వివిధ రుగ్మతలతో బాధపడుతూ ఉపశమనం కోసం మందులు వాడుతున్నవారికి ధరల దెబ్బ తగలనుంది. పెయిన్ కిల్లర్స్ నుంచి యాంటిబయాటిక్స్ వరకూ పలు రకాల మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరుగుతున్నాయి. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్లూపీఐ)లో మార్పునకు అనుగుణంగా ఏప్రిల్ 1 నుంచి పలు రకాల మందుల ధరలను 12 శాతం మేర పెంచుకోడానికి ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ కంపెనీలకు అనుమతినిచ్చింది.
ఇదీ చదవండి: అమ్మగా ఆలోచించి.. రూ. 50 కోట్లకు పైగా ఆదాయం.. ఈమె స్విమ్మింగ్ చాంపియన్ కూడా...
ధరలు పెరుగుతున్న మందులలో చాలా వరకు యాంటీ ఇన్‌ఫెక్టివ్‌లు, పెయిన్‌కిల్లర్లు, కార్డియాక్ వంటి ప్రాణాలను రక్షించే మందులు ఉన్నాయి. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్‌లో చేర్చిన దాదాపు 800 ఔషధాల రిటైల్ ధరపై ఈ ధరల పెంపు ప్రభావం ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ జాబితాలో కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందుల దగ్గర నుంచి ఓఆర్‌ఎస్, డిస్‌ఇన్‌ఫెక్టెంట్ మందుల వరకు దాదాపు అన్ని అవసరమైన మందులు ఉన్నాయి.
ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగే మందులు ఇవే...
- హాలోథేన్, ఐసోఫ్లోరేన్, కెటామైన్, నైట్రస్ ఆక్సైడ్ మొదలైన సాధారణ మత్తు మందులు, ఆక్సిజన్ మందులు.
- పెయిన్ కిల్లర్స్: డిక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్, మెఫెనామిక్ యాసిడ్, పారాసెట్మాల్, మార్ఫిన్
- పాయిజనింగ్‌లో యాంటీడోట్స్: యాక్టివేటెడ్ చార్‌కోల్, డి-పెనిసిల్లమైన్, నాలాక్సోన్, స్నేక్ వెనమ్ యాంటీసెరమ్
- యాంటికాన్వల్సెంట్స్: క్లోబాజామ్, డయాజెపామ్, లోరాజెపామ్
- పార్కిన్సన్స్, డిమెన్షియా: ఫ్లూనారిజైన్, ప్రొప్రానోలోల్, డోనెపెజిల్
- యాంటీబయాటిక్స్: అమోక్సిసిలిన్, యాంపిసిలిన్, బెంజైల్‌పెనిసిలిన్, సెఫాడ్రోక్సిల్, సెఫాజోలిన్, సెఫ్ట్రియాక్సోమ్
- కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందులు
- యాంటీ టీబీ ఔషధం: అమికాసిన్, బెడాక్విలిన్, క్లారిథ్రోమైసిన్ మొదలైనవి.
- యాంటీ ఫంగల్: క్లోట్రిమజోల్, ఫ్లూకోనజోల్, ముపిరోసిన్, నిస్టాటిన్, టెర్బినాఫైన్ తదితరాలు
- యాంటీవైరల్ మందులు: ఎసిక్లోవిర్, వల్గాన్సిక్లోవిర్ వంటివి.
- హెచ్‌ఐవీ చికిత్సకు వినియోగించే అబాకావిర్, లామివుడిన్, జిడోవుడిన్, ఎఫవిరెంజ్, నెవిరాపైన్, రాల్టెగ్రావిర్, డోలుటెగ్రావిర్, రిటోనావిర్ తదితర మందులు.
- మలేరియా మందులు: ఆర్టెసునేట్, ఆర్టెమెథర్, క్లోరోక్విన్, క్లిండామైసిన్, క్వినైన్, ప్రిమాక్విన్ మొదలైనవి.
- క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 5-ఫ్లోరోరాసిల్, ఆక్టినోమైసిన్ డి, ఆల్-ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్, ఆర్సెనిక్ ట్రైయాక్సైడ్, కాల్షియం ఫోలినేట్ మొదలైనవి.
- ఫోలిక్ యాసిడ్, ఐరన్ సుక్రోజ్, హైడ్రాక్సోకోబాలమిన్ వంటి రక్తహీనత మందులు
- ప్లాస్మా, ప్లాస్మా ప్రత్యామ్నాయాలు
- కార్డియోవాస్కులర్ మందులు: డిలిటాజెమ్, మెటోప్రోలోల్, డిగోక్సిన్, వెరాప్రమిల్, అమ్లోడిపైన్, రామిప్రిల్, టెల్మిసార్టెన్ మొదలైనవి.
- చర్మసంబంధమైన మందులు
- యాంటిసెప్టిక్స్, క్రిమిసంహారకాలు: క్లోరోహెక్సిడైన్, ఇథైల్ ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, పోవిడిన్ అయోడిన్, పొటాషియం పర్మాంగనేట్ మొదలైనవి.
- బుడెసోనైడ్, సిప్రోఫ్లోక్సాసిన్, క్లోట్రిమజోల్ మొదలైన ఈఎన్‌టీ ఔషధాలు.
- గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మందులైన ఓఆర్‌ఎస్, లాక్టులోజ్, బిసాకోడిల్ వంటివి.
- హార్మోన్లు, ఇతర ఎండోక్రైన్ మందులు, గర్భనిరోధకాలు
- వ్యాక్సిన్లు: హెపటైటిస్ బి, డీపీటీ వ్యాక్సిన్, జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాక్సిన్, మీజిల్స్ వ్యాక్సిన్, రేబిస్ వ్యాక్సిన్ మొదలైనవి.
- ఆప్తాల్మోలాజికల్ మందులు, ఆక్సిటోసిక్స్, యాంటీఆక్సిటోసిక్స్
- మానసిక రుగ్మతల చికిత్సకు ఉపయోగించే మందులు
- శ్వాసకోశ సంబంధ రుగ్మతలకు వినియోగించే మందులు, విటమిన్లు, మినరల్స్.
ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా?
Comments
Please login to add a commentAdd a comment