ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం యమహా మోటార్స్ భారత మార్కెట్లలోకి అప్‌డేట్‌డ్ వెర్షన్ ఎఫ్‌జెడ్ మోడల్ బైక్‌ను లాంచ్ చేసింది. యమహా FZS-Fi Dlx అనే కొత్త వేరియంట్‌తో పాటుగా FZS-Fi మోడల్ శ్రేణిని విడుదల చేస్తున్నట్లు కంపెనీ సోమవారం రోజున ప్రకటించింది. ఈ సిరీస్ బైక్స్ ఈ నెల రెండో వారం నుంచి అన్నీ యమహా డీలర్‌షిప్ సెంటర్లలో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ధర ఎంతంటే..?
యమహా FZS-Fi ధర రూ. 1, 15,900 కాగా, యమహా FZS-Fi Dlx ట్రిమ్ ధర రూ. 1,18,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. 'ది కాల్ ఆఫ్ ది బ్లూ' చొరవలో భాగంగా కొత్త FZS-Fi శ్రేణి బైక్‌ను ప్రవేశపెట్టినట్లు యమహా పేర్కొంది.
స్టైలింగ్ విషయానికి వస్తే..!
కొత్త యమహా ఎఫ్‌జెడ్‌ఎస్ శ్రేణిలో ఈ బైక్స్ క్రేజీ లుక్స్‌తో బైక్ లవర్స్‌ను ఇట్టే కట్టిపడేస్తోంది. కొత్త FZS-Fi మోడల్ రిఫ్రెష్ స్టైలింగ్‌తో పాటుగా అప్‌డేట్ ఫీచర్స్‌తో రానుంది. రెండు కొత్త యమహా FZS-Fi మోడల్స్‌లో బ్లూటూత్ ఫీచర్ కానెక్ట్ ఎక్స్ యాప్‌తో పనిచేయనుంది FZS-Fi Dlx వేరియంట్‌లో ఎల్‌ఈడీ ఫ్లాషర్స్ జోడింపుతో పాటు ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు ఇతర ఫీచర్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఈ బైక్స్ మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ డీప్ రెడ్, సాలిడ్ గ్రే అనే మూడు రంగుల ఎంపికలలో రానుంది. కలర్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ కలర్స్‌తో రెండో-స్థాయి సింగిల్ సీటును కూడా పొందుతుంది.
ఇంజిన్ విషయానికి వస్తే
కొత్త యమహా FZS-Fi బైక్ అదే బ్లూ కోర్ టెక్నాలజీ 149సీసీ ఇంజిన్‌తో రానుంది. ఈ ఇంజిన్ 7,250 ఆర్‌పీఎమ్ వద్ద 12.4 పీఎస్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తోంది. 5500 ఆర్‌పీఎమ్ వద్ద 13.3 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తోంది.
చదవండి: రికార్డు స్థాయిలో విదేశాలకు హీరో ద్విచక్ర వాహనాల ఎగుమతులు
Comments
Please login to add a commentAdd a comment