పెరగనున్న హ్యుందయ్ కార్ల ధరలు
న్యూఢిల్లీ: వరుసగా కార్ల కంపెనీలు తమ కార్లధరలను పెంచేస్తున్నాయి. నిన్నగ క మొన్న మారుతి తన వివిధ మోడళ్ల కార్ల ధరలు పెంచుతున్నట్టుగా ప్రకటిస్తే తాజాగా హ్యుందాయ్ ఈ కోవలోకి చేరింది. ఆటోమొబైల్ తయారీదారు హ్యుందయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) కార్ల ధరలను పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఎంటైర్ రేంజ్ లోని అన్ని మోడళ్ల కార్ల ధరలను ఆగస్టు16 నుంచి పెంచుతున్నట్టు వెల్లడించింది. రూపాయి విలువ, పెరిగిన ఇన్పుట్ వ్యయం కారణంగా ఈ పెంపు తప్పనిసరి అయిందని కంపెనీ తెలిపింది.
"ముడి పదార్థాల ధరల పెరుగుదల, రూపాయి పెరుగుదల తమ మొత్తం ఖర్చులపై ప్రభావం చూపించిందనీ హెచ్ఎంఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు.
శ్రీవాత్సవ ప్రకటన ప్రకారం ఆయా మోడళ్లపై రూ 3,000 నుంచి రూ. 20,000 రూ దాకా పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ పది కారు నమూనాలు అందిస్తోంది. వీటిలో ఇయాన్, ఐ 10, గ్రాండ్ ఐ 10, ఎలైట్ ఐ 20, యాక్టివ్ ఐ 20, ఎక్సెంట్, వెర్నా, క్రెటా, ఎలాంట్రా, శాంటా ఫే ఉన్నాయి.