Yamaha Motor India Company
-
సరికొత్త లుక్స్‌తో యమహా నయా బైక్..! ధర ఎంతంటే..?
ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం యమహా మోటార్స్ భారత మార్కెట్లలోకి అప్డేట్డ్ వెర్షన్ ఎఫ్‌జెడ్ మోడల్ బైక్‌ను లాంచ్ చేసింది. యమహా FZS-Fi Dlx అనే కొత్త వేరియంట్‌తో పాటుగా FZS-Fi మోడల్ శ్రేణిని విడుదల చేస్తున్నట్లు కంపెనీ సోమవారం రోజున ప్రకటించింది. ఈ సిరీస్ బైక్స్ ఈ నెల రెండో వారం నుంచి అన్నీ యమహా డీలర్షిప్ సెంటర్లలో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ధర ఎంతంటే..? యమహా FZS-Fi ధర రూ. 1, 15,900 కాగా, యమహా FZS-Fi Dlx ట్రిమ్ ధర రూ. 1,18,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. 'ది కాల్ ఆఫ్ ది బ్లూ' చొరవలో భాగంగా కొత్త FZS-Fi శ్రేణి బైక్‌ను ప్రవేశపెట్టినట్లు యమహా పేర్కొంది. స్టైలింగ్ విషయానికి వస్తే..! కొత్త యమహా ఎఫ్జెడ్ఎస్ శ్రేణిలో ఈ బైక్స్ క్రేజీ లుక్స్‌తో బైక్ లవర్స్‌ను ఇట్టే కట్టిపడేస్తోంది. కొత్త FZS-Fi మోడల్ రిఫ్రెష్ స్టైలింగ్‌తో పాటుగా అప్డేట్ ఫీచర్స్‌తో రానుంది. రెండు కొత్త యమహా FZS-Fi మోడల్స్‌లో బ్లూటూత్ ఫీచర్ కానెక్ట్ ఎక్స్ యాప్‌తో పనిచేయనుంది FZS-Fi Dlx వేరియంట్లో ఎల్ఈడీ ఫ్లాషర్స్ జోడింపుతో పాటు ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఇతర ఫీచర్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఈ బైక్స్ మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ డీప్ రెడ్, సాలిడ్ గ్రే అనే మూడు రంగుల ఎంపికలలో రానుంది. కలర్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ కలర్స్‌తో రెండో-స్థాయి సింగిల్ సీటును కూడా పొందుతుంది. ఇంజిన్ విషయానికి వస్తే కొత్త యమహా FZS-Fi బైక్ అదే బ్లూ కోర్ టెక్నాలజీ 149సీసీ ఇంజిన్‌తో రానుంది. ఈ ఇంజిన్ 7,250 ఆర్పీఎమ్ వద్ద 12.4 పీఎస్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తోంది. 5500 ఆర్పీఎమ్ వద్ద 13.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తోంది. చదవండి: రికార్డు స్థాయిలో విదేశాలకు హీరో ద్విచక్ర వాహనాల ఎగుమతులు -
కళ్లు చెదిరే ఆఫర్, ఈ బైక్ కొంటే రూ.1లక్ష వరకు..!
బైక్ లవర్స్‌కు యమహా ఇండియా మోటార్ కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది.ఇండిపెండెన్స్ డే సందర్భంగా పలు వాహనాలపై గిఫ్ట్ ఓచర్లు, రూ.1లక్ష విలువైన బంపర్ ఫ్రైజ్లను అందిస్తున్నట్లు యమహా ప్రకటించింది. కరోనా కారణంగా చతికిల పడ్డ ఆటోమోబైల్ సంస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కష్టమర్లు లేక ఇబ్బందులు పడ్డ పలు ఆటో మొబైల్ సంస్థలు ఆఫర్లు ప్రకటించి సేల్స్‌ను పెంచుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, యమహా రేజడ్ఆర్ 125 ఎఫ్ఐ, యమహా రేజడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ, నాన్ ఐబ్రిడ్ వెహికల్ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ వెహికల్స్ ను ఆగస్ట్ 31లోగా కొనుగోలు చేస్తే రూ.2,999 గిఫ్ట్ ఓచర్స్, రూ.20వేల వరకు అడిషనల్ బెన్ ఫిట్స్ పొందవచ్చని యమహా ఇండియా మోటార్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఒక్క తమిళనాడు మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లో యమహా రేజడ్ఆర్ 125 ఎఫ్ఐ, యమహా రేజడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ, నాన్ ఐబ్రిడ్ వెహికల్ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ వెహికల్స్ కొనుగోలు చేసిన వాహనదారులకు రూ.3,876 ఇన్స్యూరెన్స్ బెన్ ఫిట్స్, రూ.999కే లో డౌన్ పేమెంట్స్ తో బైక్ ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు రూ. 2,999 విలువైన గిఫ్ట్‌ను అందిస్తుంది. తమిళనాడులో యమహా బైక్ కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా రూ.30వేల విలువైన గిఫ్ట్ తో పాటు బంపర్ ఆఫర్ కింద రూ.1లక్ష రూపాయల్ని సొంతం చేసుకోవడమే కాదు..అడిషనల్ బెన్ ఫిట్స్ కింద రూ.20 వేలు దక్కించుకోవచ్చు. ఇక మిగిలిన అన్నీ మోడల్స్ పై రూ. 2,999 విలువైన బహుమతులు, రూ.20వేల అడిషనల్ బెన్ ఫిట్స్‌ను పొందవచ్చు. చదవండి: ఆ..!ఇలా అయితే కార్ల ధరల్ని ఇంకా పెంచాల్సి వస్తుంది -
రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్.. ఎప్పుడు, ఎక్కడ
కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్లకు యమహా గుడ్‌న్యూస్ చెప్పింది. కోవిడ్ కష్టకాలంలో వారు చేసిన సేవలకు గుర్తిస్తూ తమ స్కూటర్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. యమహా సంస్థను నెలకొల్పి 66 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఆఫర్ అందుబాటులోకి తెచ్చామని యమహా తెలిపింది. ఫ్రంట్‌లైన్ వారియర్లకే కరోనా సంక్షోభ సమయంలో రిస్క్ చేసి విధులు నిర్వర్తించిన మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఆర్మీ , మున్సిపాలిటీ సిబ్బందికి తమ ఆఫర్ వర్తిస్తుందని యమహా తెలిపింది. రూ.5000 క్యాష్‌బ్యాక్ యమహాలో పాపులర్ మోడల్స్‌గా ఉన్న ఫాసినో 125 ఎఫ్ఐ, రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ మోడల్స్‌పై రూ. 5,000 డిస్కౌంట్ ఇస్తున్నట్టు యమహా ప్రకటించింది. ఫ్రంట్ లైన్ వర్కర్లందరికీ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తింప చేస్తామని, వారికి తగ్గింపు ధరకే స్కూటర్లు అందిస్తామని యమహా మోటర్ గ్రూప్ ఇండియా చైర్మన్ మోటోఫ్యూమి శితార ప్రకటించారు. ఆన్‌రోడ్ ప్రైస్ @ హైదరాబాద్ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ స్కూటర్ ఆన్‌రోడ్ ధర హైదరాబాద్‌లో రూ. 87,925 ఉండగా యమహా రే జెడ్ఆర్ 125 ధర రూ. 91,125గా ఉంది. కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కరర్లకు ఈ రెండు మోడళ్లపై ప్రత్యేకంగా రూ. 5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను యమహా వర్తింప చేసింది. -
బీఎస్-6 యమహా కొత్త బైక్ లాంచ్..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో త్వరలోనే కొత్త ఉద్గార నిబంధనలు అమలు కానున్న నేపథ్యంలో యమహా కూడా బీఎస్-6 ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేసింది. వైజెడ్ఎఫ్-ఆర్15 (వెర్షన్ 3.0) మోటారు సైకిల్ మోడల్‌ను ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) సోమవారం లాంచ్ చేసింది. దీని ధర రూ .1.45 లక్షలతో ప్రారంభమవుతుంది. 155 సీసీ ఇంజన్‌తో ఈ కొత్త బైక్ డిసెంబర్ మూడవ వారం నుండి భారతదేశంలోని అన్ని కంపెనీ డీలర్‌షిప్‌లలో లభిస్తుందని ఐవైఎం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త బైక్‌లో వెనుక చక్రంలో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ స్విచ్, డ్యూయల్ హార్న్ , రేడియల్ ట్యూబ్లెలెస్ టైర్ వంటి లక్షణాలు ఉన్నాయి. మూడు కలర్ ఆప్షన్లలో లభించే ఈ బైక్ ధర రూ .1.45 లక్షల నుంచి రూ .1.47 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ఉండనుంది. "యమహా ఆర్ సిరీస్‌తో ట్రాక్ పెర్ఫార్మెన్స్ను కొనసాగించడంతపాటు, బీఎస్-6 ఆధారిత ఇంజిన్‌తో కొత్త వైజెడ్ఎఫ్-ఆర్ 15 కొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుటుందని యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మోటోఫుమి షితారా తెలిపారు. -
యమహా నుంచి రెండు సూపర్ బైక్‌లు
న్యూఢిల్లీ: యమహా మోటార్ ఇండియా కంపెనీ రెండు కొత్త సూపర్ బైక్‌లను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. వెజైడ్ఎఫ్-ఆర్1ఎం, వెజైడ్ఎఫ్-ఆర్1.. ఈ రెండు బైక్‌లు 998 సీసీ కేటగిరీ బైక్‌లని కంపెనీ పేర్కొంది. వైజ్డ్ఎఫ్-ఆర్1ఎం ధర రూ.29.43 లక్షలని, వైజడ్ఎఫ్-ఆర్1 ధర రూ.22.34 లక్షల(రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ని వివరించింది. ఆర్డర్లపై మాత్రమే ఈ బైక్‌లను అందించగలమని పేర్కొంది. స్పీడ్ రేసర్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ బైక్‌లను అందిస్తున్నామని, అందుకే తేలికగా, స్లిమ్‌గా, కాంపాక్ట్ లుక్ ఉండేలా వీటిని రూపొందించామనికంపెనీ పేర్కొంది. ప్రత్యేకతలు.. 998 సీసీ లిక్విడ్ కూల్డ్ 4-స్ట్రోక్ ఇంజిన్ ఉన్న ఈ బైక్‌ల్లో 4.2 అంగుళాల టీఎఫ్టీ ఎల్సీడీ స్క్రీన్, టాకో మీటర్, యాక్సిలెరోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, స్లైడ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, ఏబీఎస్ తదితర ఫీచర్లున్నాయి. బైక్ నడిపే వ్యక్తి రెండు విభిన్నమైన డిస్ప్లే మోడ్స్(స్ట్రీట్, ట్రాక్)ను ఎంచుకోవచ్చు. ఇక ఆర్1ఎం మోడల్లో కొన్ని అదనపు ఫీచర్లున్నాయి. బైక్ కంట్రోల్లో ఉండటానికి ముందుభాగంలో ఓహిలిన్స్ రేసింగ్ ఫోర్క్‌లు ఉన్నాయి. డేటా లాగింగ్ సిస్టమ్ మరో ఆకర్షణ. ఈ డేటా లాగింగ్ సిస్టమ్ ల్యాప్ టైమింగ్స్, థ్రోటిల్ పొజిషన్, లీన్ యాంగిల్, తదితర విషయాలను రికార్డ్ చేస్తుంది.