న్యూఢిల్లీ: యమహా మోటార్ ఇండియా కంపెనీ రెండు కొత్త సూపర్ బైక్‌లను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. వెజైడ్‌ఎఫ్-ఆర్1ఎం, వెజైడ్‌ఎఫ్-ఆర్1.. ఈ రెండు బైక్‌లు 998 సీసీ కేటగిరీ బైక్‌లని కంపెనీ పేర్కొంది. వైజ్‌డ్‌ఎఫ్-ఆర్1ఎం ధర రూ.29.43 లక్షలని, వైజడ్‌ఎఫ్-ఆర్1 ధర రూ.22.34 లక్షల(రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ని వివరించింది. ఆర్డర్లపై మాత్రమే ఈ బైక్‌లను అందించగలమని పేర్కొంది. స్పీడ్ రేసర్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ బైక్‌లను అందిస్తున్నామని, అందుకే తేలికగా, స్లిమ్‌గా, కాంపాక్ట్ లుక్ ఉండేలా వీటిని రూపొందించామనికంపెనీ పేర్కొంది.
ప్రత్యేకతలు..
998 సీసీ లిక్విడ్ కూల్డ్ 4-స్ట్రోక్ ఇంజిన్ ఉన్న ఈ బైక్‌ల్లో 4.2 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ స్క్రీన్, టాకో మీటర్, యాక్సిలెరోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, స్లైడ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, ఏబీఎస్ తదితర ఫీచర్లున్నాయి. బైక్ నడిపే వ్యక్తి రెండు విభిన్నమైన డిస్‌ప్లే మోడ్స్(స్ట్రీట్, ట్రాక్)ను ఎంచుకోవచ్చు. ఇక ఆర్1ఎం మోడల్‌లో కొన్ని అదనపు ఫీచర్లున్నాయి. బైక్ కంట్రోల్‌లో ఉండటానికి ముందుభాగంలో ఓహిలిన్స్ రేసింగ్ ఫోర్క్‌లు ఉన్నాయి. డేటా లాగింగ్ సిస్టమ్ మరో ఆకర్షణ. ఈ డేటా లాగింగ్ సిస్టమ్ ల్యాప్ టైమింగ్స్, థ్రోటిల్ పొజిషన్, లీన్ యాంగిల్, తదితర విషయాలను రికార్డ్ చేస్తుంది.
యమహా నుంచి రెండు సూపర్ బైక్‌లు
Published Tue, Apr 14 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM
Advertisement
Advertisement