mile stone
-
సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి..
ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ ( Warren Buffett ) కు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ కంపెనీ బెర్క్‌షైర్ హతావే ( Berkshire Hathaway ) ఒక ట్రిలియన్ డాలర్ల (రూ. 82 లక్షల కోట్లకుపైగా) ఆస్తులను ఆర్జించి చారిత్రక మైలురాయిని సాధించింది. సంపద సృష్టికి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఇటీవల విడుదల చేసిన కంపెనీ రెండవ త్రైమాసిక డేటా ప్రకారం, బెర్క్‌షైర్ హతావే జూన్ చివరి నాటికి 1.04 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. వీటిలో దాని స్టాక్ పోర్ట్‌ఫోలియో ద్వారానే అత్యధిక సంపద ఉంది. ఇది త్రైమాసికం చివరి నాటికి 353 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. ఇందులో 178 బిలియన్ డాలర్లు ఒక్క యాపిల్ సంస్థలోనే ఉన్నాయి. 33 వేల రెట్లు పెంచిన బఫెట్ ట్రిలియన్ మైలురాయి దాటి ఆకట్టుకున్న బెర్క్‌షైర్ హతావే ఆస్తులు వారెన్ బఫెట్‌కు ముందు 1964లో 30 మిలియన్ డాలర్లు. ఈ మొత్తం 30 సంవత్సరాలలో 700 రెట్లు పెరిగి 1994లో దాదాపు 21 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అప్పటి నుంచి బెర్క్‌షైర్ ఆస్తులు మరో 48 రెట్లు పెరిగాయి. మొత్తంగా వారెన్ బఫెట్ సీఈవో ఉన్న సమయంలో కంపెనీ ఆస్తులను 33,000 రెట్లు పెంచారు. యాపిల్ కంటే మూడింతలు ఇటీవలి త్రైమాసికం ముగింపులో యాపిల్ కంపెనీ 335 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. ఇందులో 167 బిలియన డాలర్లు నగదు, సెక్యూరిటీలు, ఇతర రూపాల్లో ఉన్నాయి. అమెజాన్ 463 బిలియన్ డాలర్ల ఆస్తులను క్లెయిమ్ చేయగా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, మెటా 200 నుంచి 400 బిలియన్ డాలర్ల వరకు ఆస్తులను నివేదించాయి. ఇక బెర్క్షైర్తో పోల్చదగిన మార్కెట్ విలువ కలిగిన టెస్లా జూన్ చివరి నాటికి కేవలం 91 బిలియన్ డాలర్ల ఆస్తులను మాత్రమే కలిగి ఉంది. 768 బిలియన్ డాలర్ల బెర్క్‌షైర్ కంటే అధికంగా దాదాపు 1.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూ కలిగిన ఎన్విడియా, తాజా లెక్కల ప్రకారం 44 బిలియన్ డాలర్ల ఆస్తులను మాత్రమే కలిగి ఉంది. -
3.5 లక్షల కోట్ల డాలర్లు.. భారత ఆర్థిక వ్యవస్థ రికార్డ్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ 2022లో 3.5 లక్షల కోట్ల డాలర్లను దాటిందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న కొన్ని సంవత్సరాల్లో జీ–20 దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంచనాలనూ వ్యక్తం చేసింది. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణ విషయంలో కొంత వెనుకబాటుకు గురయ్యే వీలుందని అంచనా వేసింది. సంస్కరణల అమల్లో వేగం లేకపోవడం, బ్యూరోక్రసీ నిర్ణయాల్లో నెమ్మది వంటి అంశాలు తమ ఈ అంచనాలకు కారణంగా పేర్కొంది. అమెరికా కేంద్రంగా పనిచేసే మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనాల్లో ముఖ్యాంశాలు... బ్యూరోక్రసీ స్థాయిలో లైసెన్సులను పొందడంలో ఆలస్యం జరగవచ్చు. ఈ నేపథ్యంలో వ్యాపారాలు నెలకొల్పడం, ఇందుకు సంబంధించి ఆమోద ప్రక్రియలో నెమ్మది చోటుచేసుకునే వీలుంది. ప్రాజెక్టుల అమలూ ఆలస్యం కావచ్చు. ఆయా అంశాలు దేశానికి ఎఫ్‌డీఐ ఆకర్షణను కొంత తగ్గించవచ్చు. అదే సమయంలో ఈ విషయంలో ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాల నుంచి గట్టి పోటీ ఉంటుంది. పెద్ద సంఖ్యలో యువత, విద్యావంతులైన శ్రామికశక్తి, చిన్న కుటుంబాల పెరుగుదల, పట్టణీకరణ వంటి అంశాలు దేశంలో సిమెంట్, గృహ నిర్మాణం, కొత్త కార్ల కోసం డిమాండ్‌ను పెంచుతుంది. ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయం.. ఉక్కు, సిమెంట్ రంగాలకు కలిసి వచ్చే అంశం. కాలుష్యం కట్టడికి, పునరుత్పాదకత రంగానికి దేశం ఇస్తున్న ప్రాధాన్యత ఇక్కడ ప్రధానంగా ప్రస్తావనీయాంశం. ఇది పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. తయారీ, మౌలిక రంగాలకు సంబంధించిన డిమాండ్ వచ్చే దశాబ్ద కాలంలో వార్షికంగా 3 నుంచి 12 శాతం మేర నమోదుకావచ్చు. అయతే 2030 నాటికి భారతదేశ సామర్థ్యం చైనా కంటే చాలా వెనుకబడే ఉంటుంది. ఎకానమీ పటిష్టంగా కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ, కీలక తయారీ, మౌలిక రంగాల్లో పెట్టుబడులు బలహీనంగానే కొనసాగే వీలుంది. ఎకానమీ సంస్కరణల విషయంలో పరిమితులు, విధాన నిర్ణయాల్లో అమలు వంటి అంశాలు దీనికి కారణం కావచ్చు. భూసేకరణ నిర్ణయాల్లో ఆమోదాలు, నియంత్రణా పరమైన క్లియరెన్స్‌లు, లైసెన్సులు పొందడం, వ్యాపారాలను స్థాపించడం వంటి వాటి కోసం ఎంత సమయం అవసరమో ఖచ్చితంగా తెలియకపోవడం భారత్ విధాన పరమైన అంశాల్లో ప్రధాన లోపం. ఇది ప్రాజెక్టుల అమల్లో తీవ్ర జాప్యాలకు కారణం అవుతోంది. ఆయా అంశాలతో పాటు ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి వేగంలేకపోవడం విదేశీ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుంది. అవినీతిని తగ్గించడానికి, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడానికి, పన్నుల వసూళ్లు బేస్ పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అయితే వీటిలోనూ అవరోధాలు కనబడుతున్నాయి. కార్మిక చట్టాల్లో సౌలభ్యాన్ని పెంపొందించడం, వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను విస్తరించడం, తయారీ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంసహా గత కొన్ని సంవత్సరాలుగా పలు రంగాల పురోగతికి చేపట్టిన చర్యలు పటిష్టవంతంగా అమలు జరిగితే అది దేశ పటిష్ట అధిక ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. ఇదీ చదవండి: Income Tax Return: అందుబాటులోకి ఐటీఆర్ 1, 4 ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా.. -
హిప్ హిప్ హుర్రే! దూసుకుపోతున్న థార్
సాక్షి, ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా పాపులర్ వెహికల్ మహీంద్రా థార్ దూసుకుపోతోంది. తన ఐకానిక్ ఆఫ్-రోడర్ 100,000 యూనిట్ల గణనీయమైన ఉత్పత్తి మైలురాయిని చేరుకున్నట్లు మహీంద్రా తాజాగా ప్రకటించింది. సరికొత్త థార్ లాంచ్ చేసిన కేవలం రెండున్నర ఏళ్లలోనే ఈ మైలురాయిని సాధించిందని పేర్కొంది. దేశంలో థార్‌కు లభిస్తున్న ప్రజాదరణ, సక్సెస్‌కి ఇది నిదర్శనమని మహీంద్రా తెలిపింది. అసాధారణ పనితీరు, డిజైన్‌కు గాను ఇప్పటికే పలు అవార్డులు, ప్రశంసలు దక్కించుకుంది. థార్ ఉత్పత్తిలో 100,000 యూనిట్ల కీలక మైలురాయిని చేరుకోవడం చాలా గర్వంగా ఏందని వీజయ్ నక్రా, (ప్రెసిడెంట్ - ఆటోమోటివ్ డివిజన్, ఎం అండ్ లిమిటెడ్) సంతోషాన్ని ప్రకటించారు. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) మహీంద్రా థార్ అద్భుతమైన డిజైన్, ఫీచర్లు, కెపాసిటీతో బాగా ఆకట్టుకుంటోంది. ఆల్-టెరైన్ సామర్థ్యాలతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కూడా అందిస్తుంది. థార్ ఇప్పుడు 4x4, ఆర్డబ్ల్యూడీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. పాత థార్ రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. వీటిలో 2.0-లీటర్, 4-సిలిండర్ mStallion పెట్రోల్ ఇంజీన్ 150 BHP , 320 గరిష్ట్ టార్క్‌ను, 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజీన్ 130 బీహెచ్పీ పవర్‌ను, 320గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి. (Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?) ఇక బలమైన డ్రైవ్‌ట్రెయిన్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ , మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్, షిఫ్ట్-ఆన్-ది-ఫ్లై ట్రాన్స్ఫర్ కేస్ వంటి అధునాతన ఫీచర్లతో 4x4 వేరియంట్ ఆఫ్-రోడ్ ఔత్సాహికులకు సరిజోడి లాంటిది. అలాగే RWD వేరియంట్ థార్ నగరం ,హైవే వినియోగానికి వీలుగా విలక్షణమైన డిజైన్ , ఖరీదైన రైడ్ కోసం చూసే వినియోగదారులకు అనువైనది. -
మిలియన్ యూనిట్ల తయారీ మైలురాయి దాటిన కేటీఎం
హైదరాబాద్: ప్రపంచంలో నెంబర్ 1 ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ కేటీఎం భారతదేశంలో మిలియన్ యూనిట్ల తయారీ మైలురాయిని అధిగమించింది. పుణేలోని బజాజ్ చకన్ ప్లాంట్ నుండి 1 మిలియన్ కేటీఎం మోటార్ సైకిల్– కేటీఎం అడ్వెంచర్ 390 విడుదలైంది. రికార్డు బైక్ ఆవిష్కరణ కార్యక్రమంలో బజాజ్ ఆటో ఎండీ, సీఈఓ రాజీవ్ బజాజ్, పియరర్ మొబిలిటీ ఏజీ (కేటీఎం మాతృ సంస్థ) సీఈఓ స్టీఫన్ పీరర్ (ఫొటోలో ఎడమ నుంచి కుడికి) తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రియన్ బ్రాండ్ కేటీఎం తన సబ్–400 సీసీ మోటార్‌సైకిళ్ల దేశీయ, ఎగుమతి యూనిట్ల తయారీకి బజాజ్ ఆటోతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. కేటీఎం ఇండియా 2014లో 1,00,000వ మోటార్‌సైకిల్‌ను, 2020లో 5,00,000వ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కేవలం మరో మూడేళ్ల వ్యవధిలోనే కీలక మిలియన్ మైలురాయికి చేరుకోవడం గమనార్హం. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
టెస్లా మరో ఘనత: ఆనందంలో ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా కీలక మైలురాయిని అధిగమించింది. టెస్లా 3 మిలియన్ల కార్ ప్రొడక్షన్ మార్క్‌ను క్రాస్ చేసిందని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించారు.ఈ సందర్భంగా టెస్ల సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. 3 మిలియన్ల కార్లను తయారు చేసినందుకు అభినందనలు గిగా షాంఘై! మొత్తంగా టెస్లా 3 మిలియన్లకు పైగా ఉత్పత్తి మార్క్‌ను దాటేసింది అంటూ మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. చైనాలో టెస్లా మూడవ అతిపెద్ద వాహన తయారీ సంస్థ. ఈ ఏడాది ప్రథమార్థంలో దాదాపు 2లక్షల వాహనాలను కస్టమర్లకు డెలివరీ చేసింది. టెస్లా కార్లు ఇప్పటివరకు 40 మిలియన్ మైళ్లకు పైగా సాధించింది. ఈ ఏడాది చివరికి 100 మిలియన్ మైళ్లకు చేరాలని కంపెనీ భావిస్తోంది. రానున్న సంవత్సరాల్లో టెస్లా కనీసం 10 లేదా 12 గిగాఫ్యాక్టరీలను నిర్మించవచ్చని ఇటీవల ఎలాన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే 2019లో ప్రకటించిన, చాలాకాలంగా ఎదురుచూస్తున్న సైబర్‌ట్రక్ కూడా త్వరలో ఆవిష్కృత మవుతుందన్నారు. కాగా క్యూ2లో టెస్లా 16.93 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నివేదించింది. బెర్లిన్ వెలుపల టెస్లా కొత్త ఫ్యాక్టరీ జూన్‌లో వారానికి వెయ్యి కార్లను దాటిందని మస్క్ వెల్లడించారు. Congrats Giga Shanghai on making millionth car! Total Teslas made now over 3M. pic.twitter.com/2Aee6slCuv — Elon Musk (@elonmusk) August 14, 2022 -
బీజేపీ మరో ఘనత.. పెద్దల సభలో ‘సెంచరీ’
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. రాజ్యసభలోనూ ‘సెంచరీ’ కొట్టి రికార్డు సృష్టించింది. బీజేపీ చరిత్రలో తొలిసారిగా 100 మంది రాజ్యసభ సభ్యులను కలిగిన ఘనత సాధించింది. గురువారం జరిగిన ఎన్నికల్లో అసోం, త్రిపుర, నాగాలాండ్‌లో ఒక్కో సీటును గెలుచుకోవడంతో బీజేపీ ‘వంద’ మార్క్‌ను అందుకుంది. 1990 తర్వాత వంద మంది రాజ్యసభ సభ్యులను కలిగిన తొలి పార్టీగా బీజేపీ అవతరించింది. ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఇటీవల జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో మూడు ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కొక్కటి చొప్పున బీజేపీ గెలుచుకుంది. ఈ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఐదు స్థానాలు ప్రతిపక్ష పార్టీలవే కావడం గమనార్హం. పంజాబ్‌లో తనకున్న ఒక స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం ఐదు స్థానాల్లోనూ విజయం సాధించింది. (క్లిక్: హైడ్రామా.. కాంగ్రెస్ కొంప ముంచిన ఎమ్మెల్యేలు) తాజా ఎన్నికల ఫలితాలను రాజ్యసభ అధికారిక వెబ్సైట్లో ఇంకా అప్డేట్ చేయలేదు. ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో 97 మంది సభ్యులు ఉన్నారు. తాజాగా గెలిచిన మూడు సీట్లు కలిపితే బీజేపీ సభ్యుల సంఖ్య వందకు చేరుకుంటుంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో మెజారిటీ మార్క్‌కు బీజేపీ సభ్యుల సంఖ్య తక్కువగానే ఉంది. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి రాజ్యసభలో బీజేపీ బలం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2014లో రాజ్యసభలో బీజేపీకి 55 మంది సభ్యులు ఉండగా.. తర్వాత అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ఈ సంఖ్య ఇపుడు సెంచరీ మైలురాయిని అందుకుంది. 1990లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి 108 మంది సభ్యులు ఉన్నారు. తర్వాత నుంచి ప్రాంతీయ పార్టీల హవా మొదలుకావడంతో రాజ్యసభలో కాంగ్రెస్ బలం తగ్గుతూ వచ్చింది. కాగా, బీజేపీ కొద్దిరోజులు మాత్రమే సెంచరీ మార్క్‌ను నిలబెట్టుకునే అవకాశముంది. ఎందుకంటే త్వరలో మరో 52 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్ సహా రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా స్కోప్ లేదు. కాబట్టి వంద మార్క్‌ను నిలుపుకోవడం కష్టమే. ఉత్తరప్రదేశ్‌లో ఖాళీకానున్న 11 స్థానాల్లో ఎనిమిదింటిని బీజేపీ గెలుచుకునే అవకాశముంది. యూపీ నుంచి రిటైర్ అవుతున్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురు బీజేపీకి చెందిన వారు ఉన్నారు. పెద్దల సభలో బీజేపీ బలం పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో బిల్లులను ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆమోదించుకునే వీలు కలుగుతుంది. అంతేకాదు త్వరలో జరగబోయే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ గెలుపు సులువు అవుతుంది. (క్లిక్: ఆ 72 మంది ఎంపీలతో ప్రధాని ఫొటో సెషన్) -
కోహ్లి డబుల్ సెంచరీ.. ఆర్సీబీ కెప్టెన్ ఖాతాలో మరో రికార్డు
అబుదాబీ: ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. లీగ్ చరిత్రలో ఒకే జట్టు తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి బెంగళూరు జట్టుకే ప్రాతినిధ్యం వహించిన కోహ్లి.. నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌తో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లి తర్వాత ఒకే జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 182 మ్యాచ్‌లు ఆడాడు. వీరిద్దరి తర్వాత సురేశ్ రైనా(సీఎస్కే తరఫున 172 మ్యాచ్‌లు), కీరన్ పోలార్డ్(ముంబై ఇండియన్స్ తరఫున 172 మ్యాచ్‌లు), రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్ తరఫున 162 మ్యాచ్‌లు) వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. ఇక ఇవాళ కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. మ్యాచ్ రెండో ఓవర్లోనే ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 4 బంతులను ఎదుర్కొన్న విరాట్.. ఓ బౌండరీ బాది 5 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లి ఔట్ అయ్యే సమయానికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. క్రీజ్‌లో పడిక్కల్(4), అరంగేట్రం కుర్రాడు శ్రీకర్ భరత్ ఉన్నారు. చదవండి: భారత్‌లో క్రికెట్ పండుగ.. కివీస్‌తో మొదలై దక్షిణాఫ్రికాతో ముగింపు -
2 కోట్ల మైలు రాయిని దాటిన మారుతీ
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) సరికొత్త మైలురాయిని అధిగమించింది. గురుగ్రామ్, మానెసర్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయిన వాహనాల సంఖ్య 2 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.1983 నుంచి ఉత్పత్తిని కొనసాగిస్తున్న ఈ సంస్థ 34 ఏళ్ల 6 నెలలకాలంలో ఈ ఘనతను సాధించినట్లు తెలిపింది. ఇంతటి రికార్డును సాధించిన తొలి దేశీయ కంపెనీగా చరిత్ర సృష్టించినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ – సీఈఓ కెనిచి అయుకవా వెల్లడించారు. ప్రస్తుతం 16 మోడ ల్ కార్లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తం గా 100 దేశాలకు ఎగుమతులు కొనసాగిస్తోంది. -
ధోని కెరీర్లో మరో మైలురాయి !
సాక్షి, హైదరాబాద్ : టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్లో మరో మైలు రాయి అందుకోనున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీ20ల్లో అత్యధిక స్టంప్స్ సాధించిన వికెట్ కీపర్‌గా ధోని గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగే రెండో టీ20.. ధోనికి 500వ (అన్ని ఫార్మాట్లలో కలిపి) అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. దీంతో ఈ అరుదైన ఘనత సాధించిన మూడో భారత క్రికెటర్‌గా ఈ జార్ఖండ్ డైనమైట్ చరిత్ర సృష్టించనున్నాడు. ధోని కంటే ముందు భారత్ నుంచి దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్(664), రాహుల్ ద్రవిడ్ (509)లు మాత్రమే ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో ధోని 9వ స్థానం దక్కించుకోనున్నాడు. ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉండగా.. మహేళ జయవర్దనే, కుమార సంగక్కర, సనత్ జయసూర్య, రికీ పాంటింగ్, షాషిద్ అఫ్రిదీ, జక్వాస్ కల్లీస్, ద్రవిడ్‌లు ధోని కన్నా ముందున్నారు. ఇక 2014లో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని వన్డే, టీ20ల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2004లో బంగ్లాదేశ్‌పై తొలి అంతర్జాతీయ వన్డే ఆడిన ధోని.. శ్రీలంకపై 2005లో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 2006లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను సైతం ధోని ఆడిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మొత్తం 90 టెస్టులు, 318 వన్డేలు,91 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. 331 మ్యాచ్‌లకు ధోని సారథ్యం వహించగా.. అందులో భారత్ 178 మ్యాచ్‌లు గెలవడం విశేషం. అతని సారథ్యంలో భారత్ 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకోవడంతో పాటు.. 2009లో టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. చదవండి: కీపింగ్‌లో మొనగాడు ఎంఎస్ ధోని -
రహదారుల్లో రకాలు తెలుసా?
విశాఖసిటీ: వేసవిలో చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా. అమ్మమ్మ, తాతయ్య దగ్గరకు, వినోదయాత్రలకు వెళ్లారా? మరి రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు కిలోమీటర్ల గురించి సూచించే మైలు రాళ్లు మీకు రోడ్డు పక్కనే కనిపించాయా..? వాటి మధ్య ఉన్న తేడాలు మీరు గుర్తించారా..? ఒక్కో రోడ్డులో ఒక్కో రంగుతో కూడిన మైలు రాయిలున్నాయి కదా. వాటి గురించి తెలుసుకుందామా మరి.. పచ్చరంగు ఉంటే..? మైలు రాళ్లు పై భాగంలో ఆకుపచ్చ రంగు ఉంటే అవి స్టేట్ హైవేలు అని అర్థం. ఈ రోడ్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తుంటాయి. వాటి పర్యవేక్షణను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. తెలుపు లేదా నలుపు రంగు ఉంటే? మైలు రాళ్ల పై భాగంలో తెలుపు లేదా నలుపు రంగు ఉంటే.. మనం ప్రయాణిస్తోంది పెద్ద నగరం మీదుగా లేదా జిల్లాలో అని అర్థం చేసుకోవాలి. ఈ రహదారుల్ని ఆయా నగరాలు లేదా జిల్లాల అభివృద్ధి శాఖలు పర్యవేక్షిస్తుంటాయి. ఆరెంజ్ లేదా ఎరుపురంగు ఉంటే.? మైలు రాళ్ల పై భాగంలో ఎరుపు లేదా ఆరెంజ్ రంగు ఉంటే మనం గ్రామాల్లో ప్రయాణిస్తున్నామని తెలుసుకొండి. అలాగే ఈ రోడ్లను ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద నిర్మించారని అర్థం. పసుపు రంగు ఉంటే..? ఇక మైలు రాళ్ల పైభాగంలో పసుపు రంగులో ఉంటే మనం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నామని తెలుసుకోవాలి. మన దేశంలో కేవలం కొన్ని జాతీయ రహదారులే ఉన్నాయి. వీటిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) పర్యవేక్షిస్తుంటుంది. మనం కేవలం ప్రయాణిస్తున్నప్పుడు మనం చేరుకోవాల్సిన గమ్యం ఎంత దూరం ఉందో చూశారు కదా.. ఈ సారి మాత్రం పైభాగం ఏ రంగులో ఉందో గమనించి.. రహదారుల మధ్య బేధాల్ని తెలుసుకొండి. -
ప్రజాసంకల్పయాత్ర @ 1100 కిలోమీటర్లు
సాక్షి, నెల్లూరు : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 1100 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. 82వ రోజు పాదయాత్రలో భాగంగా ఆయన బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కలిగిరి వద్ద 1100 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరించి, మొక్కను నాటారు. కాగా జిల్లాలోనే వైఎస్ జగన్ 1000 కిలోమీటర్ల పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన విజయ సంకల్ప స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. కాగా వైఎస్ జగన్ గత ఏడాది నవంబర్ 6న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. -
చారిత్రాత్మక మ్యాచ్‌లో..రికార్డుకు చేరువలో
కాన్పూర్: ఇప్పటికే ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్న టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డుకు చేరువలో నిలిచాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో రాణించిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లను సాధిస్తే 200 వికెట్ల క్లబ్లో చేరతాడు. దాంతోపాటు టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలుస్తాడు. అంతకుముందు ఈ ఘనత పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్, ఆస్ట్రేలియా మాజీ బౌలర్ డెన్నిస్ లిల్లీ పేరిట ఉంది. వీరిద్దరు 38 టెస్టుల్లో 200 వికెట్లు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. అయితే న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ అశ్విన్‌కు 37వ ది కావడంతో వారి రికార్డును బద్దలు కొట్టేందుకు స్వల్ప దూరంలో నిలిచాడు. ఈ చారిత్రాత్మక టెస్టు రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ మూడు వికెట్లు తీసి అరుదైన ఘనతను సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే అత్యంత వేగవంతంగా 200 టెస్టు వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రెమెట్ తొలి స్థానంలో ఉన్నాడు. 36 టెస్టుల్లో క్లారీ గ్రెమెట్ ఈ ఘనతను సాధించాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ అటు బంతితో పాటు, ఇటు బ్యాట్‌తో కూడా రాణించిన సంగతి తెలిసిందే. విండీస్‌తో సిరీస్‌లో 235 పరుగులు(రెండు సెంచరీలు), 17 వికెట్లతో అశ్విన్ మెరిశాడు. ఈ క్రమంలోనే ఒక సిరీస్‌లో రెండు సార్లు ఐదు వికెట్లకు పైగా తీయడంతో పాటు, రెండు సార్లు 50కు పైగా పరుగులు నమోదు చేసిన మూడో భారత ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు ఈ ఫీట్ ను కపిల్ దేవ్ రెండు సార్లు, భువనేశ్వర్ కుమార్ ఒకసారి సాధించారు.1979-80లో పాకిస్తాన్‌పై, 1981-82లో ఇంగ్లండ్‌పై కపిల్ దేవ్ ఈ ఘనతను నమోదు చేయగా, రెండు సంవత్సరాల క్రితం ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ లో భువనే్శ్వర్ కుమార్ రెండుసార్లు ఐదేసి వికెట్లను, 50కు పైగా స్కోరును రెండు సార్లు సాధించాడు.