2 కోట్ల మైలు రాయిని దాటిన మారుతీ | Maruti Suzuki crosses 2 crore production milestone | Sakshi
Sakshi News home page

2 కోట్ల మైలు రాయిని దాటిన మారుతీ

Published Tue, Jul 24 2018 12:35 AM | Last Updated on Tue, Jul 24 2018 12:35 AM

Maruti Suzuki crosses 2 crore production milestone - Sakshi

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ (ఎంఎస్‌ఐఎల్‌) సరికొత్త మైలురాయిని అధిగమించింది. గురుగ్రామ్, మానెసర్‌ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయిన వాహనాల సంఖ్య 2 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.1983 నుంచి ఉత్పత్తిని కొనసాగిస్తున్న ఈ సంస్థ 34 ఏళ్ల 6 నెలలకాలంలో ఈ ఘనతను సాధించినట్లు తెలిపింది.

ఇంతటి రికార్డును సాధించిన తొలి దేశీయ కంపెనీగా చరిత్ర సృష్టించినట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ – సీఈఓ కెనిచి అయుకవా వెల్లడించారు. ప్రస్తుతం 16 మోడ    ల్‌ కార్లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తం గా 100 దేశాలకు ఎగుమతులు కొనసాగిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement