
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన కార్ల ధరలను పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. భారత ప్రభుత్వం దిగుమతులపై సుంకం పెంచిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. మొత్తం అన్ని మోడళ్ల కార్లపై ఈ పెంపును వర్తింప చేస్తున్నట్టు ప్రకటించింది. లక్ష రూపాయల నుంచి రూ.9లక్షల దాకా ధరలను పెంచామనీ, ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో కస్టమ్ సెక్యూరిటీ పెరుగుదల ధరల పెంపునకు దారి తీసిందని పేర్కొన్నారు.
కాగా భారత్‌లో రూ. 35.35 లక్షల (ఎస్‌యూవీవీ క్యూ 3) నుంచి రూ. 2.8 కోట్ల (స్పోర్ట్స్ కార్లు) వరకు ఆడి విక్రయిస్తుంది. 2018-19 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సీకెడీ వాహనాల దిగుమతులపై సుంకాన్ని 10శాతం నుంచి పెంచి 15శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment