
( ఫైల్ ఫోటో )
అనంతపురం సెంట్రల్: వాహనం ఉండాలన్నది ప్రతి ఒక్కరి కోరిక. కారు కొన్నాక నచ్చిన నంబర్ ఉండాలన్నది మరో సెంటిమెంట్. లక్కీ నంబర్ కావాలని చాలామంది ఆశ పడుతుంటారు. ఇందు కోసం ఎంత డబ్బు అయినా వెచ్చించడానికి వెనుకాడరు. ఏడాది క్రితం రూ.50 వేలు ప్రారంభ ధర ఉన్న 9999 నంబర్ వేలంలో రూ.7.20 లక్షలు పలికింది.
అనంతపురానికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఈ నంబర్ కోసం పోటీ పడి మరీ దక్కించుకున్నాడు. ఫ్యాన్సీ నంబర్ రూపంలో రవాణా శాఖకు ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. ఎక్కువశాతం సంపన్నులు ఈ నంబర్లకు పోటీ పడుతున్నారు. గతంలో ఉన్న రేట్లను సవరిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని అనంతపురం ఆర్టీఓ సురేష్ నాయుడు తెలిపారు.
సవరించిన ధరలు ఇలా..
- 9999 నంబరుకు రూ. 2 లక్షలు
- 1, 9, 999 నంబర్లకు రూ. 1 లక్ష
- 99, 3333, 4444, 5555, 6666, 7777 నంబర్లకు రూ.50వేలు
- 5, 6, 7, 333, 369, 555, 666, 777, 1116, 1234, 2277, 2345, 2727, 3339, 3366, 3456, 3699, 3939, 4455, 4545, 4599, 6669, 6789, 8055, 8888 నంబర్లకు రూ.20 వేలు
- 3, 111, 123, 234, 567, 1188, 1818, 1899, 1999, 2222, 2799, 3636, 3999, 5678, 5999, 6999,7999, 9009 నంబర్లకు రూ.15వేలు
- 2, 4, 8, 18, 27, 36, 45, 77, 143, 222, 444, 786, 789, 909, 1122, 1233, 1269, 1314, 1359, 2223, 2255, 2349, 3344, 3399, 3555, 3789 నంబర్లకు రూ.10 వేలు చొప్పున ప్రారంభ ధరలుగా నిర్ణయించారు. పోటీని బట్టి సదరు నంబర్‌కు ఎంత ధర అయినా పలకవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment