
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలకు ముందు మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై పదిశాతం ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వార్టర్‌పై రూ.20, హాఫ్‌పై రూ.40, ఫుల్‌పై రూ.80 పెంచుతున్నట్లు అబ్కారీశాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పెరిగిన ధరలు రేపటి నుంచి (మంగళవారం) అమల్లోకి రానున్నాయి. పాత మద్యం నిల్వలకు కొత్త ధరల పెంపు వర్తించదని ఎక్సైజ్‌శాఖ తెలిపింది. పెరిగిన ధరలతో ప్రభుత్వానికి రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది.