IPL 2021: KKR Dominant Win Over RCB Celebration in Dressing Room - Sakshi
Sakshi News home page

KKR vs RCB: డెస్సింగ్‌రూంలో సంబరాలు.. మేం మిమ్మల్ని ఓడించగలం

Published Tue, Sep 21 2021 11:10 AM | Last Updated on Tue, Sep 21 2021 4:03 PM

IPL 2021: KKR Dominant Win Over RCB Celebration In Dressing Room - Sakshi

photo courtesy: KKR Instagram

IPL 2021 Phase 2 KKR Win Over RCB: ఐపీఎల్‌-2021 రెండో అంచెను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఘనంగా ఆరంభించింది. తొలి దశలో మెరుగైన స్థితిలో ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించి జయభేరి మోగించింది. ఆర్సీబీ స్కోరును వందలోపే బౌలర్లు కట్టడి చేయగా.. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌(48), వెంకటేశ్‌ అయ్యర్‌(41, నాటౌట్‌) చెలరేగడంతో కేకేఆర్‌ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. 

ఇక ఈ విజయంతో డ్రెస్సింగ్‌ రూంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్‌ తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్‌ చేసింది. కేకేఆర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌.. ఆండ్రీ రస్సెల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ను ప్రశంసించగా.. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వరుణ్‌ చక్రవర్తికి సహచర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు. ఆటగాళ్లంతా పరస్పరం అభినందించుకున్నారు.

కేకేఆర్‌ గెలుపై స్పందించిన కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌.. ‘‘ప్రతీ ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ప్రతి జట్టులోనూ బిగ్‌ప్లేయర్స్‌ ఉంటారు. అయితే, మనం మానసికంగా దృఢంగా ఉన్నపుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈరోజు చూశాం. ఏబీ డివిల్లియర్స్‌, విరాట్‌ కోహ్లి, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, విరాట్‌ కోహ్లి.. స్టార్‌ ఆటగాళ్లపై నేడు మనం పైచేయి సాధించాం. వాళ్ల కళ్లలోకి చూసి మరీ.. ‘‘మేం మిమ్మల్ని ఓడించగలం’’ అని చెప్పే సందర్భం’’ అంటూ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించాడు. 

చదవండి: Shoaib Akhtar: ‘ముందు టీమిండియా.. ఆ తర్వాత న్యూజిలాండ్‌.. వదిలిపెట్టొద్దు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement