ధరల మోతతో సతమతమవుతున్న సామాన్యుడికి కేంద్రం కాస్త ఊరట కల్పించింది. అత్యవసర ఔషధాల జాబితాలో ఉన్న 651 మందుల ధరలపై కేంద్రం సీలింగ్ ధరను నిర్ణయించింది. దీంతో ఈ ఔషధాల ధరలు దాదాపు 6.73 శాతానాకి దిగొచ్చాయి.
గత ఏడాది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మన్‌సుఖ్ మాండవీయ జాతీయ అత్యవసర ఔషధాల జాబితా- 2022ను విడుదల చేశారు. ఈ జాబితాలోకి చేర్చడం వల్ల పలు యాంటీబయోటిక్‌లు, వ్యాక్సిన్లు, క్యాన్సర్ నిరోధక మందులు వంటి కీలక ఔషధాల ధరలు అందుబాటులోకి రానున్నాయని, రోగులకు మందుల ఖర్చు తగ్గుతుందని మాండవీయ వెల్లడించారు.
అయితే తాజాగా అత్యవసర ఔషధాల జాబితాలో ఉండే 870 రకాల మందుల్లో 651 ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం సీలింగ్ ధరను నిర్ణయించింది. ప్రభుత్వం ప్రకటించిన సీలింగ్ ధరను మించి విక్రయించేందుకు అనుమతులు ఉండవు అని ఎన్‌పీపీఏ వెల్లడించింది
Comments
Please login to add a commentAdd a comment