సాక్షి, ముంబై: జపనీస్ కార్ మేకర్ మారుతి సుజుకి పాపులర్ మోడల్ కారు ఆల్టోను రెట్రో డిజైన్‌లో తీర్చిదిద్ది జపాన్‌లో లాంచ్ చేసింది. సుజుకి ఆల్టో లాపిన్ ఎల్‌సీ పేరుతో సరికొత్తగా ఫోర్ వీలర్ డ్రైవ్ వేరియంట్‌గా ఈ కారును తీసుకొచ్చింది. ఇండియాలో విక్రయిస్తున్న అత్యంత పాపులర్ కారు ఆల్టోతో పోలిస్తే డిజైన్, స్పెసిఫికేషన్స్‌లో భారీ మార్పులు చేసింది. స్పార్క్ లుక్, రెట్రో డిజైన్‌తో ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, టిల్ట్ ఫంక్షన్‌తో కూడిన స్టీరింగ్ వీల్‌ను అమర్చింది.
ముఖ్యంగా 660 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో 3-సిలిండర్ గ్యాసోలిన్ ఇంజన్‌తో అమర్చింది. ఈ ఇంజిన్ సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే కలిపి వస్తుందట. ఇది 63 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. కీలెస్ ఎంట్రీ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఉంది. అలాగే డ్యాష్‌బోర్డ్ Apple CarPlay లేదా Android Autoకి అనుగుణంగా 7 అంగుళాల డిజిటల్ టచ్‌స్క్రీన్‌తో పాటు రివర్సింగ్ కెమెరాను కూడా అందిస్తోంది.. డ్రైవర్ డిస్‌ప్లేలో డిజిటల్, మైలేజ్, పవర్ రిజర్వ్ ఇతర సంబంధిత డేటాను అందిస్తుంది.
జపాన్‌లో ఆల్టో లాపిన్ ఎల్‌సీ కారు ధర 14 లక్షల ప్రారంభ ధరగా నిర్ణయించింది. ఆ ల్టో లాపిన్ ఎల్‌సీ, ఆల్-వీల్ డ్రైవ్ , ఆల్-వీల్ డ్రైవ్ రెండు ఆప్షన్లలో ఇది లభించనుంది. అయితే జపాన్ కీ కార్లు, లేదా మినీవాన్ల మోడల్స్ మాదిరిగా ఉన్న ఈ కారు ఇండియా లాంచింగ్‌పై ఇప్పటికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే కొన్ని స్పెసిఫికేషన్స్‌లో కొన్ని మార్పులు చేసిన అనంతరం ఇండియాలో లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. ఈమేరకు దీని ధర 10 లక్షలకు దగ్గరగా ఉండనుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment