జైసల్మేర్/రాజస్తాన్: దేశీయ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహన ధరలను పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహనాలను విడుదల చేయాల్సి వస్తుండడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుం దని, ఎంత మేర పెంచాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ అన్నారు. హ్యాచ్‌బ్యాక్ టియాగో నుంచి ఎస్‌యూవీ హ్యారియర్ వరకు పలు మోడళ్లను ఈ సంస్థ భారత మార్కెట్లో విక్రయిస్తోంది. వీటి ధర రూ.4.39 లక్షలు–16.85 లక్షల వరకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment