
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో టమాటో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అన్ సీజన్ వల్ల సరఫరా తక్కువ ఉండటంతో టమాటో ధరలు పెరిగినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో జూన్ 1 నుంచి టమాటో ధరలు క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కూరగాయల మార్కెట్లలో టమాటో కిలో రూ. 70కి పెరిగే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సాధారణ కూరగాయల మార్కెట్లలోనే కాకుండా.. మదర్ డైరీ జౌట్‌లెట్స్, బిగ్‌బాస్కెట్‌లో కూడా టమోటో ధరలు భారీగానే ఉన్నాయి. (తెలంగాణలో కొత్తగా 1,269 కరోనా కేసులు)
ఆదివారం రోజున బిగ్‌బాస్కెట్‌లో కిలో టమాటోను రూ. 60 నుంచి 66 వరకు విక్రయించారు. టమాటో ఉత్పత్రి చేస్తున్న రాష్ట్రాల నుంచి తక్కువ మొత్తంలో దిగుమతి రావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కూరగాయల వ్యాపారులు తెలిపారు. టమాటో పండిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడంతో అది టమాటో పెంపకంపై ప్రభావం చూపెడుతోందని అంటున్నారు.(రాజస్తాన్ సంక్షోభం : సింధియా ట్వీట్)
Comments
Please login to add a commentAdd a comment