ఎండలో చల్లగా! | Falls ceiling in house | Sakshi
Sakshi News home page

ఎండలో చల్లగా!

Published Sat, Mar 17 2018 3:20 AM | Last Updated on Mon, Mar 19 2018 1:45 PM

Falls ceiling in house - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేసవి కాలం వచ్చిందంటే చాలు బయటికెళ్లాలంటే భయం. కొన్ని ఇళ్లల్లో అయితే ఇంట్లోనూ సేమ్‌ సీన్‌ ఉంటుంది. సాధారణ సీలింగ్‌ ఉన్న ఇల్లు కూడా ఆహ్లాదభరితంగా చల్లగా మారాలంటే ఫాల్స్‌ సీలింగ్‌ చేయిస్తే సరి అని నిపుణులు సూచిస్తున్నారు.
  గదిలో చల్లని వాతావరణం కలిగించేలా చేయటమే ఫాల్స్‌ సీలింగ్‌ ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు కూడా. అయితే ఫాల్స్‌ సీలింగ్‌ వర్ణాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉంటుంది.
  మిగతా గదులతో పోల్చుకుంటే పడకగది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్‌ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి.
 తాజాదనం ఉట్టిపడుతున్న లుక్‌ రావాలంటే మోనోక్రోమాటిక్‌ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడక గది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి.
 గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గర దగ్గర రం గులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కన్పించే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్‌ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement