
సాక్షి, నెల్లూరు : ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 1100 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. 82వ రోజు పాదయాత్రలో భాగంగా ఆయన బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కలిగిరి వద్ద 1100 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరించి, మొక్కను నాటారు. కాగా జిల్లాలోనే వైఎస్ జగన్ 1000 కిలోమీటర్ల పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన విజయ సంకల్ప స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. కాగా వైఎస్ జగన్ గత ఏడాది నవంబర్ 6న వైఎస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment