సాక్షి, ముంబై : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్‌ఐఎల్) ఎంట్రీ లెవల్ కారు ఆల్టో మరోసారి అమ్మకాల్లో నంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. "ఆల్టో’’ వరుసగా 16 వ సంవత్సరం కూడా భారతదేశంలో నంబర వన్ అమ్మకపు కారుగా నిలిచిందని మారుతి ప్రకటించింది.
40 లక్షల యూనిట్ల సంచిత అమ్మకాల మరో గొప్ప మైలురాయిని అధిగమించామని గురువారం వెల్లడించింది. 76 శాతం భారతీయుల తొలి ఎంపిక తమ కారేనని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశపు తొలి ఎంట్రీ లెవల్ కారు ఆల్టో బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా సరికొత్త భద్రతా ఫీచర్లతో కూడి ఉందని పేర్కొంది. ఇందుకు చాలా సంతోషంగా ఉందని మరే ఇతర భారతీయ కారు సాధించని అమ్మకపు రికార్డు తమ కారు సృష్టించిందని ఎంఎస్‌ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్సే అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
కాగా సెప్టెంబర్ 2000లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఆల్టో ప్రస్తుతం 2.95 లక్షల రూపాయల (ఢిల్లీలో ఎక్స్-షోరూమ్) నుంచి 4.36 లక్షల రూపాయల మధ్య అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment