
ఇకపై టీవీలు కొనడం మరింత భారం కావచ్చు. తయారీదారులు ఉత్పత్తిని తగ్గించడంతో కీలకమైన ఓపెన్ సెల్‌ల ధరలు పెరుగుతూనే ఉన్నాయని, దీనివల్ల టీవీలు ధరలు కూడా మరింత పెరుగుతాయని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది.
కోవిడ్ సమయం నుంచే పరిశ్రమ ఈ సమస్యను ఎదుర్కొంటోంది. గత డిసెంబర్ నుంచి ఓపెన్-సెల్ ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ తర్వాత ఫిబ్రవరి చివరి నాటికి మరో 15 శాతం పెంచే యోచనలో టెలివిజన్-ప్యానెల్ తయారీదారులు ఉన్నారు.
ఏమిటీ ఓపెన్ సెల్?
టెలివిజన్ సెట్ల తయారీలో ఓపెన్ సెల్ ప్రధాన భాగాలలో ఒకటి. టీవీల ఉత్పత్తిలో 60-65 శాతం ఓపెన్ సెల్‌లకే ఖర్చవుతుంది. వీటిని చైనాలోని నాలుగైదు కంపెనీలే తయారు చేస్తున్నాయి. దీని కారణంగా ధరల అధికారం వారి చేతుల్లోనే ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment