సాక్షి, న్యూఢిల్లీ: మారుతి సుజుకి ఆల్టో మరోసారి అదరగొట్టింది. అక్టోబర్ నెల విక్రయాల్లో మారుతి సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ) ఆల్టో మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్(ఎస్‌ఐఏఎం) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబరు నెలలో మారుతికే చెందిన డిజైర్‌ను వెనక్కి నెట్టి టాప్‌ప్లేస్‌ను దక్కించుకుంది.
గత ఆగస్టు, సెప్టెంబరు మాస అమ్మకాల్లో ఆల్టోను వెనక్కి నెట్టి.. మారుతి డిజైర్ మొదటి స్థానంలో నిలిచింది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) లెక్కల ప్రకారం అక్టోబర్ లో 19,447 యూనిట్లు అమ్ముడుపోయాయి కాగా డిజైర్ 17,447 యూనిట్లకు పరిమితం కావడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఆల్టో రికార్డును డిజైర్ బద్దలు కొట్టింది. ఆల్టో మోడల్ 21,521 యూనిట్లు విక్రయమవ్వగా, డిజైర్ ఏకంగా 26,140 యూనిట్లు అమ్ముడుపోయాయి. హ్యుందాయ్ కాంపాక్ట్ మోడల్ గ్రాండ్ ఐ 10 అమ్మకాలు 14,417 యూనిట్లుగా నమోదయ్యాయి. 2016 అక్టోబర్లో ఇది 14,530 యూనిట్లు విక్రయించింది.
అలాగే అక్టోబరులో నమోదైన అమ్మకాల్లో టాప్ 10 కార్లలో మారుతి సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ)కు చెందినవి ఏడు మోడల్స్ ఉన్నాయి. మిగిలిన మూడు హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాలు. ఇక బాలెనో 14,532 యూనిట్లతో మూడో స్థానంలో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 14,417 యూనిట్లతో నాలుగో స్థానంలో నిలవగా, వ్యాగన్ ఆర్ 13,043 యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెలెరియో(12,203), సిఫ్ట్(12,057), వితారా బ్రెజా(11,684), హ్యుందాయ్ ఇలైట్ ఐ20(11,012), ఎస్‌యూవీ క్రెటా(9,248)లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment