బీఎస్‌-6 యమహా కొత్త బైక్‌ లాంచ్‌..  | Yamaha launches BS-VI compliant YZF-R15 bike launched | Sakshi
Sakshi News home page

బీఎస్‌-6 యమహా  కొత్త బైక్‌ లాంచ్‌.. 

Published Mon, Dec 9 2019 1:36 PM | Last Updated on Mon, Dec 9 2019 1:55 PM

Yamaha launches BS-VI compliant YZF-R15 bike launched - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో త్వరలోనే కొత్త ఉద్గార నిబంధనలు అమలు కానున్న నేపథ్యంలో యమహా కూడా బీఎస్‌-6 ద్విచక్ర వాహనాన్ని లాంచ్‌ చేసింది.  వైజెడ్ఎఫ్-ఆర్15 (వెర్షన్ 3.0) మోటారు సైకిల్ మోడల్‌ను ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) సోమవారం లాంచ్‌ చేసింది. దీని ధర  రూ .1.45 లక్షలతో ప్రారంభమవుతుంది. 155 సీసీ ఇంజన్‌తో ఈ కొత్త బైక్‌  డిసెంబర్ మూడవ వారం నుండి భారతదేశంలోని అన్ని కంపెనీ డీలర్‌షిప్‌లలో లభిస్తుందని ఐవైఎం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ కొత్త బైక్‌లో వెనుక చక్రంలో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ స్విచ్, డ్యూయల్ హార్న్ ,  రేడియల్ ట్యూబ్‌లెలెస్ టైర్ వంటి లక్షణాలు ఉన్నాయి. మూడు కలర్ ఆప్షన్లలో లభించే ఈ బైక్ ధర రూ .1.45 లక్షల నుంచి రూ .1.47 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ఉండనుంది. "యమహా ఆర్ సిరీస్‌తో ట్రాక్ పెర్ఫార్మెన్స్‌ను కొనసాగించడంతపాటు, బీఎస్‌-6  ఆధారిత ఇంజిన్‌తో కొత్త వైజెడ్ఎఫ్-ఆర్ 15  కొత్త ఫీచర్లతో కస‍్టమర్లను ఆకట్టుకుటుందని  యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మోటోఫుమి షితారా తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement