న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో ఆటో రంగం అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ రంగంలోని దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ ఇండియా వంటి సంస్థలు అమ్మకాల్లో పురోగతిని చూపాయి. దాదాపు 7 నెలల అనంతరం మారుతీ 4.5 శాతం వృద్ధి రేటుతో సానుకూల సంకేతాలను ఇచి్చంది. ప్యాసింజర్, వాణిజ్య విక్రయాలు గతంతో పోలి్చతే అక్టోబర్‌లో మెరుగ్గా ఉన్నాయని ఎం అండ్ ఎం చీఫ్ (సేల్స్ అండ్ మార్కెటింగ్, ఆటోమోటివ్ డివిజన్) విజయ్ రామ్ నక్రా అన్నారు.
పండుగల సీజన్ అమ్మకాల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపించినట్లు టీకేఎం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా వెల్లడించారు. నెమ్మదించిన ఆటో రంగంలో ఆశాజనక వాతావరణం అలముకుందని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయెల్ వెల్లడించారు.
క్యూ5, క్యూ7 ధరలను తగ్గించిన ఆడీ
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’.. తన పాపులర్ ఎస్‌యూవీలైన ‘క్యూ5, క్యూ7’ ధరలను తగ్గించింది. గతంలో రూ. 55.8 లక్షలుగా ఉన్న క్యూ5 ధరను రూ. 49.99 లక్షలకు తగ్గించింది. క్యూ7 పెట్రోల్ వెర్షన్ ధరను రూ. 68.99 లక్షలకు, డీజిల్ వెర్షన్ ధరను రూ. 71.99 లక్షలకు తగ్గించినట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment