బండెనక బం‘ఢీ’ | medchal city in road incident two cars Tippar collided | Sakshi
Sakshi News home page

బండెనక బం‘ఢీ’

Published Mon, Jun 29 2015 12:00 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

బండెనక బం‘ఢీ’ - Sakshi

బండెనక బం‘ఢీ’

మేడ్చల్: పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం సమయంలో రోడ్డుపై ఆగిఉన్న టిప్పర్ ను వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీకొంది. ఆ కారును మరో కారు.. వాటిని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్వల్పం గా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఓ టిప్పర్ మేడ్చల్‌లోని జాతీయ రహదారిపై నగరం వైపు వెళ్తోంది. ఈక్రమంలో పోలీస్‌స్టేషన్ సమీపంలో టిప్పర్ డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని నిలిపాడు.

దీంతో వెనుక నుండి వస్తున్న ఓ ఆల్టో కారు టిప్పర్‌ను ఢీకొంది. ఆ కారును వెనుక నుంచి వచ్చిన మరో ఆల్టో కారు ఢీకొంది. ఈ రెండు కార్లను వెనుక నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. టిప్పర్‌ను రెండు కార్లు ఢీకొనడం.. కార్లను బస్సు ఢీకొనడం.. ఆ దృశ్యాలు చూసిన జనం.. ఏదో పెను ప్రమాదం సంభవించిందని ఆందోళనకు గురయ్యారు. ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులు ఉన్నా డ్రైవర్ వేగాన్ని అదుపు చేయడంతో ఎవరికీ గాయాలు కాలేదు.

రెండు కార్లలో ఉన్న ఛాయారెడ్డితో పా టు మహిళ గంగుకు స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడం తో వాహనాలు స్తంభించిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement