
సాక్షి, న్యూఢిల్లీ: దేశీ అతిపెద్ద కార్ల దిగ్గజం మారుతి సుజుకి ఇండియా కరోనా వైరస్, లాక్‌డౌన్ సంక్షోభం నుంచి క్రమంగా కోలుకుంటోంది. గత మాసంలో జీరో అమ్మకాలతో కుదేలైన మారుతి తాజాగా ఆన్‌లైన్ విక్రయాల్లో జోరందుకుంది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి ఇప్పటికే 5000 ఆన్‌లైన్ బుకింగ్‌లను సాధించింది. అలాగే 2300 కార్లను డీలర్లకు పంపించింది.
నిబంధనల మేరకు కార్లను ఆయా వినియోగదారులకు వారం రోజుల్లో డెలివరీ చేస్తామని మారుతి సుజుకి ప్రకటించింది. భారతదేశంలో 2500 టచ్ పాయింట్లను కలిగి ఉన్న మారుతి సుజుకి తన మూడవ వంతు అవులెట్లలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్టు తెలిపింది. (మారుతీ లాభం 28 శాతం డౌన్)
కోవిడ్-19 మహమ్మారి, లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా మూసివేసిన 1900 వర్క్‌షాప్‌లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాయని సంస్థ ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సి భార్గవ వెల్లడించారు. ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కొనుగోళ్లపై దృష్టి పెట్టిన తమకు భారీ మద్దతు లభిస్తోందని తెలిపారు. అయితే చాలా నగరాలు ఇప్పటికీ రెడ్ లేదా ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్నందున డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదు, అయితే ఈ నెలలో తిరిగి కార్యకలాపాలను ప్రారంభించిన మానేసర్ ప్లాంట్‌నుంచి 2300 కార్లను పంపించామన్నారు. (కరోనా : అయ్యయ్యో మారుతి!)
చదవండి : ‘పీఏం కేర్స్’ కేటాయింపులపై చిదంబరం సందేహం
కరోనా ప్యాకేజీ : మాల్యా స్పందన
Comments
Please login to add a commentAdd a comment