Photo Courtesy: IPL
అబుదాబీ: ఐపీఎల్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. లీగ్ చరిత్రలో ఒకే జట్టు తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి బెంగళూరు జట్టుకే ప్రాతినిధ్యం వహించిన కోహ్లి.. నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌తో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
కోహ్లి తర్వాత ఒకే జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 182 మ్యాచ్‌లు ఆడాడు. వీరిద్దరి తర్వాత సురేశ్ రైనా(సీఎస్‌కే తరఫున 172 మ్యాచ్‌లు), కీరన్ పోలార్డ్(ముంబై ఇండియన్స్ తరఫున 172 మ్యాచ్‌లు), రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్ తరఫున 162 మ్యాచ్‌లు) వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు.
ఇక ఇవాళ కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. మ్యాచ్ రెండో ఓవర్‌లోనే ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 4 బంతులను ఎదుర్కొన్న విరాట్.. ఓ బౌండరీ బాది 5 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లి ఔట్ అయ్యే సమయానికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. క్రీజ్లో పడిక్కల్(4), అరంగేట్రం కుర్రాడు శ్రీకర్ భరత్ ఉన్నారు.
చదవండి: భారత్‌లో క్రికెట్ పండుగ.. కివీస్‌తో మొదలై దక్షిణాఫ్రికాతో ముగింపు
Comments
Please login to add a commentAdd a comment