ముంబై: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్ డిపాజి ట్లపై వడ్డీని 6.75 శాతానికి పెంచింది. ఈ రేట్లు నేటి నుంచీ అమల్లోకి వస్తాయి.
♦ రూ.10 లక్షల నుంచి రూ.10 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంచే సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లకు ఇచ్చే రేటు 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెరిగి, 6.75 శాతానికి చేరింది.
♦ రూ. లక్ష నుంచి రూ.10 లక్షల మధ్య నిల్వకు సంబంధించి వార్షిక రేటు 50 బేసిస్ పాయింట్లు పెరిగి 6.50కి చేరింది.
♦ లక్షలోపు బ్యాలెన్స్‌పై రేటు మాత్రం 5 శాతంగా కొనసాగనుంది.
పొదుపులపై దృష్టి: సీఈఓ
బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ సంజయ్ అగర్వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మా డిపాజిట్ బుక్ విలువ రూ.7,800 కోట్లు. ఇందులో సేవింగ్స్ అకౌంట్ నిల్వల పరిమాణం 23 శాతం. ఈ శాతాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తున్నాం’’ అన్నారు.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ రేట్ల పెంపు
Published Wed, Apr 11 2018 12:44 AM | Last Updated on Wed, Apr 11 2018 12:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment