Ceiling
-
సామాన్యులకు ఊరట..తగ్గిన 651 మందుల ధరలు!
ధరల మోతతో సతమతమవుతున్న సామాన్యుడికి కేంద్రం కాస్త ఊరట కల్పించింది. అత్యవసర ఔషధాల జాబితాలో ఉన్న 651 మందుల ధరలపై కేంద్రం సీలింగ్ ధరను నిర్ణయించింది. దీంతో ఈ ఔషధాల ధరలు దాదాపు 6.73 శాతానాకి దిగొచ్చాయి. గత ఏడాది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మన్సుఖ్ మాండవీయ జాతీయ అత్యవసర ఔషధాల జాబితా- 2022ను విడుదల చేశారు. ఈ జాబితాలోకి చేర్చడం వల్ల పలు యాంటీబయోటిక్‌లు, వ్యాక్సిన్లు, క్యాన్సర్ నిరోధక మందులు వంటి కీలక ఔషధాల ధరలు అందుబాటులోకి రానున్నాయని, రోగులకు మందుల ఖర్చు తగ్గుతుందని మాండవీయ వెల్లడించారు. అయితే తాజాగా అత్యవసర ఔషధాల జాబితాలో ఉండే 870 రకాల మందుల్లో 651 ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం సీలింగ్ ధరను నిర్ణయించింది. ప్రభుత్వం ప్రకటించిన సీలింగ్ ధరను మించి విక్రయించేందుకు అనుమతులు ఉండవు అని ఎన్పీపీఏ వెల్లడించింది -
గ్యాస్ ధరలకు చెక్: కిరీట్ పారిఖ్ కీలక సూచనలు
న్యూఢిల్లీ: దేశంలో సహజ వాయువు ధరలు అసాధారణంగా పెరిగిపోకుండా కిరీట్ పారిఖ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. లెగసీ క్షేత్రాల నుంచి (నామినేషన్‌పై ప్రభుత్వం కేటాయించిన) ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ధరలకు కనిష్ట, గరిష్ట పరిమితులను సూచించింది. దీనివల్ల దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం సహజ వాయువులో రెండొంతులపై (పాత క్షేత్రాల నుంచి) కచ్చితమైన ధరల విధానం ఉంటుందని అభిప్రాయపడింది. తయారీ సంస్థలకు ధరలపై స్పష్టత ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా ఈ తరహా క్షేత్రాలను నిర్వహిస్తున్నాయి. కేజీ డీ6 తదితర రిలయన్స్, బీపీ ఇతర సంస్థలు ఉత్పత్తి చేస్తున్న వాటికి ఈ ధరల పరిమితి వర్తించదు. తాజా సూచనలతో 70 శాతం మేర పెరిగిపోయిన ధరలు కొంత దిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు నామినేషన్‌పై ఇచ్చిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్‌కు, దిగుమతి చేసుకునే గ్యాస్ ధరనే చెల్లించాలని సిఫారసు చేసింది. అంతేకానీ, అంతర్జాతీయ ధరలను చెల్లించొద్దని సూచించింది. మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ)కు కనీసం 4 డాలర్లు, గరిష్టంగా 6.5 డాలర్ల చొప్పున పరిమితులు సూచించింది. దీనికి ఏటా 0.05 డాలర్లను పెంచుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఎంబీటీయూ ధర 8.57 డాలర్లు ఉంది. లోతైన సముద్ర ప్రాంతాలు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే జోన్లకు ప్రస్తుతం భిన్న రేట్ల విధానం అమల్లో ఉంది. వీటికి సంబంధించి సైతం ఎంబీటీయూ గరిష్ట ధర 12.46 డాలర్లు మించకూడదని పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది. ఇక 2026 జనవరి 1 నుంచి ధరలపై ఎలాంటి పరిమితుల్లేని స్వేచ్ఛా విధానాన్ని సూచించింది. (షాకింగ్: ఇక ఆ రంగంలో ఉద్యోగాలకు ముప్పు, నేడో, రేపో నోటీసులు!) ఈ చర్యలు దేశీయ వినియోగదారులపై ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని కమిటీ వ్యాఖ్యానించింది. అలాగే 2030 నాటికి భారతదేశ ఇంధన మిశ్రమంలో గ్యాస్ వాటాను ప్రస్తుతం ఉన్న 6.4 శాతం నుండి 15 శాతానికి పెంచాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దాని సిఫార్సులు సహాయపడతాయని కూడా నొక్కి చెప్పింది. అలాగే దేశీయంగా వినియోగించే సహజ వాయువులో దాదాపు 50 శాతం దిగుమతి చేసుకుంటున్నారు. (జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం) -
కిందికి రాదెందుకు?
ముల్లా నసీరుద్దీన్ ఒకసారి తన గాడిదను ఇంటికప్పుపైకి తీసుకువెళ్లాడు. తరువాత మళ్లీ దాన్ని కిందికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే అది ఎంతమాత్రం కిందికి రావడంలేదు. ఎంత ప్రయత్నించినా అది తన మాట వినడంలేదు. దాంతో విసిగిపోయి, ‘సరే.. అదే వస్తుందిలే..’ అని తానే దిగి వచ్చేశాడు. చాలా సమయం గడిచిపోయింది. అయినా గాడిద కిందికి దిగలేదు. ఏవో శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఏమైంది దీనికీ, ఎందుకు రావడంలేదు, కప్పును పాడుచేస్తుందో ఏమో.. అది చాలా సున్నితమైన కప్పు.. అని ఆందోళన చెందుతూ.. ముల్లా పైకి వెళ్లాడు. గాడిద కిందికి రాకపోగా పైకప్పును నాశనం చేయడం ప్రారంభించింది. ఎంతగా అదిలించి, ప్రయత్నించినా ససేమిరా దారికి రావడంలేదు. ఒక్కటి తగిలించి లాక్కురావడానికి ప్రయత్నించాడు. కానీ అది ఎదురు తిరిగి అతన్నే లాగి ఒక్క తన్ను తన్నింది. ముల్లా కిందపడిపోయాడు. చివరికి గాడిద కప్పును కూల్చేసింది. దాంతో, కప్పుతో పాటు అది కూడా కింద పడిపోయింది. ఎందుకిలా జరిగిందీ.. అని ముల్లా చాలాసేపటి వరకు తీవ్రంగా ఆలోచించాడు. అతనికి అర్థమైంది ఏమిటంటే.. ‘అనర్హుల్ని ఎప్పుడూ అందలం ఎక్కించకూడదు. వారిని అందలాలెక్కించి పైస్థానాల్లో, ఉన్నతస్థానాల్లో కూర్చోబెట్టకూడదు అని. అనర్హులైనవారిని గనక ఉన్నతస్థానాల్లో కూర్చోబెడితే, అనేక రకాలుగా నష్టం కలుగజేస్తారు. ఆ స్థాయినీ, స్థానాన్నీ దిగజారుస్తారు. ఆ స్థాయికి తీసుకెళ్లినవారినీ నష్టపరిచి విశ్వాసఘాతుకానికి ఒడిగడతారు..’ అని. – మదీహా -
వన్నెవెన్నెల పైకప్పు
సాక్షి, హైదరాబాద్: డూప్లెక్స్, ఫ్లాట్లలో పడక గదులకు ఫాల్స్ సీలింగ్‌తో అలంకరణ అధికమవుతుంది. ఇది మీ అభిరుచులకు అద్దం పట్టాలంటే మాత్రం సీలింగ్ డిజైన్‌తో పాటు సరైన రంగులను ఎంచుకోవాలి. ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం గదిలో ఆహ్లాదభరిత వాతావరణం ఏర్పర్చడమే. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. చక్కటి డిజైన్, సరైన రంగుల కలయికతో ఆశించిన రూపాన్ని ఆవిష్కరింపజేసుకోవచ్చు. దీంతో మనసును ఆకట్టుకునే సీలింగ్‌ను ఏర్పాటు చేసుకోవడమే కాదు పైకప్పు విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. పైకప్పునకు మృదువైన వర్ణాలు వేస్తే ఆ రూపం ఆనందమయం చేస్తుంది. ♦ మిగతా గదులతో పోలిస్తే పడక గది సీలింగ్‌నే ఎక్కువ సేపు చూస్తాం. కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దం పట్టేవి ఎంచుకోండి. ఇది మీ మనసులోని భావాలకు ప్రతీకగా ఉండాలి. ♦ మధ్యస్తం, డార్క్ బ్రౌన్ రంగులు పడక గదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి. ♦ బిగీస్, బ్రౌన్స్, టాన్స్ వాడండి. ఇవి పుడమి రూపాన్ని తలపిస్తాయి. కొండలు, రాళ్లు, మట్టి రూపాల్ని ప్రతిబింబిస్తాయి. ఆకుపచ్చ, బ్రౌన్ మిశ్రమం పడక గదిని అద్భుతంగా మారుస్తుంది. గదిలో ఆత్మీయత భావాన్ని కలిగిస్తుంది. ఆకుపచ్చలో సరైన షేడ్లను ఎంచుకోవాలి. ఎందుకంటే కొన్ని షేడ్లు రంగు స్థాయిని తగ్గిస్తాయి. వర్ణాల ఎంపికలో.. ♦ గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ.. విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. ♦ తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే.. మోనో క్రోమోటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడక గది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది. ♦ పైకప్పునకు తెలుపు రంగు కూడా వేసుకోవచ్చు. కానీ, అది సంప్రదాయ పద్ధతి. నేటి పోకడలకు అద్దం పట్టదని గుర్తుంచుకోండి. గోడలకు, సీలింగ్‌కు ఒకే రకమైన రంగులు కాకుండా.. వేర్వేరు రంగుల్ని ఎంచుకోవాలి. దగ్గర దగ్గర రంగులు కాకుండా చూడగానే ఇట్టే తేడా కనిపించే రంగుల్ని ఎంచుకోవాలి. -
మళ్లీ కూలిన ‘ఉస్మానియా’ పైకప్పు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఓపీ భవనం ప్రవేశద్వారం పైకప్పు మళ్లీ కుప్పకూలింది. వందల మంది చికిత్స పొందుతున్న ఈ భవనంలో సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి పైకప్పు పెచ్చులూడి కింద పడటంతో భారీ శబ్దం వచ్చింది. అదృష్టవశాత్తూ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అసలే వర్షాకాలం..ఆపై రోజుకో చోట పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో రోగులు, వైద్యులు ఆందోళేన చెందుతున్నారు. పాతభవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులకు ఇది సురక్షితం కాదని అప్పట్లో ఇంజనీరింగ్ నిపుణులు తెలిపారు. దీంతో అప్పటి సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 4 ఎకరాల విస్తీర్ణంలో ఏడంతస్తుల కొత్త భవనాన్ని నిర్మించాలని భావించి.. 2009లో రూ.5 కోట్లు మం జూరు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి దీన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. రూ.50 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు. శిథిలావస్థకు చేరుకున్న పాతభవనం స్థానంలో అత్యాధునిక హంగులతో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తొలి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ప్రతిపక్షాలుసహా పురావస్తు శాఖ పరిశోధకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. ఆ భవనం జోలికి వెళ్లకుండా అదే ప్రాంగణంలో రెండు 12 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు పునాది రాయి కూడా పడలేదు. -
ఎండలో చల్లగా!
సాక్షి, హైదరాబాద్: వేసవి కాలం వచ్చిందంటే చాలు బయటికెళ్లాలంటే భయం. కొన్ని ఇళ్లల్లో అయితే ఇంట్లోనూ సేమ్ సీన్ ఉంటుంది. సాధారణ సీలింగ్ ఉన్న ఇల్లు కూడా ఆహ్లాదభరితంగా చల్లగా మారాలంటే ఫాల్స్ సీలింగ్ చేయిస్తే సరి అని నిపుణులు సూచిస్తున్నారు. ♦ గదిలో చల్లని వాతావరణం కలిగించేలా చేయటమే ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు కూడా. అయితే ఫాల్స్ సీలింగ్ వర్ణాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ♦ గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉంటుంది. ♦ మిగతా గదులతో పోల్చుకుంటే పడకగది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి. ♦ తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడక గది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. ♦ గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గర దగ్గర రం గులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కన్పించే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్‌ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు. -
పైకప్పు అదిరింది!
సాక్షి, హైదరాబాద్: డ్యూప్లెక్స్, ఫ్లాట్లలో పడక గదులకు ఫాల్స్ సీలింగ్ అధికమవుతోంది. ఇది మీ అభిరుచులకు అద్దం పట్టాలంటే మాత్రం సీలింగ్ డిజైన్‌తో పాటూ సరైన వర్ణాల్ని ఎంచుకోవాలి. ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఏర్పరడడం, అలసిన మనసు, శరీరానికి స్వాంతన చేకూర్చడమే! సరైన రంగుల కలయికతో ఆశించిన రూపాన్ని ఆవిష్కరించుకోవచ్చు. దీంతో మనసుకు ఆకట్టుకునే సీలింగ్‌ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పైకప్పు విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. పైకప్పును మృదువైన వర్ణాలు వేస్తే ఆ రూపం ఆనందమయం అవుతుంది. ♦ మిగతా గదులతో పోలిస్తే పడక గది సీలింగ్‌నే ఎక్కువ సేపు చూస్తాం. కాబట్టి, వర్ణాల ఎంపికలో కూడా విజ్ఞత పాటించాలి. సాదాసీదా రంగులు కాకుండా నేటి పోకడలకు అద్దం పట్టేవి ఎంచుకోవాలి. ఇది మీ మనసులోని భావాలకు ప్రతీకగా నిలవాలి. ♦ మధ్యస్తం, డార్క్ బ్రౌన్ వర్ణాలు పడక గదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి. బిగీస్, బ్రౌన్స్, టాన్స్ వాడండి. ఇవి పుడమి రూపాన్ని తలపిస్తాయి. కొండలు, రాళ్లు, మట్టి రూపాల్ని ప్రతిబింబిస్తాయి. ♦ ఆకుపచ్చ, బ్రౌన్ మిశ్రమం పడకగదిని అద్భుతంగా మారుస్తుంది. గదిలో ఆత్మీయత భావనను కలిగిస్తుంది. ఆకుపచ్చలో సరైన షేడ్లను ఎంచుకోవాలి. ఎందుకంటే కొన్ని షేడ్లు వర్ణస్థాయిని తక్కువ చేస్తాయి. వర్ణాల ఎంపికలో.. ♦ గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడే పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉన్న భావన కలుగుతుంది. ♦ తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే.. మోనో క్రోమోటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు రంగులు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సీలింగ్ ప్రశాతం భావనను కలిగిస్తుంది. ♦ పైకప్పునకు తెలుపు రంగు కూడా వేసుకోవచ్చు. కానీ, సంప్రదాయ పద్ధతి. నేటి పోకడలకు అద్దం పట్టదని గుర్తుంచుకోండి. గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గరదగ్గర రంగులు కాకుండా చూడగానే ఇట్టే కన్పించాలి. అంటే లేత గులాబీ, లేత ఎరుపు వర్ణాలాంటివన్నమాట. -
'కార్మికులకు బోనస్‌లపై సీలింగ్ ఎత్తివేయాలి'
కరీంనగర్: ఉద్యోగులకు సంస్థలు ఇచ్చే బోనస్‌లపై పరిమితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తివేయాలని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడేందుకు వీలుగా కంపెనీలకు సబ్సిడీలు ప్రకటించి, వాటి మనుగడకు తోడ్పడాలని కోరారు. -
వన్నెవన్నెల పైకప్పు
హైదరాబాద్: ఇంట్లోని అందాన్ని రెట్టింపు చేసేది ఫాల్స్ సీలింగ్. ఇది మన అభిరుచులకు అద్దం పట్టేలా ఉండాలంటే సీలింగ్ డిజైన్‌తో పాటు సరైన వర్ణాల్ని ఎంచుకోవాలి. ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం... గదిలో ఆహ్లాదభరిత వాతావరణం ఏర్పర్చడమే .మిగతా గదులతో పోల్చుకుంటే పడకగది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం. కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేలా ఉండాలి. డార్క్, బ్రౌన్ వర్ణాలు చక్కగా నప్పుతాయి. ఇది మన మనసులోని భావాలకు ప్రతీకగా నిలుస్తాయి. గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడే పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపించడంతో పాటు విశాలంగా ఉందనే భావన కలుగుతుంది. సీలింగ్ డిజైన్ ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోండి. తాజాదనం ఉట్టి పడుతున్నట్లు కనబడాలంటే మోనోక్రోమాటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది.