![Tata Motors to hike prices of passenger vehicles from May 01 - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/15/TATA-MOTORS-CARS.jpg.webp?itok=A2K8JuQ4)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ కాస్త ప్రియం కానున్నాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి ధర సగటున 0.6 శాతం పెరగనుంది. మే 1 నుంచి సవరించిన ధరలు అమలులోకి రానున్నాయని కంపెనీ శుక్రవారం ప్రకటించింది.
2023 ఫిబ్రవరి తర్వాత ధరలు పెంచడం ఇది రెండవసారి. నియంత్రణపర మార్పులు, ముడిసరుకు వ్యయం అధికం కావడం తాజా నిర్ణయానికి దారి తీసిందని టాటా మోటార్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment