ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా భారీ షాకిచ్చింది. పలు మోడళ్ల ధరలను భారీగా పెంచుతూ టెస్లా నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో పేరుగాంచిన టెస్లా లాంగ్‌రేంజ్ కార్లలో ఎక్స్, ఎస్ మోడళ్ల ధరలను 5వేల డాలర్ల(సుమారు రూ. 3,74,000)కు పైగా పెంచింది. టెస్లా వై లాంగ్ రేంజ్ మోడల్, టెస్లా మోడల్ 3 కారు ధరను 2 వేల డాలర్లకు పెంచింది.
చదవండి: అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..!
టెస్లా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం...కొత్త ధరలు ఇలా ఉన్నాయి
- టెస్లా ఎక్స్ మోడల్-104,990 డాలర్లు (సుమారు రూ. 78,74,197)
- టెస్లా ఎస్ మోడల్- 94990 డాలర్లు (సుమారు రూ.71,24,202)
- టెస్లా వై మోడల్- 56990 డాలర్లు (సుమారు రూ.42,74,221)
- టెస్లా మోడల్ 3-43990 డాలర్లు (సుమారు రూ.32,99,228)
భారత్‌లోకి టెస్లా..!
భారత విపణిలోకి అడుగుపెట్టేందుకు టెస్లా సన్నాహాలను చేస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో టెస్లా ఎక్స్ మోడల్‌ను కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో దిగుమతి సుంకం ఎక్కువగా ఉండటంతో..టెస్లా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చలను జరుపుతోంది. కాగా పెరిగిన పలు మోడళ్ల ధరలు భారత్‌లో కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: మడత పెట్టే స్మార్ట్‌ఫోన్లే కాదు..! మడత పడే కార్‌ను చూశారా..!
Comments
Please login to add a commentAdd a comment