Published
Tue, Jul 26 2016 11:27 PM
| Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
విపక్షాలది అనవసర రాద్ధాంతం
చిలుకూరు : మల్లన్న సాగర్‌పై విపక్షాలు కావాలని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం అన్ని విధాలుగా నిబంధనల ప్రకారం డిజైన్ చేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 2.70 లక్షల ఎకరాలకు సాగునీరందనుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకంగా పోలేదని, చట్ట ప్రకారమే భూసేకరణ చేపట్టిందన్నారు. విపక్షాలు విమర్శలు చేసేటప్పుడు ఆలోచించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్‌రావు, తిప్పన విజయసింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.