
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఆకర్షనీయమైన లుక్స్‌తో సరికొత్త మారుతి సుజుకీ బాలెనో ఫేస్‌లిఫ్ట్ 2022 ఎడిషన్ కారును త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ కారును వచ్చే నెల ఫిబ్రవరిలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలెనోతోపాటుగా మారుతి సుజుకీ సెలెరియో సీఎన్జీ వేరియంట్‌ను కూడా లాంచ్ చేయనుంది.
న్యూ లుక్స్‌తో..!
మారుతి సుజుకీ బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌లో మెకానికల్ ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చునని సమాచారం. అయితే డిజైన్, ఇంటిరీయర్స్ విషయంలో సరికొత్త మార్పులను జతచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మారుతి సుజుకీ బాలెనో ఫేస్‌లిఫ్ట్ 2022 ఎడిషన్‌లో భాగంగా ... భారీ గ్రిల్, న్యూ రాప్‌అరౌండ్ హెడ్‌ల్యాంప్స్, న్యూ ఎల్ ఈడీ డీఆర్‌ఎల్ సిగ్నేచర్స్, రివైజ్డ్ ఫ్రంట్ బంపర్, న్యూ ఫాగ్ ల్యాంప్స్, రియర్ సైడ్ రీడిజైన్ట్ టెయిల్ ల్యాంప్స్, న్యూ బంపర్, రివైజ్డ్ డిజైన్ టెయిల్ గేట్ వంటి ఫీచర్లతో రానుంది.
న్యూ బాలెనో 2022 ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రానుంది.
చదవండి: అమెరికాలో అమెరికన్ కంపెనీకి దిమ్మదిరిగే షాక్..!
Comments
Please login to add a commentAdd a comment