![Liquor Price Decreased In Telangana - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/05/5/liquor-rates.jpg.webp?itok=ZgBx2Cp4)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు భారీగా తగ్గించింది. ఫుల్ బాటిల్‌పై(750ఎంల్) రూ.40 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే 180 ఎంఎల్‌పై రూ.20, 180 ఎంఎల్‌పై రూ.10, 90 ఎంఎల్‌పై రూ.5 తగ్గించింది. తగ్గిన ధరలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పినట్లయింది.
అయితే బీరు ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేవలం లిక్కర్ బ్రాండ్‌లకే కొత్త ధరలు వర్తిస్తాయి. కాగా.. తెలంగాణలో ఏప్రిల్ నెలలో కోటికిపైగా బీర్లు అమ్ముడైన విషయం తెలిసిందే. ఎండల్లో చల్లబడేందుకు బీర్ ప్రియులు తెగ లాగించేస్తున్నారు.
చదవండి: హైదరాబాద్‌లో రోజుకు ఇన్ని వీధి కుక్కలు చనిపోతున్నాయా?
Comments
Please login to add a commentAdd a comment