Bank Savings
-
బ్యాంకుల్లో జనం దాచుకుంది కోటీ 35 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తలసరి అప్పు గురించి విన్నాం.. తలసరి ఆదాయం గురించి తెలుసుకున్నాం.. దేశం, రాష్ట్రాల అప్పుల చర్చలూ చూశాం.. మరి మన దేశంలో ప్రజలు బ్యాంకుల్లో వివిధ రూపాల్లో దాచుకున్న సొమ్ము ఎంతో తెలుసా..? రూ.1,35,59,212 కోట్లు.. అక్షరాల్లో చెప్పాలంటే.. కోటీ 35 లక్షల కోట్ల పైచిలుకే. దీనిని మన దేశ జనాభాతో సగటున లెక్కిస్తే ఒక్కొక్కరి సొమ్ము సుమారు లక్ష రూపాయలు అని చెప్పొచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ లెక్కలను వెల్లడించింది. ఇండియన్ ఎకానమీ స్టాటిస్టిక్స్ (2021–22) పేరిట రిజర్వు బ్యాంకు ఈ నివేదికను విడుదల చేసింది. అందులో 1983వ సంవత్సరం నుంచీ 2021–22 వరకు బ్యాంకుల్లో భారతీయులు డిపాజిట్ చేసిన సొమ్ము లెక్కలను వెల్లడించింది. సేవింగ్స్ భారీగా పెరుగుతూ.. 1983–84 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు దాచుకున్న సేవింగ్స్ డిపాజిట్ల విలువ రూ.17,811 కోట్లు. ఇందులో భారతీయ బ్యాంకుల్లో రూ.17,430 కోట్లు ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.381 కోట్లు దాచుకున్నారు. పదేళ్ల తర్వాత అంటే 1993–94లో సేవింగ్స్ డిపాజిట్లలో సొమ్ము రూ.71,151 కోట్లకు చేరింది. విదేశీ బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు రూ.1,718 కోట్లుగా ఉన్నాయి. మరో పదేళ్ల తర్వాత అంటే.. 2003–04 నాటికి బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.3.85 లక్షల కోట్లు దాటాయి. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు చేసిన డిపాజిట్లు రూ.12,232 కోట్లకు చేరాయి. ఇక 2013–14 నాటికి సేవింగ్స్ రూ.20 లక్షల కోట్లు దాటాయి. ఇందులో భారతీయ బ్యాంకుల్లో రూ.19.6 లక్షల కోట్లకుపైగా ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.40,390 కోట్లకు చేరాయి. 2014 నుంచి సేవింగ్స్ డిపాజిట్ల తీరు.. (రూ.కోట్లలో) ఏడాది భారత బ్యాంకుల్లో విదేశీ బ్యాంకుల్లో మొత్తం 2014–15 21,78,847 41,046 22,19,893 2015–16 24,92,846 43,698 25,36,544 2016–17 33,40,707 52,876 33,93,583 2017–18 35,99,341 55,896 36,55,237 2018–19 39,72,547 58,630 40,31,177 2019–20 42,85,362 65,384 43,50,746 2020–21 49,74,715 81,092 50,55,807 2021–22 55,94,034 87,284 56,81,318 2014 నుంచి వివిధ టర్మ్ డిపాజిట్ల తీరు.. (రూ.కోట్లలో) ఏడాది 90 రోజుల్లోపు 6 నెలలు–ఏడాది 5 ఏళ్లపైన 2014 3,64,909 7,34,703 7,73,620 2015 4,27,722 7,19,993 7,91,137 2016 4,35,318 5,55,536 8,47,659 2017 4,47,000 8,40,158 9,45,980 2018 4,25,420 8,05,586 10,00,865 2019 5,16,651 6,19,998 9,25,059 2020 10,84,623 4,58,797 9,93,286 2021 13,02,760 7,96,325 7,47,654 (ఆరు నెలల లోపు, ఏడాది నుంచి రెండేళ్ల మధ్య, రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య, మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య.. ఇలా అన్నిరకాల టర్మ్ డిపాజిట్లు కలిపి 2021–22 ఆర్థిక సంవత్సరం నాటికి షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఉన్న సొమ్ము రూ.78,77,894 కోట్లు అని రిజర్వుబ్యాంకు నివేదికలో పేర్కొంది) అయితే తక్కువ.. లేకుంటే సుదీర్ఘంగా.. టర్మ్ (ఫిక్స్డ్) డిపాజిట్ల విషయానికి వస్తే భారతీయులు ఎక్కువగా అయితే 90 రోజుల్లోపు లేదా ఐదేళ్ల కన్నా ఎక్కువకాలం ఉండే టర్మ్ డిపాజిట్ల వైపే మొగ్గు చూపుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1998లో 90 రోజుల్లోపు టర్మ్ డిపాజిట్ల విలువ రూ.41,365 కోట్లుకాగా.. 2008 నాటికి 1.51 లక్షల కోట్లకు, 2018నాటికి 4.25 లక్షల కోట్ల కు, 2021–22 నాటికి 13,02,760 కోట్లకు చేరాయి. ఇక ఐదేళ్లకన్నా ఎక్కువ కాల వ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లు 1998లో రూ. 46,231 కోట్లు ఉంటే, 2008 నాటికి రూ.1.65 లక్షల కోట్లకు, 2018 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరాయి. అయితే 2021 నాటికి ఇవి రూ.7.47 లక్షల కోట్లకు తగ్గాయి. ఆర్బీఐ రాష్ట్రాల వారీగా లెక్కలేమీ వెల్లడించలేదు. అయితే ఆదాయ స్థాయిని బట్టి పొదుపు ఉంటుందనే ఆర్థిక సూత్రం ప్రకారం.. తెలంగాణలో సేవింగ్స్ ఎక్కువే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. జాతీయ తలసరి కంటే రాష్ట్ర తలసరి ఆదాయమూ ఎక్కువేనంటున్నారు. ఈ లెక్కన మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలో సేవింగ్స్ సొమ్ము ఎక్కువే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. -
ఈ లావాదేవీలు చేస్తే ఐటీ నోటీసులొస్తాయ్ జాగ్రత్త!
ఆదాయపు పన్ను శాఖ బ్యాంకు సేవింగ్, మ్యూచువల్ ఫండ్స్, బ్రోకర్ ప్లాట్ ఫారమ్స్ మొదలైన వంటి వాటిలో ప్రజల నగదు లావాదేవీలను తగ్గించడానికి పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌ల నిబంధనలను కఠినతరం చేసింది. ఈ సంస్థల ద్వారా జరిగే నగదు లావాదేవిలపై ఒక నిర్దిష్ట పరిమితి విధించింది. ఈ నిబంధనల ఉల్లంఘన జరిగితే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. అవి ఏంటి అనేది ఈ క్రింద తెలుసుకుందాం.. బ్యాంక్ ఎఫ్డీ(ఫిక్సిడ్ డిపాజిట్): చిన్న పెట్టుబడి పథకాలలో ఫిక్సిడ్ డిపాజిట్ అనేది ఒక మంచి ఆప్షన్. ఒక బ్యాంకు ఎఫ్డీ ఖాతాలో నగదు డిపాజిట్ చేసే బ్యాంకు డిపాజిటర్ రూ.10 లక్షల మించి ఎఫ్డీ చేస్తే మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్: రియల్ ఎస్టేట్ ఒప్పందానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ పరిమితిని విధించింది. మీరు ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు రూ.30 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీ చేస్తే మీకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపిస్తుంది. సేవింగ్స్/కరెంట్ అకౌంట్: ఒక వ్యక్తికి సంబంధించిన పొదుపు ఖాతాలో గనుక లక్ష రూపాయలకు పైగా మించి క్యాష్ డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను నోటీసును పంపవచ్చు. అదేవిధంగా, కరెంట్ ఖాతాదారులకు ఈ పరిమితి రూ.50 లక్షలుగా ఉంది. ఈ పరిమితిని ఉల్లంఘించినప్పుడు ఆదాయపు పన్ను శాఖ పంపే నోటీసులకు బాధ్యత వహించాలి. మ్యూచువల్ ఫండ్/స్టాక్ మార్కెట్/బాండ్/డిబెంచర్: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్, డిబెంచర్ లో పెట్టుబడి పెట్టే వ్యక్తులు పైన పేర్కొన్న పెట్టుబడి ఎంపికల్లో రూ.10 లక్షల పరిమితికి మించి పెట్టుబడి పెట్టకుండా చూసుకుంటే మంచిది. రూ.10 లక్షలకు మించి గనుక పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను శాఖ మీ చివరి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్)ని చెక్ చేసే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డు: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే సమయంలో బిల్లు చెల్లింపు అనేది రూ.1 లక్ష పరిమితికి మించి దాటకూడదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు చేసేటప్పుడు ఈ నగదు పరిమితి దాటితే ఆదాయపు పన్ను శాఖ మీకు ఐటీ నోటీసులు పంపించే అవకాశం ఉంది. -
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ రేట్ల పెంపు
ముంబై: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సేవింగ్స్ అకౌంట్ డిపాజి ట్లపై వడ్డీని 6.75 శాతానికి పెంచింది. ఈ రేట్లు నేటి నుంచీ అమల్లోకి వస్తాయి. ♦ రూ.10 లక్షల నుంచి రూ.10 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంచే సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లకు ఇచ్చే రేటు 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెరిగి, 6.75 శాతానికి చేరింది. ♦ రూ. లక్ష నుంచి రూ.10 లక్షల మధ్య నిల్వకు సంబంధించి వార్షిక రేటు 50 బేసిస్ పాయింట్లు పెరిగి 6.50కి చేరింది. ♦ లక్షలోపు బ్యాలెన్స్‌పై రేటు మాత్రం 5 శాతంగా కొనసాగనుంది. పొదుపులపై దృష్టి: సీఈఓ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ సంజయ్ అగర్వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మా డిపాజిట్ బుక్ విలువ రూ.7,800 కోట్లు. ఇందులో సేవింగ్స్ అకౌంట్ నిల్వల పరిమాణం 23 శాతం. ఈ శాతాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తున్నాం’’ అన్నారు. -
'బ్యాంకుల్లో ప్రజల కష్టం ఉంది.. బాధ్యత మీదే'
సాక్షి, ముంబయి : ప్రజలకు బ్యాంకులపై నమ్మకంపోతోందని, వాటిని అనుమానించే పరిస్థితి తలెత్తిందని శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే అన్నారు. బ్యాంకులు ఉన్నపలంగా దెబ్బతింటే ప్రజల సొమ్ముకు భద్రత కల్పించే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఓ పుస్తకం విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎంతో కష్టపడి తమ డబ్బును కూడ బెట్టుకొని బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. ఈ సందర్భంగా మేం ప్రభుత్వాలను ఒకటే కోరుతున్నాం. బ్యాంకులు దివాళా తీసే పరిస్థితి వచ్చినా దెబ్బతిన్నా ప్రజల సొమ్ముకు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. మరోసారి బీజేపీతో సంబంధాలు పెట్టుకుంటారా అనే ప్రశ్నకు ఉద్దవ్ కొట్టిపారేశారు. 'మేం మహారాష్ట్ర ప్రజల కోసమే పోరాడుతున్నామని వారు ఇప్పుడిప్పుడే మాపై మరింత నమ్మకం పెట్టుకుంటున్నారు. మేం దాన్ని వమ్ము చేయబోము' అని ఉద్దవ్ ఠాక్రే చెప్పారు. -
మీ ఖాతా.. జర భద్రం!!
మోసగాళ్లు మరీ తెలివిమీరిపోతున్నారు జాగ్రత్తలు తీసుకోకుంటే ఖాళీ కావొచ్చు ఈ మధ్యే ఒక బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరిచిన ప్రశాంతికి ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నానంటూ... వెరిఫికేషన్ కోసం మీ డెబిట్ కార్డు నంబరు, సీవీవీ, వన్ టైమ్ పాస్వర్డ్ చెప్పండని అడిగాడు. యథాలాపంగా వివరాలన్నీ చెప్పేయబోయిన ప్రశాంతి ఆఖరు నిమిషంలో సందేహమొచ్చి అప్రమత్తమై సదరు వ్యక్తిని నిలదీసింది. వెంటనే బ్యాంకు శాఖకు ఫోన్ చేస్తే... అసలలాంటి ఫోన్ కాల్స్ కానీ, ఈమెయిల్స్ కానీ తమ నుంచి రావని స్పష్టంగా చెప్పారు. దీంతో అప్పటికప్పుడు తను ఫిర్యాదు నమోదు చేసి, మళ్లీ పాస్వర్డ్లు మొదలైనవి మార్చుకుని జాగ్రత్తపడింది. మోసగాళ్లు చెలరేగిపోతున్న పరిస్థితుల్లో మన కష్టార్జితం ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు మన వంతుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటంటే.. పాస్వర్డ్ గోప్యంగా... పాస్‌వర్డ్‌ను సాధ్యమైనంత వరకూ గోప్యంగా ఉంచాలి. ఖాతా వివరాలు ఎవరికీ చిక్కకుండా తరచూ మారుస్తుండాలి, అల్ఫాన్యూమరిక్ (అక్షరాలు, అంకెలు) కాంబినేషన్లో పటిష్టమైన పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి. వివిధ ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించొద్దు. పాస్‌వర్డ్‌ను గుర్తుపెట్టుకోవడానికే ప్రాధాన్యమివ్వండి. మొబైల్ ఫోన్లో రాసి పెట్టుకోవడం తగదు. ఆన్లైన్ లావాదేవీల్లో జాగ్రత్త.. ఇంటర్నెట్ కేఫ్‌లు.. లైబ్రరీలు మొదలైన చోట్ల, హోటళ్లు.. ఎయిర్‌పోర్ట్‌లలో వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా కంప్యూటర్స్ నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించడం సురక్షితం కాదు. ఇలాంటి చోట్ల మీ పాస్‌వర్డ్‌ను మరొకరు చూడటమో లేదా ట్రేస్ చేయడమో జరిగే అవకాశాలెక్కువగా ఉంటాయి. ఒకవేళ అకౌంట్లోకి లాగిన్ కావాల్సి వస్తే క్యాషె, బ్రౌజింగ్ హిస్టరీని, టెంపరరీ ఫైల్స్‌ను కంప్యూటర్ నుంచి డిలీట్ చేయాలి. పిన్ గోప్యంగా ఉంచాలి.. బ్యాంకులు ఎప్పుడూ కూడా ఖాతాదారుల కాన్ఫిడెన్షియల్ వివరాలను గురించి ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా అడగవు. ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు, సీవీవీ (మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల వెనుక ఉండే 3 అంకెల నంబరు), డెబిట్ కార్డు పిన్ నంబరు.. ఎక్స్పైరీ తేదీ, వన్ టైమ్ పాస్వర్డ్ మొదలైనవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ బ్యాంకు అధికారీ అడగరని గుర్తుంచుకోండి. ఇలాంటి కీలక అంశాలు ఎవ్వరికీ చెప్పొద్దు. ఖాతా స్టేట్మెంట్లు చెక్ చేసుకోవాలి.. ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించిన తర్వాత ఖాతాను పరిశీలించుకోవడం మంచిది. మీ ఖాతా నుంచి సరైన మొత్తమే డెబిట్ అయ్యిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఏవైనా తేడాలు గమనించిన పక్షంలో బ్యాంకుకు వెంటనే తెలియజేయాలి. బ్రౌజర్‌తో జాగ్రత్తలు.. బ్రౌజర్లో ఆటో సేవ్, ఆటో కంప్లీట్ వంటి ఫీచర్లు పనిచేయకుండా డిసేబుల్ చేయాలి. ఎందుకంటే సేవ్ చేసిన సమాచారాన్ని హ్యాకర్స్ లేదా మరెవరైనా దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. పాస్వర్డ్లు, ఇతరత్రా కాన్ఫిడెన్షియల్ లేదా వ్యక్తిగత సమాచారాన్ని క్లియర్ చేసేయండి. వెబ్‌సైట్లన్నింటిలోనూ సేవ్ పాస్వర్డ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలి. లాటరీ మెయిల్స్‌తో భద్రం .. పరిచయం లేని వారి నుంచి వచ్చే ఈ-మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అటాచ్‌మెంట్స్‌ను క్లిక్ చేయడం గానీ లేదా డౌన్లోడ్ చేయడం గానీ చేయొద్దు. ఈ తరహా అటాచ్మెంట్స్ ద్వారా మీ ఫైల్స్‌ను, డేటాను చౌర్యం చేసే.. లేదా ధ్వంసం చేసే వైరస్లు గానీ ట్రోజన్లు గానీ సిస్టమ్‌లో ప్రవేశించవచ్చు. సంజయ్ చౌగులే హెడ్-ఫైనాన్షియల్ క్రైమ్ ప్రివెన్షన్ విభాగం, ఐసీఐసీఐ బ్యాంక్