
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి మాస్ మార్కెట్ లక్ష్యంగా రూపొందించిన చిన్న ఎస్‌యూవీ ‘ఎస్–ప్రెస్సో’ త్వరలో రోడ్డెక్కనుంది. సెప్టెంబరులో ఈ కారు విడుదలకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. గ్రేటర్ నోయిడాలో గతేడాది జరిగిన ఆటో ఎక్స్‌పో సందర్భంగా మారుతి సుజుకి కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. కంపెనీ నుంచి ఇదే అతి చిన్న ఎస్‌యూవీ కావడం గమనార్హం. కాంపాక్ట్ ఎస్‌యూవీ వితారా బ్రెజ్జా కంటే ఇది చిన్నగా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఎస్‌యూవీ కోరుకునేవారికి ఇది బెస్ట్ చాయిస్‌గా నిలుస్తుందని కంపెనీ భావిస్తోంది. బీఎస్–6 ప్రమాణాలతో 1.2 పెట్రోల్ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రూపుదిద్దుకుంది. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఏఎంటీ) మోడల్ కూడా రానుంది. సీఎన్‌జీ వేరియంట్‌ను సైతం రానున్న రోజుల్లో ప్రవేశపెట్టనుంది. బేస్ వేరియంట్ రూ.5 లక్షల లోపు ఉండే అవకాశముంది. వేరియంట్‌నుబట్టి ధర రూ.8 లక్షల దాకా ఉండొచ్చు. యువతను దృష్టిలో పెట్టుకుని మోడర్న్ స్టైలింగ్, క్యాబిన్ ఫీచర్లతో ఆకట్టుకోనుంది. ఆధునిక టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్ వంటివి అదనపు హంగులు.
Comments
Please login to add a commentAdd a comment