వినియోగంలో భారత్ రెండో అతిపెద్ద వినియోగదారుగా ఉంది. దేశీయంగా నూనె పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గత నెలలో ముడి సోయాబీన్, పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతి సుంకాలను 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంచింది. శుధ్ది చేయబడిన ఆవ నూనెల దిగుమతి సుంకాన్ని 13.7 శాతం నుంచి 35.7 శాతానికి పెంచింది. సెపె్టంబర్ 14 నుంచి పెరిగిన సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హోల్‌సేల్ వ్యాపారులు ధరలు పెంచి అమ్మకాలు చేపట్టారు. దీనితో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు నూనెగింజల సాగులో ముందున్న మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పంట ఉత్పత్తి తగ్గింది. ఈ ప్రభావం సైతం ధరల పెరుగుదలకు కారణమైంది. పెరిగిన ధరల ప్రభావం రెస్టారెంట్లు, హోటళ్లతో పాటు దీపావళి సందర్భంగా చేసుకునే తీపి పదార్థలపై గణనీయంగా పడుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో స్వీట్ల ధరలను పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కొత్త పంట మార్కెట్లోకి వచ్చే వరకు ధరలు దిగిరావని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. -
నెలవారీ బిల్లులు భారం
న్యూఢిల్లీ: ఆహార, వ్యక్తిగత సంరక్షణ (ఎఫ్ఎంసీజీ) ఉత్పత్తుల ధరల పెంపుతో నెలవారీ షాపింగ్ బిల్లులు గడిచిన రెండు మూడు నెలల్లో పెరిగిపోయాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలు సబ్బులు, బాడీవాష్‌లు మొదలుకొని హెయిర్ ఆయిల్, కాఫీ పౌడర్, నూడుల్స్, ఆటాపై సగటున 2–9 శాతం మేర ధరలను సవరించాయి. హెయిర్ ఆయిల్‌పై ఈ పెంపు 8–11 శాతం మేర ఉంది. కొన్ని రకాల ఆహారోత్పత్తులపై ధరల బాదుడు 3 నుంచి 17 శాతం మధ్య ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. కమోడిటీల ధరలు దిగొచ్చిన ఏడాది తర్వాత ఎఫ్ఎంసీజీ సంస్థలు తమ ఉత్పత్తుల విక్రయ ధరలను సవరించడం ఇదే మొదటిసారి. ముడి సరుకుల (తయారీ) వ్యయాలు పెరిగిపోవడంతో తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు 2022, 2023లో ఎఫ్ఎంసీజీ కంపెనీలు ధరలను సవరించడం గమనార్హం. ముఖ్యంగా 2023–24 ఆర్థిక సంవత్సరం వ్యాప్తంగా ధరల పెంపు జోలికి చాలా సంస్థలు వెళ్లలేదు. ఉత్పత్తుల తయారీలోకి వినియోగించే ముడి చమురు, పామాయిల్ ధరలు గతంతో పోలిస్తే తగ్గగా.. పాలు, చక్కెర, కాఫీ, కోప్రా, బార్లే తదితర ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయి. కొన్ని రకాల కమోడిటీల ధరల్లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నందున 2024–25 ఆర్థిక సంవత్సరంలో ధరల సవరణ తప్పదని కంపెనీలు తమ మార్చి త్రైమాసికం ఫలితాల సందర్భంగా సంకేతమిచ్చాయి. మొత్తం మీద ధరల పెంపు సింగిల్ డిజిట్ (ఒక అంకె)కే పరిమితం కావచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎఫ్ఎంసీజీ రంగంపై విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. పెంపు ఇలా.. కొన్ని రకాల హెయిర్ ఆయిల్ ప్యాక్‌లపై మారికో 6 శాతం మేర ధరలు పెంచింది. కోప్రా (ఎండుకొబ్బరి) ధరలు ఇలాగే పెరుగుతూ పోతే, మరో విడత ధరల సవరణ తప్పదన్న సంకేతం ఇచి్చంది. స్నాక్స్ తయారీ సంస్థ బికజీ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2–4 శాతం మేర ధరలు పెంచనున్నట్టు తెలిపింది. పోటీ సంస్థల మాదిరే తాము సైతం ధరలను పెంచుతున్నట్టు టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ప్రకటించింది. దిగ్గజ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) గత ఆర్థిక సంవత్సరంలో ధరల పెంపుజోలికి వెళ్లలేదు. కానీ ఇటీవల కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచింది. డవ్ సబ్బుల ధరలను 2 శాతం పెంచడం గమనార్హం. డాబర్ ఇండియా, ఇమామీ కంపెనీలు సింగిల్ డిజిట్ స్థాయిలో ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఇక గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సబ్బులపై 4–5 శాతం సవరించింది. సంతూర్ సబ్బుల ధరలను విప్రో సంస్థ 3 శాతం పెంచింది. కోల్గేట్ పామోలివ్ బాడీవాష్ ధరలను కోల్గేట్ సంస్థ సింగిల్ డిజిట్ స్థాయిలో పెంచింది. హెచ్‌యూఎల్ పియర్స్ బాడీ వాష్ ధరలు 4 శాతం ప్రియమయ్యాయి. డటర్జెంట్ బ్రాండ్ల ధరలను హెచ్‌యూఎల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, జ్యోతి ల్యాబ్స్ సంస్థలు 1–10 శాతం స్థాయిలో పెంచాయి. హెచ్‌యూఎల్ షాంపూల ధరలు తక్కువ సింగిల్ డిజిట్ స్థాయిలో (5 శాతంలోపు), చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలను 4 శాతం చొప్పున సవరించింది. నెస్లే తన కాఫీ ఉత్పత్తుల ధరలను 8–13 శాతం మేర పెంచింది. మ్యాగి ఓట్స్ నూడుల్స్ ధరలు 17 శాతం పెరిగాయి. ఆశీర్వాద్ హోల్ వీట్ ఆటా ధరలు కూడా పెరిగాయి. -
ఆభరణాల డిమాండ్ ఎలా ఉందంటే..
ముంబై: ధరలు పెరిగినప్పటికీ పసిడి ఆభరణాలకు డిమాండ్ తగ్గడం లేదని తాజా నివేదిక ఒకటి పేర్కొంది. బంగారం ఆభరణాల వినియోగం.. విలువ పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 10 నుంచి 12 శాతం పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా– నివేదిక పేర్కొంది. ఇంతక్రితం వేసిన 8 నుంచి 10 శాతం అంచనాలను ఈ మేరకు ఎగువముఖంగా సవరించింది. పసిడి ధరల పెరుగుదలే దీనికి కారణమని వివరించింది. 2023–24 మొదటి ఆరునెలల కాలాన్ని (ఏప్రిల్–సెప్టెంబర్) 2022–23 ఇదే కాలంతో పరిశీలిస్తే ఆభరణాల వినియోగం విలువ 15 శాతానికి పైగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. బంగారం కొనుగోళ్లకు శుభప్రదంగా భావించే ’అక్షయ తృతీయ’ సమయంలో స్థిరమైన డిమాండ్, అధిక బంగారం ధరలు దీనికి కారణంగా పేర్కొంది. అయితే ద్వితీయార్థంలో ఈ శాతం 6 నుంచి 8 శాతమే ఉంటుందని అభిప్రాయపడింది. గ్రామీణ డిమాండ్ మందగమనం, ద్రవ్యోల్బణం తీవ్రత తమ అంచనాలకు కారణమని పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► డిసెంబర్ 2022–ఏప్రిల్ 2023 మధ్య అస్థిరత కొనసాగిన బంగారం ధరలు, 2023–24 మొదటి అర్థభాగంలో (ఏప్రిల్–సెపె్టంబర్) స్థిరంగా ఉన్నాయి. అయితే క్రితం సంవత్సరం సగటు ధరలతో పోలిస్తే 14 శాతం పెరిగాయి. ► పెరిగిన ధరలు.. పలు ఆభరణాల రిటైలర్ల ఆదాయ పటిష్టతకు దోహదపడ్డాయి. ► మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ప్రపంచ స్థూల ఆర్థిక అనిశి్చత పరిస్థితులతో సమీప కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయి. ► అక్టోబర్ 2023 ప్రారంభం నుండి బంగారం ధరల పెరుగుదల, స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం తీవ్రతవల్ల యల్లో మెటల్ ఆభరణాల డిమాండ్ కొంత తగ్గవచ్చు. -
కెనడా స్టూడెంట్ డిపాజిట్ రెట్టింపు
ఒట్టావా: కెనడా ప్రభుత్వం స్టూడెంట్ పర్మిట్ డిపాజిట్‌ను రెట్టింపు చేసింది. రెండు దశాబ్దాలుగా 10 వేల డాలర్లుగా ఉన్న డిపాజిట్ మొత్తాన్ని ఏకంగా 20, 635 డాలర్లకు పెంచుతున్నట్లు కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ గురువారం ప్రకటించారు. ఈ నిబంధన వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు ఆయన వివరించారు. -
యూకే విజిటింగ్, స్టూడెంట్ వీసా ఫీజుల మోత
లండన్: బ్రిటన్ ప్రభుత్వం విద్యార్థి, సందర్శక వీసా ఫీజులను త్వరలో భారీగా పెంచనుంది. విజిటింగ్ వీసాపై 15 పౌండ్లు, విద్యార్థి వీసాపై అదనంగా 127 పౌండ్లు పెంచుతున్నట్లు తెలిపింది. భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారికి ఇవి వర్తిస్తాయని పేర్కొంది. ఈ పెంపుదల అక్టోబర్ నాలుగో తేదీ నుంచి అమల్లోకి రానుందని స్పష్టం చేసింది. శుక్రవారం పార్లమెంట్లో హోంశాఖ ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టింది. దీని బిల్లు ప్రకారం ఆరు నెలల విజిటింగ్ వీసా ఫీజు ప్రస్తుతమున్న 100 పౌండ్ల నుంచి 115 పౌండ్ల(సుమారు రూ.12 వేలు)కు, విద్యార్థి వీసాకు ఫీజు 363 పౌండ్ల నుంచి 490 పౌండ్ల(సుమారు రూ.50 వేలు)కు పెరగనుంది. ఫీజుల పెంపు ఆరోగ్యం, సంరక్షణ వీసాతో సహా దాదాపు అన్ని రకాల వీసాలకు వర్తిస్తుంది; బ్రిటిష్ పౌరుడిగా నమోదు దరఖాస్తుకు, ఆరు నెలలు, రెండు, ఐదు, 10 సంవత్సరాల సందర్శన వీసాల ఫీజులు కూడా పెరగనున్నాయి. ఉద్యోగం, చదువుకు సంబంధించిన కొన్ని దరఖాస్తులకు సైతం ఈ పెంపు వర్తిస్తుంది. అక్టోబర్ నాలుగో తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని హోం శాఖ తెలిపింది. -
టోకు ద్రవ్యోల్బణం అయిదో నెలా ‘మైనస్’లోనే..
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం వరుసగా అయిదో నెల కూడా మైనస్‌లోనే కొనసాగింది. ఆగస్టులో మైనస్ 0.52%గా నమోదయ్యింది. సూచీలో పెరుగుదల లేకపోవడాన్ని ప్రతి ద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. టోకు బాస్కెట్ ధర పెరక్కపోగా.. మైనస్‌లో ఉన్పప్పటికీ, ఇందులో ఒక భాగంగా ఉన్న ఆహార బాస్కెట్ ధర మాత్రం తీవ్రంగా ఉంది. ఫుడ్ బాస్కెట్ తీరిది... ఫుడ్ బాస్కెట్ ధరల పెరుగుదల ఆగస్టులో 10.6 శాతంగా (2022 ఆగస్టుతో పోల్చి) ఉంది. జూలైతో (14.25 శాతం) పోలి్చతే ధరల స్పీడ్ కొంత తగ్గడం ఊరటనిచ్చే అంశం. ఒక్క కూరగాయల ధరలు చూస్తే, 48.69 శాతం పెరుగుదల నమోదయ్యింది. జూలైలో ఈ పెరుగుదల రేటు ఏకంగా 62.12 శాతంగా ఉంది. పప్పు దినుసుల ధరల స్పీడ్ 10.45 శాతంకాగా, ఉల్లి ధరల విషయంలో ఈ రేటు 31.42 శాతంగా ఉంది. ధరల స్పీడ్ జూలైతో పోలి్చతే తగ్గినప్పటికీ వార్షికంగా చూస్తే, ఇది చాలా ఎక్కువ పెరుగదలేనని నిపుణులు పేర్కొంటున్నారు. తయారీ: సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగంలో జూలైలో ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ 2.51 శాతం ఉంటే, ఆగస్టులో మైనస్ 2.37 శాతంగా నమోదయ్యింది. ఇంధనం–విద్యుత్: ఈ రంగంలో జూలైలో ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ 12.79 శాతం ఉంటే, ఆగస్టులో మైనస్ 6.03 శాతంగా ఉంది. -
మారుతి సుజుకీలో ఆ కారు ధర మరింత ప్రియం..!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా ఈకో వ్యాన్‌లోని అన్ని వేరియంట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సుమారు రూ. 8000 మేర పెంచినట్లు మంగళవారం కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పెంపు ఎందుకంటే..! ఈకో మోడల్‌కు చెందిన అన్ని నాన్ కార్గో వేరియంట్లలో అదనంగా ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ను మారుతి సుజుకీ ప్రవేశపెట్టింది. దీంతో ఈకో వ్యాన్‌లోని అన్ని నాన్-కార్గో వేరియంట్ల ధరలను పెంచాల్సి వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. పెరిగిన ధరలు ఈరోజు (నవంబర్ 30) నుంచే అమల్లోకి వస్తుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈకో ప్యాసింజర్ వెర్షన్ ధరలు రూ. 4.3 లక్షల నుంచి రూ. 5.6 లక్షలుగా ఉంది. అంబులెన్స్ ఈకో వెర్షన్ ధర రూ. 7.29 లక్షలుగా ఉంది. (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).ఈ ఏడాది సెప్టెంబర్‌లో సెలెరియో మోడల్ మినహా మిగతా మోడళ్ల ధరలను కంపెనీ సుమారు 1.9 శాతం వరకు పెంచింది. చదవండి: ఓలాకు గట్టిపోటీ..! భారీ ప్రణాళికతో ఏథర్..! -
సన్నబియ్యం ధరలకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సన్నరకం బియ్యం ధరలు పెరుగుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్లుగా సన్నరకం బియ్యం లభ్యత లేకపోవడంతో ధరలు పైకి ఎగబాకుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో మేలురకం సన్నాల ధరలు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు పెరిగాయి. రాష్ట్రంలో సన్నాల సాగు అధికంగా జరిగినా.. వానాకాలంలో కురిసిన కుండపోత వర్షాలతో దిగుబడి తగ్గడం, పొరుగు రాష్ట్రాలకు భారీగా ధాన్యం తరలి వెళ్లిపోవడంతో ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. సన్నాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, సెప్టెంబర్ తర్వాత కానీ మళ్లీ ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. రైతులు అమ్ముకున్నాక పెరిగిన ధరలు.. రాష్ట్రంలో గత వానాకాలంలో 53 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగ్గా, 39.66 లక్షల ఎకరాల్లో సన్నరకం సాగు చేశారు. దీనికి అనుగుణంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల మేర సన్నరకం ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసినా లెక్క తప్పింది. ఆగస్టు నుంచి మూడు నెలల పాటు భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో సన్నరకం ధాన్యం పంట భారీగా దెబ్బతిన్నది. దీంతో ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 10 నుంచి 15 క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో అనుకున్నంత మేర సన్నధాన్యం మార్కెట్లకు రాలేదు. దీనికి తోడు ధాన్యం తడవడం. తాలు ఎక్కువగా ఉండటంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేకరణ సరిగ్గా జరగకపోవడంతో రైతులు క్వింటాలు ధాన్యాన్ని మద్దతు ధరకన్నా తక్కువకు రూ.1,500–1,600కే అమ్మేసుకున్నారు. ప్రభుత్వం కేవలం 19.55 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని మాత్రమే సేకరించగలిగింది. మద్దతు ధర రాకపోవడంతో కొన్ని చోట్ల రైతులే ధాన్యాన్ని మిల్లుకు పట్టించి క్వింటాల్ బియ్యాన్ని రకాన్ని బట్టి రూ.3,200–4,000 వరకు అమ్ముకున్నారు. డిసెంబర్ నెల వరకు సైతం మేలురకాలైన బీపీటీకీ బహిరంగ మార్కెట్లో రూ.3,150 ఉండగా రైతులు ధాన్యం మొత్తం అమ్మేసుకున్నాక ప్రస్తుతం రూ.3,500కు చేరింది. హెచ్ఎంటీ బియ్యానికి రూ.3,300 నుంచి రూ.3,700, జైశ్రీరామ్ రూ.3,850 నుంచి రూ.4,100, తెలంగాణ సోనా రూ.3,450 నుంచి రూ.3,800 వరకు ధర పెరిగింది. పాత బియ్యమైతే అన్నింటిలోనూ సరాసరిగా క్వింటాలుకు 400 వరకు అధిక ధర ఉంది. పాతబియ్యం జైశ్రీరామ్, 1008 రకాలైతే ఖమ్మం, వరంగల్ వంటి జిల్లాల్లో క్వింటాలుకు ఏకంగా రూ.5,000–5,200 వరకు ధర పలుకుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారిక లెక్కల ప్రకారమే మేలురకం బియ్యం క్వింటాల్‌కు సరాసరి రేటు రూ.4,800 వరకు ఉండగా, కొద్దిగా తక్కువ రకం సన్నాల ధర రూ.4,200 వరకు ఉంది. గత ఏడాది ధరలతో పోల్చినా, కనీసంగా క్వింటాల్‌పై రూ.300 మేర పెరిగినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. పొరుగు నుంచి ఎసరు.. రాష్ట్రంలో వర్షాలతో తగ్గిన దిగుబడులకు తోడు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడి నుంచి సన్నరకం ధాన్యం కొనుగోళ్లకు మొగ్గు చూపడం సైతం బియ్యం ధరల పెరుగుదలకు కారణమవుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో సన్నరకం పంటల సాగు ఎక్కువగా లేకపోవడం, దిగుబడి పూర్తిగా దెబ్బతినడంతో వారంతా తెలంగాణ నుంచే సన్నరకం ధాన్యాన్ని సేకరించారు. అనధికారిక లెక్కల ప్రకారం పొరుగు రాష్ట్రాలకు 20 లక్షల మెట్రిక్ టన్నుల మేర సన్నధాన్యం తరలిందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం కన్నా ఇది లక్ష మెట్రిక్ టన్నుల మేర అధికం. దీంతో రాష్ట్రంలో సన్నాలకు కొరత ఏర్పడి బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ధరలు సెప్టెంబర్ వరకు క్రమంగా పెరిగే అవకాశాలే ఎక్కువని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. యాసంగి పంట బయటకి వస్తేనే ఈ ధరలు తగ్గుతాయని అంటున్నాయి. దీనికి తోడు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు సైతం బియ్యం ధరల పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రవాణా చార్జీలు పెరుగుతుండటంతో బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయని అంటున్నారు. -
దేశవ్యాప్తంగా బ్రాండెడ్ ఔషధాల ధరలకు రెక్కలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బ్రాండెడ్ ఔషధాల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలతోనే ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో తాజాగా ధరలు పెరగడం పేదలకు భారం కానుంది. గడచిన రెండేళ్లలో ముడి సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఔషధాల ధరల పెంపునకు అనుమతి కోరుతూ ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలన్నీ ఇప్పటికే ఎన్పీపీఏ (నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ)కి లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా వినియోగించే ఔషధాల ధరలు పెరగనున్నట్టు ఎన్పీపీఏ వర్గాలు తెలిపాయి. బీసీజీ వ్యాక్సిన్‌తో పాటు, విటమిన్–సీ, క్లోరోక్విన్, మెట్రొనిడజోల్ వంటి ప్రధానమైన 21 రకాల మందుల ధరలు మోత మోగనున్నాయి. దీంతో ఎన్పీపీఏ డిసెంబర్ మొదటి వారంలో సమావేశం నిర్వహించింది. త్వరలోనే పెరిగిన మందుల ధరలను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలకు 30 శాతం నుంచి 50 శాతం వరకూ ధర పెరగనుంది. అయితే ప్రజా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని అసాధారణంగా ధరలు పెంచబోమని ఎన్పీపీఏ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ మండలి కార్యాలయాలకు ఉత్తర్వులు అందాయి. బీసీజీ వ్యాక్సిన్ ప్రభావం తీవ్రంగా.. బీసీజీ వ్యాక్సిన్ ధర భారీగా పెరగనుంది. బిడ్డ పుట్టగానే టీబీ లేదా క్షయ రాకుండా ఈ వ్యాక్సిన్ వేస్తారు. మన రాష్ట్రంలో ఏటా 6.50 లక్షల మంది శిశువులు జన్మిస్తున్నారు. వీళ్లందరికీ బీసీజీ వ్యాక్సిన్ వేయాల్సిందే. దీంతోపాటు మలేరియా మందులు, యాంటీ బాక్టీరియల్‌కు వాడే మెట్రోనిడజోల్ వంటి మందుల ధరలు పెరగడం వల్ల దీని ప్రభావం ప్రభుత్వంపై తీవ్రంగా పడనుంది. మన రాష్ట్రంలో ఇలా పెరిగిన మందుల వల్ల ఏటా రూ.120 కోట్ల వరకూ అదనంగా రోగులపై భారం పడే అవకాశాలున్నట్టు ఔషధ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్టెంట్ రేట్లు తగ్గించినా... గుండెకు వేసే స్టెంట్ రేట్లు విచ్చలవిడిగా పెరిగిన నేపథ్యంలో వీటిని కూడా ఎన్పీపీఏ ధరల నియంత్రణలోకి తెచ్చింది. ఒక్కో స్టెంట్‌ను రూ.30 వేలకు మించి అమ్మకూడదని నిబంధన విధించింది. ఇదివరకు స్టెంట్ వేస్తే రూ. 1.50 లక్షలు వ్యయం అయ్యేది. కానీ ఇప్పుడు కూడా అంతే ధరకు వేస్తున్నారు. అంటే స్టెంట్ రేటు తగ్గినా ప్రొసీజర్ రేట్లు ఎక్కువ వేసి ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. ఆస్పత్రి చార్జీలు తమ పరిధిలోకి రావని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే స్టెంట్ల ధరలు తగ్గించినా రోగులపై భారం తగ్గడం లేదు. ఇలా 870 రకాల మందులు ధరల నియంత్రణ పరిధిలో ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు మందులు విక్రయిస్తున్న ఉత్పత్తి సంస్థలపై ఔషధ నియంత్రణ శాఖ దాడులు చేసి ఆయా మందులను సీజ్ చేసింది. అలయెన్స్ బయోటిక్స్, డిజిటల్ విజన్, సెంచురీ డ్రగ్స్ వంటి ఉత్పత్తి సంస్థలు తయారు చేసిన మందులు నిర్ణయించిన ధరకంటే ఎక్కువకు అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో అధికారులు ఆ మందులను సీజ్ చేశారు. ఉత్పత్తిదారులపైనా కేసులు నమోదు చేసినట్టు ఔషధ నియంత్రణ శాఖ కృష్ణా జిల్లా అధికారి రాజభాను ‘సాక్షి’కి తెలిపారు. ధరలు పెరిగే ఔషధాల్లో కొన్ని.. -
వరంగల్.. బెల్లం బజార్ !
సాక్షి, రామన్నపేట: సాధారణంగా బెల్లం కేజీ ధర రకాన్ని బట్టి రూ.30 నుంచి రూ.40 వరకు ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ఇదంతా ఒకే రీతిలో ఉన్నా హోల్‌సేల్ వ్యాపారానికి పేరు గాంచిన వరంగల్ బీట్‌బజార్‌లో మాత్రం ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా పోతోంది. ఇక్కడి సిండికేట్ కారణంగా హోల్‌సేల్‌గానే బెల్లం ధర రూ.55 పలుకుతుండగా.. రిటైల్ మార్కెట్‌కు వచ్చే సరికి ఇది రూ.60కి చేరుతుండడం గమనార్హం. ‘సిండికేట్’గా ఏర్పడిన కొందరు వ్యాపారుల తీరు కారణంగా ఈ ధర ఒక్కో సారి ఇంత కంటే ఎక్కువగా పలికిన సందర్భాలు ఉన్నాయి. గుడుంబా ముడిసరుకులపై నిషేధం గుడుంబా తయారీ, అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇందులో భాగంగానే గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, పటిక అమ్మకాలపై నియంత్రణ పెంచింది. ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తేనే బెల్లం అమ్మాలనే నిబంధనను అమల్లోకి తెచ్చింది. క్రమక్రమంగా బెల్లం వినియోగాన్ని గృహ అవసరాలకు పరిమితం చేయడానికి ఉపక్రమించింది. గుడుంబా బట్టీలకు బెల్లం చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించింది. ఇలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ వెళ్లడంతో బెల్లం గృహావసరాలకే పరిమితమైంది. రంగంలోకి సిండికేట్ వ్యాపారులు బెల్లం అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో గుడుంబా తయారీ తగ్గుముఖం పట్టింది. కొద్ది మంది వ్యక్తులే ఇతర రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా బెల్లాన్ని గుడుంబావ్యాపారులకు చేరవేసేవారు. కొద్దిరోజుల్లోనే రైళ్ల ద్వారా కూడా బెల్లం రాకుండా అధికారులు నియంత్రించగలిగారు. ఇక్కడే సిండికేట్ రంగంలోకి దిగింది. గు డుంబా తయారీ తగ్గుముఖం పడుతున్న క్రమంలో సిండికేట్‌గా మారిన కొందరు వ్యాపారులు మళ్లీ బెల్లం అమ్మకాలకు తెర తీయడం ద్వారా ప్రభుత్వ స్పూర్తికి తూట్లు పొడిచారు. ఈ వ్యాపా రం వరంగల్ బీట్ బజార్ కేంద్రంగా కొనసాగుతుండడం.. ఇటువైపు అధికారులు కన్నెత్తి చూడ డం లేదనే విమర్శలు వస్తుండడం గమనార్హం. రెట్టింపు ధర మార్కెట్లో సాధారణ ప్రజలకు బెల్లం అమ్ముతున్నామన్న నెపంతో విక్రయిస్తున్నా ఎక్కువ శాతం సరుకు మళ్లీ గుడుంబా బట్టీలకే చేరుతోంది. బెల్లం అమ్మకాలపై కట్టుదిట్టమైన ఆంక్షలు విధించినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి చాటుమాటుగా ఎంతో రిస్క్ తీసుకుని మరీ బెల్లం తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు వరంగల్ మార్కెట్లో బెల్లం లభిస్తుండడంతో గుడుంబా తయారీ దారులు సిండికేట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇలా గు డుంబా అమ్మకం, తయారీదారుల నుంచి ఉన్న డి మాండ్‌ను ఆసరాగా చేసుకుని సిండికేట్ వ్యాపారులు ధరను రెట్టింపు చేసేశారు. కేజీ రూ.30 ఉండాల్సిన బెల్లాన్ని హోల్‌సెల్ మార్కెట్లోనే రూ.55కు పెంచారు. దీంతో గృహ అవసరాలు, శుభకార్యాలకు బెల్లం కావాల్సిన వారు ఇంత ధర వెచ్చించలేక సమస్యెదుర్కొంటున్నారు. దీనికి తోడు ఈ సిండికేట్ ఫలితంగా పల్లెల్లో గుడుంబా తయారీ, అమ్మకాలు జోరందుకోవడంతో ప్రభుత్వం విధించిన నిషేధం నీరుగారుతున్నట్లవుతోంది. ధర తగ్గనివ్వరు.. పది మంది బెల్లం వ్యాపారులతో కలిసి ఏర్పడిన సిండికేట్ మార్కెట్లో బెల్లం ధర తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కొత్త వారెవెరూ బెల్లం అమ్మకుండా చూస్తున్నారు. సరుకు తెప్పించడం, వ్యాపారుల వారీగా విభజించడం, డబ్బు వసూలు చేయడం, అధికారులను మచ్చిక చేసుకోవడం ఇలా పనులను విభజించకున్న వ్యాపారులు ధర ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలిసినా ‘మామూలు’గా ఊరుకుంటున్నారని తెలుస్తోంది. దీనికి తోడు సిండికేట్‌ను కాదని బెల్లం అమ్మే వారి సమాచారం ఇచ్చిందే తడవుగా దాడులు చేస్తున్నారని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన నిషేధం సజావుగా అమలు జరగాలన్నా... సామాన్యులకు గృహ అవసరాల కు బెల్లం అందుబాటులోకి రావాల్సిన అధికారులు కొరఢా ఝులిపించాల్సిన అవసరం ఉంది. -
వినియోగదారులకు జియో షాక్ ఇస్తుందా?
సాక్షి,ముంబై : దేశంలో టెలికాం రంగంలో అతిపెద్ద సంచలనం రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వినియోగదారులకు షాక్ ఇవ్వనుందా? తాజా అంచనాలు ఈ అనుమానాలనే బలపరుస్తున్నాయి. డేటా, వాయిస్ కాలింగ్ సేవలను అతి చవకగా భారతీయ వినియోగదారులకు విరివిగా అందుబాటులోకి తీసుకొచ్చిన జియో త్వరలోనే ధరలను భారీగా పెంచనుంది. ఈ మేరకు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. త్వరలోనే జియో ధరలు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జేపీ మోర్గాన్ తన తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ చెల్లింపులకు గానూ జియో వేలకోట్ల రూపాయల అవసరం ఉంది. దీంతో జియో తన టారిఫ్‌లను పెంచే యోచనలో ఉందని అంచనా వేసింది. దాదాపు 30 కోట్లకు పైగా కస్టమర్లు, విస్తారమైన నెట్వర్క్,1,75,000 టవర్లు కలిగి ఉన్న జియో తన నిర్వాహణ సామర్ధ్యం పెంచుకోడానికి, ఆపరేషనల్ వ్యయాలను తట్టుకోడం కోసం ప్రస్తుతం ఉన్న రేట్లను పెంచనుంది. రేట్లను సవరించి తద్వారా నిధులను సమీకరించుకోనుందని ప్రముఖ మార్కెట్ బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. మరోవైపు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు కూడా రానున్న కాలంలో టారిఫ్ ధరలను పెంచేందుకు సిద్ధపడుతున్ననేపథ్యంలో జియో ధరల వ్యూహాన్ని మార్చుకోనుందని కోటక్ సెక్యూరిటీస్ కూడా అంచనా వేస్తోంది. 2016లో టెలికాం రంగంలో జియో ఎంట్రీ ఒక సంచలనంగా మారింది. దాదాపు 306.7 మిలియన్ కస్టమర్లను సొంతం చేసుకున్న జియో 2019 నాలుగో క్వార్టర్ ఫలితాల్లో నెట్ ప్రాఫిట్లో దాదాపు 65శాతం వృద్ధిని కనబరిచింది. అంతేకాదు 2019 మార్చి నాటికి దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించిన జియో రూ.11,100 కోట్ల ఆదాయాన్ని సాధించింది.అయితే నెట్వర్క్ ఆపరేటింగ్ వ్యయాలు దాదాపు 88 శాతం జంప్ జేయడంతో దాదాపు రూ.9 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవలసి ఉంది. ఈ నేపథ్యంలోనే జియో తన టారిఫ్‌లను సవరించవచ్చని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. రిలయన్స్ జియోలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనుందట. సుమారు 2–3 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చని తెలుస్తోంది. వాటాల విక్రయం ద్వారా వ్యాపార సామ్రాజ్య రుణభారాన్నితగ్గించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తాజా వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా టెలికం మార్కెట్లో విప్లవం సృష్టించిన జియో త్వరలోనే జియో గిగాఫైబర్‌తో మరో విప్లవానికి సిద్ధమవుతోంది. నెలకు కేవలం రూ.600కే గిగాఫైబర్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్ లైన్ ఫోన్, టీవీ చానళ్ల ప్రసారాల సేవలను అందించనుందని వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. -
రియల్ జోరు
సాక్షి, జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ నియోజకవర్గంలో ‘రియల్’ జోరు కొనసాగుతోంది. పట్టణం నుంచి పల్లెటూళ్ల వరకు ఎక్కడ చూసినా కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. పచ్చని పొలాలు ప్లాట్లుగా మారుతున్నాయి. నియోజకవర్గానికి నిమ్జ్ రాబోతుండడంతో భూముల రేట్లకుఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుండడంతో వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో అనుమతులు లేనివే అధికంగా ఉంటున్నాయని, అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని, సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జహీరాబాద్ పట్టణం మీదుగా జాతీయ రహదారి వెళ్తుంది. పట్టణానికి హైదరాబాద్ వంద కిలో మీటర్ల దూరంలో ఉంది. మహీంద్ర అండ్ మహీంద్రతో పాటు చక్కెర కర్మాగారం, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో (జాతీయ పరిశ్రమల ఉత్పాదక మండలి) నిమ్జ్ రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఇప్పటికే నిమ్జ్ కోసం 3 వేల ఎకరాల భూమిని సేకరించింది. మరో 9 వేల ఎకరాలు సేకరించనుంది. ఈ మేరకు పనులు జరుగుతున్నాయి. రెండు మూడేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఎకరా రూ. 5లక్షల నుంచి రూ.8 లక్షలు పలకగా ప్రస్తుతం రూ.10లక్షల నుంచి రూ.25 లక్షలు పలుకుతోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న భూములు రూ.కోటికి పైనే పలుకుతున్నాయి. హైదరాబాద్ తదితర ప్రాంతాల వ్యాపారులు అధిక ధర చెల్లించి ఇక్కడ భూములను కొంటున్నారు. రియల్ వ్యాపారంపై ఆసక్తి వ్యాపారులు జహీరాబాద్ ప్రాంతంలో వెంచర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన రహదారి, బైపాస్ రోడ్డులోని భూముల్లో ప్లాట్లు చేసి విక్రయాలు చేపడుతున్నారు. జహీరాబాద్ పట్టణం చుట్టుపక్కల ఎక్కడ చూసినా వెంచర్లు దర్శనమిస్తున్నాయి. చిన్నహైదరాబాద్, హోతి(కె), కాసీంపూర్, పస్తాపూర్, రంజోల్, అల్లీపూర్, దిడ్గి తదితర గ్రామాల పరిధిలో జహీరాబాద్– హైదరాబాద్, జహీరాబాద్–బీదర్, జహీరాబాద్ బైపాస్, అల్లానా రోడ్లలో వెంచర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. ప్లాట్లు చేసే పనులు జోరుగా కొనసాగుతున్నాయి. నిబంధనలు ఇలా.. పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేయడానికి వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. భూమి రిజిస్ట్రేషన్ విలువల్లో పది శాతం నాలా రుసుము కింది చెల్లించాలి. ఆ తరువాత ఫైల్‌ను తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపిస్తారు. ఆర్డీఓ కార్యాలయం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వ్యవసాయేతర భూమిగా మార్పు చేస్తున్నట్లు పత్రం జారీ చేస్తారు. సంబంధిత భూ యజమాని వెంచర్ కోసం 40 ఫీట్స్‌తో ప్రధాన రోడ్డు, 33 ఫీట్స్‌తో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ దీపాలు, తాగునీటి వసతులు కల్పించాలి. పార్కు, డంపింగ్ యార్డు, అంగన్వాడి కేంద్రాల కోసం మున్సిపల్, పంచాయతీల పేరున భూమిలో 10 శాతం రిజిస్ట్రేషన్ చేయించాలి. మున్సిపల్, పంచాయతీలు, డీటీసీపీ నుంచి అనుమతులు తీసుకుని ప్లాట్ల పనులు చేపట్టాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండానే.. జహీరాబాద్ ప్రాంతంలో వెలుస్తున్న వెంచర్లలో అధికశాతం అనుమతులు లేకుండానే పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జహీరాబాద్– హైదరాబాద్ రహదారిలోని అనేక వెంచర్లు పంట పొలాల్లోనే వెలిశాయి. పెద్ద పెద్ద వెంచర్లు మాత్రం అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపడుతుండగా చిన్న చిన్న వెంచర్లు నామమాత్రపు అనుమతులు తీసుకుని పొలాలను ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారు. అనుమతులు లేకుండా చేసిన వెంచర్లలో ప్లాట్లు కొన్నవారు ఆ తరువాత ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ వెంచర్లతో మున్సిపల్, పంచాయతీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమ వెంచర్లపై చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
ఏసీ, ఫ్రిజ్ ధరలకు రెక్కలు!!
ఏసీ, వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్), మైక్రోవేవ్, ఇతర వంటింటి ఉపకరణాలు కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే కొనేయండి. ఎందుకంటే ఈ నెల్లో వీటి ధరలు 2–5 శాతంమేర పెరిగే అవకాశముంది. రూపాయి మారకం విలువ క్షీణించడం.. క్రూడ్ ధరల్లో పెరుగుదల.. స్టీల్, కాపర్ వంటి కీలకమైన ముడిపదార్థాల ధరలు ఎగబాకటం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. రూ.400–రూ.1,500 శ్రేణిలో పెంపు.. ప్రీమియం మోడళ్ల ధరల పెరుగుదల నికరంగా రూ.400 నుంచి రూ.1,500 శ్రేణిలో ఉండొచ్చని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్స్ చెప్పారు. రూపాయి పతనం, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల వంటి అంశాల కారణంగా మార్చి నుంచి తమపై ఒత్తిడి పెరిగిందని కంపెనీలు పేర్కొంటున్నాయి. అందువల్ల డిమాండ్ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ధరలు పెంచాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిపాయి. ‘జూన్ నుంచి ధరల పెంపు దశల వారీగా ఉంటుంది. ఇక్కడ కస్టమర్ల సెంటిమెంట్ దెబ్బ తినకుండా చూసుకోవడం ప్రధానం. కొత్త సరుకు మార్కెట్లోకి రావడం కూడా పెంపునకు మరో కారణం’ అని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది చెప్పారు. ప్రస్తుతమున్న పాత సరుకు వల్ల పరిశ్రమ గత రెండు నెలల నుంచి ధరల పెంపును వాయిదా వేస్తూ వస్తోందని పేర్కొన్నారు. గోద్రెజ్ 2–3 శాతం శ్రేణిలో ధరలను పెంచనుంది. దేశీ అతిపెద్ద ఎయిర్ కండీషనర్ తయారీ సంస్థ వోల్టాస్ తాజాగా ధరలను దాదాపు 3 శాతంమేర పెంచింది. వర్ల్‌పూల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ డిసౌజా మాట్లాడుతూ.. పరిశ్రమ చర్యల ఆధారంగా తాము కూడా ధరలను పెంచొచ్చని తెలిపారు. అయితే ఎంతమేర పెంపు ఉంటుందనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎల్జీ, శాంసంగ్ ప్రొడక్టుల ధరలు 5% జంప్? దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ, శాంసంగ్ కంపెనీలు వాటి ఉత్పత్తుల ధరలను 5 శాతం మేర పెంచే అవకాశముంది. ఈ అంశాన్ని ఇప్పటికే తమ ట్రేడర్లకు ఇవి తెలియజేసినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. అయితే ఈ సంస్థలు అధికారికంగా మాత్రం ఇంకా దీనిపై ఏమీ చెప్పలేదు. ధరల పెంపు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించడానికి ప్రమోషనల్ ఆఫర్లను అందించే ప్రయత్నం చేస్తున్నామని వోల్టాస్ ఎండీ ప్రదీప్ బక్షి తెలిపారు. పానాసోనిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ శర్మ మాట్లాడుతూ.. ‘‘కమోడిటీ ధరల పెరుగుదల వల్ల ఒత్తిడి బాగా పెరిగింది. కాబట్టి ధరలను ఎప్పట్లానే కొనసాగించలేం. రూపాయి మారకం విలువలో మళ్లీ క్షీణత మొదలైనా.. ఉత్పత్తి వ్యయాల పెరిగినా.. అప్పుడు ధరల పెంపు అనివార్యమవుతుంది’’ అని వివరించారు. రూపాయి దెబ్బ పరిశ్రమ తన ధరల వ్యూహాలకు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువను 66 వద్ద బెంచ్‌మార్క్‌గా నిర్దేశించుకుంటుంది. కానీ ఇప్పుడు రూపాయి 67కు పైనే ఉంది. జనవరి నుంచి చూస్తే డాలర్‌తో రూపాయి 7%మేర క్షీణించింది. ప్రస్తుతం రూపాయి విలువ 67.11గా ఉంది. ఇక స్టీల్ ధరలు 7–8% పెరిగాయి. కాపర్ ధరలూ పెరిగాయి. ‘‘కాపర్‌ను ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని రసాయనాల ధరలు తగ్గడం కొంత ఉపశమనం. దీనివల్ల కంపెనీలు ఉత్పత్తి వ్యయాలను నియంత్రించుకుంటున్నాయి. అయితే ఇది ఎక్కువ రోజులు సాధ్యపడదు’’ అని పలువురు ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. మరొకవైపు ధరల పెంపుపై రిటైలర్లు మిశ్రమంగా స్పందించారు. -
భారీగా పెరగనున్న ఆడి కార్ల ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన కార్ల ధరలను పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. భారత ప్రభుత్వం దిగుమతులపై సుంకం పెంచిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. మొత్తం అన్ని మోడళ్ల కార్లపై ఈ పెంపును వర్తింప చేస్తున్నట్టు ప్రకటించింది. లక్ష రూపాయల నుంచి రూ.9లక్షల దాకా ధరలను పెంచామనీ, ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో కస్టమ్ సెక్యూరిటీ పెరుగుదల ధరల పెంపునకు దారి తీసిందని పేర్కొన్నారు. కాగా భారత్‌లో రూ. 35.35 లక్షల (ఎస్‌యూవీవీ క్యూ 3) నుంచి రూ. 2.8 కోట్ల (స్పోర్ట్స్ కార్లు) వరకు ఆడి విక్రయిస్తుంది. 2018-19 బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సీకెడీ వాహనాల దిగుమతులపై సుంకాన్ని 10శాతం నుంచి పెంచి 15శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
పెరగనున్న హ్యుందయ్ కార్ల ధరలు
న్యూఢిల్లీ: వరుసగా కార్ల కంపెనీలు తమ కార్లధరలను పెంచేస్తున్నాయి. నిన్నగ క మొన్న మారుతి తన వివిధ మోడళ్ల కార్ల ధరలు పెంచుతున్నట్టుగా ప్రకటిస్తే తాజాగా హ్యుందాయ్ ఈ కోవలోకి చేరింది. ఆటోమొబైల్ తయారీదారు హ్యుందయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) కార్ల ధరలను పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఎంటైర్ రేంజ్ లోని అన్ని మోడళ్ల కార్ల ధరలను ఆగస్టు16 నుంచి పెంచుతున్నట్టు వెల్లడించింది. రూపాయి విలువ, పెరిగిన ఇన్పుట్ వ్యయం కారణంగా ఈ పెంపు తప్పనిసరి అయిందని కంపెనీ తెలిపింది. "ముడి పదార్థాల ధరల పెరుగుదల, రూపాయి పెరుగుదల తమ మొత్తం ఖర్చులపై ప్రభావం చూపించిందనీ హెచ్ఎంఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. శ్రీవాత్సవ ప్రకటన ప్రకారం ఆయా మోడళ్లపై రూ 3,000 నుంచి రూ. 20,000 రూ దాకా పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ పది కారు నమూనాలు అందిస్తోంది. వీటిలో ఇయాన్, ఐ 10, గ్రాండ్ ఐ 10, ఎలైట్ ఐ 20, యాక్టివ్ ఐ 20, ఎక్సెంట్, వెర్నా, క్రెటా, ఎలాంట్రా, శాంటా ఫే ఉన్నాయి.