Alto Car
-
2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా 'గెట్ రెడీ ఫర్ ఏ ఎక్సైటింగ్ సర్ప్రైజ్' అంటూ కస్టమర్లను ఊరిస్తోంది. ఆగస్ట్ 18 నుండి 22, 2022 వరకు క్యాలెండర్‌ను బ్లాక్ చేసుకోమంటూ శుక్రవారం సోషల్ మీడియాద్వారా కోరింది. దీంతో మారుతి థర్డ్ జనరేషన్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు కొత్త 2022 ఆల్టోను ఆవిష్కరించే అవకాశం ఉందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇండియలో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఖ్యాతి దక్కించుకున్న ఆల్టోను కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్లతో సరికొత్తగా లాంచ్ చేయనుంది. కొత్త తరం ఆల్టోకి సంబంధించిన కొన్ని ఫోటోలు అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కంపెనీ కొత్త ఆల్టో కోసం తుది లాంచ్ తేదీని నిర్ధారించలేదని అధికారికంగా ప్రకటించకపోయినా,ఆగస్ట్ 18 -22 మధ్య లాంచ్ అవుతుందని ఖచ్చితంగా తెలుస్తోంది. కొత్త తరం ఆల్టో కి సంబంధించిన కొన్ని ఫోటోలు అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న కొత్త 998cసీసీ ఆల్టో K10 ఇంజన్ అమర్చిందట. ఇది 66 bhp శక్తిని, 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 2022 ఆల్టో యొక్క ప్రారంభ ధర రూ. 3.5 లక్షల (ఎక్స్-షోరూమ్) గా ఉంటుందని అంచనా ఇక మార్కెట్లో పోటీ విషయానికి వస్తే. రెనాల్ట్ క్విడ్, టాటా టియాగో , డాట్సన్ రెడి-గో వంటి వాటికి గట్టిపోటీ ఇస్తుందని అంచనా. ఇది కూడా చదవండి : మహీంద్రాకు ఏమైంది? రెండోసారి ఆ కార్ల రీకాల్ ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు -
మారుతి ఆల్టో: స్పార్క్ లుక్, రెట్రో డిజైన్, ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: జపనీస్ కార్ మేకర్ మారుతి సుజుకి పాపులర్ మోడల్ కారు ఆల్టోను రెట్రో డిజైన్‌లో తీర్చిదిద్ది జపాన్‌లో లాంచ్ చేసింది. సుజుకి ఆల్టో లాపిన్ ఎల్సీ పేరుతో సరికొత్తగా ఫోర్ వీలర్ డ్రైవ్ వేరియంట్‌గా ఈ కారును తీసుకొచ్చింది. ఇండియాలో విక్రయిస్తున్న అత్యంత పాపులర్ కారు ఆల్టోతో పోలిస్తే డిజైన్, స్పెసిఫికేషన్స్‌లో భారీ మార్పులు చేసింది. స్పార్క్ లుక్, రెట్రో డిజైన్‌తో ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, టిల్ట్ ఫంక్షన్‌తో కూడిన స్టీరింగ్ వీల్‌ను అమర్చింది. ముఖ్యంగా 660 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో 3-సిలిండర్ గ్యాసోలిన్ ఇంజన్‌తో అమర్చింది. ఈ ఇంజిన్ సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే కలిపి వస్తుందట. ఇది 63 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. కీలెస్ ఎంట్రీ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఉంది. అలాగే డ్యాష్‌బోర్డ్ Apple CarPlay లేదా Android Autoకి అనుగుణంగా 7 అంగుళాల డిజిటల్ టచ్‌స్క్రీన్‌తో పాటు రివర్సింగ్ కెమెరాను కూడా అందిస్తోంది.. డ్రైవర్ డిస్ప్లేలో డిజిటల్, మైలేజ్, పవర్ రిజర్వ్ ఇతర సంబంధిత డేటాను అందిస్తుంది. జపాన్‌లో ఆల్టో లాపిన్ ఎల్సీ కారు ధర 14 లక్షల ప్రారంభ ధరగా నిర్ణయించింది. ఆ ల్టో లాపిన్ ఎల్సీ, ఆల్-వీల్ డ్రైవ్ , ఆల్-వీల్ డ్రైవ్ రెండు ఆప్షన్లలో ఇది లభించనుంది. అయితే జపాన్ కీ కార్లు, లేదా మినీవాన్ల మోడల్స్ మాదిరిగా ఉన్న ఈ కారు ఇండియా లాంచింగ్‌పై ఇప్పటికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే కొన్ని స్పెసిఫికేషన్స్‌లో కొన్ని మార్పులు చేసిన అనంతరం ఇండియాలో లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. ఈమేరకు దీని ధర 10 లక్షలకు దగ్గరగా ఉండనుందని అంచనా. -
మారుతి ఆల్టో రికార్డు
సాక్షి, ముంబై : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) ఎంట్రీ లెవల్ కారు ఆల్టో మరోసారి అమ్మకాల్లో నంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. "ఆల్టో’’ వరుసగా 16 వ సంవత్సరం కూడా భారతదేశంలో నంబర వన్ అమ్మకపు కారుగా నిలిచిందని మారుతి ప్రకటించింది. 40 లక్షల యూనిట్ల సంచిత అమ్మకాల మరో గొప్ప మైలురాయిని అధిగమించామని గురువారం వెల్లడించింది. 76 శాతం భారతీయుల తొలి ఎంపిక తమ కారేనని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశపు తొలి ఎంట్రీ లెవల్ కారు ఆల్టో బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా సరికొత్త భద్రతా ఫీచర్లతో కూడి ఉందని పేర్కొంది. ఇందుకు చాలా సంతోషంగా ఉందని మరే ఇతర భారతీయ కారు సాధించని అమ్మకపు రికార్డు తమ కారు సృష్టించిందని ఎంఎస్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్సే అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. కాగా సెప్టెంబర్ 2000లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఆల్టో ప్రస్తుతం 2.95 లక్షల రూపాయల (ఢిల్లీలో ఎక్స్-షోరూమ్) నుంచి 4.36 లక్షల రూపాయల మధ్య అందుబాటులో ఉంది. -
‘ఆల్టో’ ధరకు రెక్కలు
న్యూఢిల్లీ: మారుతి సుజుకి తన బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ వాహనంగా అగ్రస్థానంలో ఉన్న ఆల్టో కారు ధరలను పెంచింది. పలు భద్రతా ఫీచర్లను ఈ కారులో జోడించిన కారణంగా ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ వివరించింది. పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని గురువారం ప్రకటించింది. ఢిల్లీ ఎన్సీఆర్లో ఈ కారు నూతన ధరల శ్రేణి రూ.3.65 లక్షలు నుంచి రూ.4.44 లక్షలకు చేరింది. తాజా పెంపు నిర్ణయంతో ఈ ప్రాంతంలో రూ.23,000 ధర పెరిగింది. ఇతర ప్రాంతాల్లో ధరల శ్రేణి రూ.3.75 లక్షల నుంచి రూ.4.54 లక్షలుగా ఉంది. ఏబీఎస్ (యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), రివర్స్ పార్కింగ్ సెన్సార్, డ్రైవర్‌తో పాటు అతని పక్కన కూర్చున్న వ్యక్తికి సీట్ బెల్ట్ రిమైండర్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తున్నట్లు తెలిపింది. -
కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద మరో దుర్ఘటన జరిగింది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన ప్రాంతానికి సమీపంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఓ ఆల్టో కారు దగ్ధం కావడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సమాచారం తెలుసుకున్న గజ్వేల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. కారులో సజీవ దహనమైన మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
అదరగొట్టిన ఆల్టో.. మళ్లీ టాప్ గేర్‌లో
సాక్షి, న్యూఢిల్లీ: మారుతి సుజుకి ఆల్టో మరోసారి అదరగొట్టింది. అక్టోబర్ నెల విక్రయాల్లో మారుతి సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) ఆల్టో మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్(ఎస్ఐఏఎం) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబరు నెలలో మారుతికే చెందిన డిజైర్‌ను వెనక్కి నెట్టి టాప్‌ప్లేస్‌ను దక్కించుకుంది. గత ఆగస్టు, సెప్టెంబరు మాస అమ్మకాల్లో ఆల్టోను వెనక్కి నెట్టి.. మారుతి డిజైర్ మొదటి స్థానంలో నిలిచింది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) లెక్కల ప్రకారం అక్టోబర్ లో 19,447 యూనిట్లు అమ్ముడుపోయాయి కాగా డిజైర్ 17,447 యూనిట్లకు పరిమితం కావడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఆల్టో రికార్డును డిజైర్ బద్దలు కొట్టింది. ఆల్టో మోడల్ 21,521 యూనిట్లు విక్రయమవ్వగా, డిజైర్ ఏకంగా 26,140 యూనిట్లు అమ్ముడుపోయాయి. హ్యుందాయ్ కాంపాక్ట్ మోడల్ గ్రాండ్ ఐ 10 అమ్మకాలు 14,417 యూనిట్లుగా నమోదయ్యాయి. 2016 అక్టోబర్‌లో ఇది 14,530 యూనిట్లు విక్రయించింది. అలాగే అక్టోబరులో నమోదైన అమ్మకాల్లో టాప్ 10 కార్లలో మారుతి సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ)కు చెందినవి ఏడు మోడల్స్ ఉన్నాయి. మిగిలిన మూడు హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాలు. ఇక బాలెనో 14,532 యూనిట్లతో మూడో స్థానంలో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 14,417 యూనిట్లతో నాలుగో స్థానంలో నిలవగా, వ్యాగన్ ఆర్ 13,043 యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెలెరియో(12,203), సిఫ్ట్(12,057), వితారా బ్రెజా(11,684), హ్యుందాయ్ ఇలైట్ ఐ20(11,012), ఎస్యూవీ క్రెటా(9,248)లు ఉన్నాయి. -
డివైడర్‌ను ఢీకొన్న కారు,ఇద్దరికి గాయాలు
-
బండెనక బం‘ఢీ’
మేడ్చల్: పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం సమయంలో రోడ్డుపై ఆగిఉన్న టిప్పర్ ను వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీకొంది. ఆ కారును మరో కారు.. వాటిని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్వల్పం గా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఓ టిప్పర్ మేడ్చల్‌లోని జాతీయ రహదారిపై నగరం వైపు వెళ్తోంది. ఈక్రమంలో పోలీస్‌స్టేషన్ సమీపంలో టిప్పర్ డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని నిలిపాడు. దీంతో వెనుక నుండి వస్తున్న ఓ ఆల్టో కారు టిప్పర్‌ను ఢీకొంది. ఆ కారును వెనుక నుంచి వచ్చిన మరో ఆల్టో కారు ఢీకొంది. ఈ రెండు కార్లను వెనుక నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. టిప్పర్‌ను రెండు కార్లు ఢీకొనడం.. కార్లను బస్సు ఢీకొనడం.. ఆ దృశ్యాలు చూసిన జనం.. ఏదో పెను ప్రమాదం సంభవించిందని ఆందోళనకు గురయ్యారు. ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులు ఉన్నా డ్రైవర్ వేగాన్ని అదుపు చేయడంతో ఎవరికీ గాయాలు కాలేదు. రెండు కార్లలో ఉన్న ఛాయారెడ్డితో పా టు మహిళ గంగుకు స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడం తో వాహనాలు స్తంభించిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.