![Fed raises rates by half a percentage point - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/5/Fed%20hikes.jpg.webp?itok=EdoZLUgT)
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షలో వడ్డీ రేటును మరోసారి పెంచింది. ధరల కట్టడి లక్ష్యంగా 0.5 శాతం హెచ్చించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 0.75–1 శాతానికి చేరాయి.
గత సమీక్షలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 0.25 శాతమే పెంచినప్పటికీ.. ఈసారి మరింత కఠినంగా వ్యవహరించింది. కరోనా మహమ్మారి సంక్షోభం తదుపరి ఆర్థిక వ్యవస్థ గాడిన పడటంతో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) సరళతర విధానాలకు స్వస్తి పలుకుతూ వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపుతోంది.
నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణం(సీపీఐ), ఉపాధి ఊపందుకోవడం వంటి అంశాల మద్దతుతో 9 ట్రిలియన్ డాలర్ల ఆస్తుల పోర్ట్‌ఫోలియోను జూన్ నుంచి తగ్గించుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment