న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు డిసెంబర్‌లో మిశ్రమంగా నమోదయ్యాయి. దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సహా హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) వాహన అమ్మకాల్లో బలమైన వృద్ధి కనిపించింది. ఇవి రెండంకెల వృద్ధితో 2017కి బై బై చెప్పాయి. మరొకవైపు హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహన విక్రయాల్లో స్వల్ప వృద్ధి నమోదు కాగా, మహీంద్రా(ఎంఅండ్ ఎం) ప్యాసింజర్ అమ్మకాల్లో క్షీణత కనిపించింది.
మారుతీ దేశీ విక్రయాలు 12.1% వృద్ధితో 1,06,414 యూనిట్ల నుంచి 1,19,286 యూనిట్లకు ఎగశాయి. స్విఫ్ట్, డిజైర్, బాలెనో వంటి కార్లకు అధిక డిమాండ్ దీనికి కారణం. హెచ్‌సీఐఎల్ దేశీ అమ్మకాలు 26% మేర పెరిగాయి. 10,071 యూనిట్ల నుంచి 12,642 యూనిట్లకు చేరాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీ అమ్మకాలు 40,057 యూనిట్ల నుంచి 40,158 యూనిట్లకు స్వల్పంగా పెరిగాయి.
ఏడాది మొత్తంగా చూస్తే కంపెనీ దేశీ విక్రయాల్లో 5.4 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 5,00,539 యూనిట్ల నుంచి 5,27,320 యూనిట్లకు ఎగశాయి. స్కార్పియో, ఎక్స్‌యూవీ 500, బొలెరో, వెరిటో, జైలో సహా మహీంద్రా ప్యాసింజర్ వాహన విక్రయాలు 7% క్షీణించాయి. 16,799 యూనిట్ల నుంచి 15,543 యూనిట్లకు తగ్గాయి. అయితే దేశీ విక్రయాలు 7% వృద్ధితో 34,411 యూనిట్లతో 36,979 యూనిట్లకు పెరిగాయి.
కంపెనీ దేశీ వాహన విక్రయాలు వృ/క్షీ
2017 2016
మారుతీ సుజుకీ 1,19,286 1,06,414 12
హోండా కార్స్ 12,642 10,071 26
హ్యుందాయ్ 40,158 40,057 ––
మహీంద్రా 36,979 34,411 7
Comments
Please login to add a commentAdd a comment