chilukur
-
చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్క్
కొండలు ఎక్కడం, పెద్ద పెద్ద బండరాళ్లపై సేదదీరడం, క్యాంప్ ఫైర్, నైట్ ట్రెకింగ్తో అడవిలో తిరిగిన అనుభూతి కలగాలంటే నేచర్ క్యాంప్‌కు వెళ్లాల్సిందే. ప్రకృతి ఒడిలో ఓ రోజంతా సేదదీరి పరవసించిపోవచ్చు. ఇది ఎక్కడో దూరప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతం కాదు. నగరానికి ఆనుకొని ఉన్న చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో ఉండటంతో నగరవాసులు ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రి బస నుంచి మరుసటి రోజు పార్క్ నుంచి బయటకు వచ్చే వరకూ ఎన్నో మరపురాని అనుభూతులను వెంటతీసుకెళ్లవచ్చు. రచ్చబండలో ముచ్చట్లు, ఫన్నీ గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్, బర్డ్స్ వాచింగ్ వంటివి ప్రకృతి ప్రేమికుల మదిని దోచేస్తాయనడంలో సందేహం లేదు. – గచ్చిబౌలి చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్క్ 100 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్డీసీ) ఏర్పాటు చేసిన నేచర్ క్యాంపులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. గుట్టలపై వివిధ ఆకారాల్లో సహజ సిద్ధమైన రాక్ ఫార్మేషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీపం, బేబీ ఏనుగు, ఓల్డ్ మ్యాన్, తాబేలు, పిట్ట పక్కకు చూస్తున్నట్లు ఏర్పాడిన రాళ్లు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అంతే కాకుండా ఈ రాళ్లపై జంతువుల పెయింటింగ్స్ ఔరా అనిపిస్తాయి. అడవి రారాజు సింహం, కుందేలు, ఏనుగు, ఖడ్గ మృగం, ఉడత, ఎలుగుబంటి బొమ్మలు సందర్శకుల మదిని దోచేస్తున్నాయి.బర్డ్స్ వాచ్టూర్.. మెయిన్ ట్రెక్ రోడ్డు నుంచి వెళుతూ సందర్శకులు బర్డ్స్ వాచ్ చేస్తారు. 45 రకాల పక్షులు అక్కడ ఉంటాయి. కనీసం 20 రకాలు సందర్శకులకు కనిపిస్తాయి. అరుదైన పక్షుల గురించి గైడ్ వివరిస్తారు.ట్రెకింగ్ రోడ్లు.. సముద్ర మట్టానికంటే ఎత్తులో నాలుగు ట్రెక్ రోడ్లు మూడున్నర కిలో మీటర్లు ఉన్నాయి. ట్రెక్ రోడ్డు–1 సముద్ర మట్టానికి 458 మీటర్లు, ట్రెక్ రోడ్డు–2 మట్టానికి 596 మీటర్లు, ట్రెక్ రోడ్డు–3 సముద్ర మట్టానికి 802 మీటర్లు, ట్రెక్ రోడ్డు–4 సముద్ర మట్టానికి 231 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గుట్టలపై నడుస్తూ అక్కడక్కడ సేద దీరేందుకు పెద్ద పెద్ద బండరాళ్లు ఉంటాయి. కొద్ది సేపు ఫొటోలు దిగడం, పిచ్చాపాటి ముచ్చట్లు పెట్టుకుంటూ గడపవచ్చు.వీకెండ్ క్యాంప్ ఇలా..వీకెండ్లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు నేచర్ క్యాంప్‌కు చేరుకోవాలి. 4 గంటలకు సందర్శకులంతా మర్రి చెట్టు ర్చబండ వద్దకు చేరతారు. నేచర్క్యాంప్ యాక్టివిటీ, టైమింగ్, పార్క్ మ్యాప్‌పై బ్రీఫింగ్ చేస్తారు. విజిటర్స్‌ను రెండు గ్రూపులుగా విభజిస్తారు. స్నాక్స్ అందజేస్తారు.ఫన్నీ గేమ్స్..రెండు గ్రూపులు ఫన్నీ గేమ్స్‌తో పోటీ పడతాయి. నెంబర్ స్టాంపింగ్, రోలర్ కోస్టర్, మార్బుల్ గేమ్, ట్రాన్స్పోర్ట్ వాటర్, మిషన్ ఇంపాజిబుల్, డ్రామాటిక్స్, పేపర్ కప్, ట్రాన్స్పోర్ట్ తదితర గేమ్స్ నిర్వహిస్తారు. అనంతరం రాత్రి బస చేసేందుకు కపుల్ టెంట్, స్లీపింగ్ బెడ్స్, లాంతర్ వంటివి అందిస్తారు. టెంట్ ఎలా వేసుకోవాలో నేర్పిస్తారు. టెంట్లో స్వచ్ఛమైన ప్రకృతి గాలిని ఆస్వాదించాల్సిందే. రాత్రిళ్లు వాష్‌రూమ్స్‌కు వెళ్లాలంటే గార్డ్స్ సహాయంతో వెళ్లాల్సి ఉంటుంది. ఒంటరిగా ఎవరినీ బయటకు వెళ్లవద్దని సూచిస్తారు. రాత్రి 8.30 గంటలకు వెజ్ తాలి(భోజనం) అందజేస్తారు.టికెట్ వివరాలు...నేచర్ క్యాంప్‌కు వెళ్లేవారు పెద్దలకు రూ.1800, 12 సంవత్సరాల పిల్లలకు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. వివరాల కోసం 94935 49399, 93463 64583 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.నైట్ ట్రెకింగ్..సందర్శకులంతా కలిసి గైడ్ సమక్షంలో ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నైట్ ట్రెకింగ్ నిర్వహిస్తారు. లాంతర్లు పట్టుకొని దీపం రాక్ మీదుగా వెళతారు. రాత్రి సమయంలో ప్రకృతి ఒడిలో నడవడం, అడవి ఎలా ఉంటుందో చూడటం మరపురాని అనుభూతి. గంట తరువాత తిరిగొస్తారు. బస చోట క్యాంప్ ఫైర్ ఉంటుంది. అంత్యాక్షరి, రోల్ ప్లే, మ్యూజికల్ చైర్స్‌తో సరదాగా గడుపుతారు. ఆదివారం ఉదయం 5.45కు మళ్లీ ట్రెక్ రూట్–4లో పెద్ద చెరువు వరకూ ట్రెకింగ్‌కు వెళ్లి ఉదయం 7.30 గంటలకు తిరిగొస్తారు. మర్రిచెట్టు రచ్చబండకు చేరుకుంటారు. టిఫిన్ చేసిన తరువాత అడ్వెంచర్ గేమ్స్ అడతారు. వ్యాలీ క్రాసింగ్, బర్మా బ్రిడ్జి, వైన్ ట్రావెల్స్ తదితర ఆటలతో సేదదీరుతారు. ఉదయం 10 గంటలకు క్యాంప్ ముగుస్తుంది. -
అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర
హైదరాబాద్: అశ్రునయనాల మధ్య సినీనటి, దర్శకురాలు విజయనిర్మల అంతిమయాత్ర నానక్‌రాంగూడలోని ఆమె నివాసం నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. భర్త కృష్ణ, కుమారుడు నరేశ్, హీరో మహేష్‌బాబు.. విజయనిర్మల పార్థివదేహాన్ని పూలతో అలంకరించిన ట్రక్‌పైకి తరలించారు. అనంతరం విజయనిర్మల అమర్‌రహే అన్న అభిమానుల నినాదాల నడుమ ఇంటి నుంచి ప్రత్యేక వాహనం ముందు సాగింది. అంతిమయాత్ర ప్రారంభానికి ముందు పెద్ద సంఖ్యలో అభిమానులు, జూనియర్ ఆర్టిస్టులు విజయనిర్మలను కడసారిగా చూసి నివాళులు అర్పించారు. నానక్‌రాంగూడలోని పోచమ్మ అమ్మవారంటే కృష్ణ, విజయనిర్మల దంపతులకు అత్యంత భక్తి. ఆ ఆలయం వద్దకు రాగానే అంతియ యాత్రను కొద్దిసేపు నిలిపారు. ప్రతియేటా బోనాల సమయంలో విజయనిర్మల తనవంతు సహకారం అందించేవారు. దీంతో గ్రామస్తుల తరఫున స్థానికులు ఆమె పార్థివదేహంపై శాలువా కప్పి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిలుకూరు వరకు యాత్ర సాగింది. నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నానక్‌రాంగూడలోని కృష్ణ, విజయనిర్మల నివాసానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9.34 గంటలకు చేరుకున్నారు. ఆమె పార్థివదేహం వద్ద నివాళులర్పించి కృష్ణ, నరేశ్‌ను ఓదార్చారు. ఏపీ సీఎం వెంట వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఏపీ మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. సినీనటుడు కృష్ణను ఓదారుస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి చిలుకూరులో అంత్యక్రియలు మొయినాబాద్ (చేవెళ్ల): విజయనిర్మల అంత్యక్రియలు శుక్రవారం రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు నానక్‌రాంగూడ నుంచి మొదలైన అంతిమ యాత్ర మధ్యాహ్నం 12.50 గంటలకు చిలుకూరు వ్యవసాయక్షేత్రానికి చేరుకుంది. ఆమె కుమారుడు నరేశ్ ముందు నడిచి కర్మకాండలు నిర్వహించారు. సంప్రదాయ ప్రకారం నరేశ్ చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అంతిమ యాత్రకు కొన్ని నిమిషాల ముందే కృష్ణ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. పార్థివదేహాన్ని చితిపై పెట్టే ముందు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మధ్యాహ్నం 1.40 గంటలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. చిలుకూరు ఫాంహౌస్‌లో జరిగిన అంత్యక్రియలకు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సినీ ప్రముఖులు కల్యాణ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ గల్లా జయదేవ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
బావిలోపడి అన్నదమ్ముల దుర్మరణం
చిలుకూరు (కోదాడ) : ఆ అన్నదమ్ములిద్దరు బీఈడీ వరకు చదువుకున్నారు. గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఈ క్రమంలో తన పొలానికి పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లి.. ప్రమాదవశాత్తు బావిలో పడి దుర్మరణం పాలయ్యారు. మండలంలోని కొండాపురంలో గురువారం జరిగిన ఈ సంఘటన ఆ కుటుంబానికి తీరనిశోకాన్ని మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పల్లా రంగయ్యకు ఇద్దరు కుమారులు పల్లా గోపాలరావు(32), పల్లా నరేష్(28). ఇద్దరు గురువారం ఉదయం గ్రామశివారులో బేతవోలు చెరువు పక్కన గల తమ వ్యవసాయ పొలంలో పురుగు మందు పిచికారి చేయడం కోసం తమతో పాటు మందు కొట్టేందుకు గ్రామానికి చెందిన పిల్లుట్ల బాలకృష్ణను వెంట తీసుకెళ్లారు. ట్యాంక్‌తో బాలకృష్ణ మదు కొడుతుండగా గోపాలకృష్ణ బావిలో నుంచి నీళ్లు అందిస్తున్నాడు. తమ్ముడు నరేష్ నీటిని తీసుకెళ్లి ట్యాంక్‌లో పోస్తున్నాడు. ఈ క్రమంలో గోపాలరావు ప్రమాదవశాత్తు జారి బావిలో పడిపోయాడు. గోపాలరావుకు ఈత రాకపోవడంతో.. మునిగి పోతున్నాడు. గమనించిన తమ్ముడు నరేష్ అన్నను కాపాడబోయి.. తనకూడా నీటిలో మునిగిపోయాడు. దీంతో ట్యాంకులో నీళ్లు పోసేందుకు ఇద్దరూ రాకపోవడంతో బాలకృష్ణ బావి వద్దకు వెళ్లాడు. అప్పటికే ఇద్దరు బావిలో పడి మృతి చెందారు. విషయాన్ని వెంటనే బాలకృష్ణ మృతుల తండ్రి రంగయ్యకు తెలియజేశాడు. దీంతో గ్రామస్తులు బావి వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఇద్దరూ మృతిచెందడంతో.. గ్రామస్తుల సాయంతో బావిలోని మృతదేహాలను బయటకు తీశారు. గోపాలరావుకు భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. నరేష్‌కు భార్య ఒక కుమారుడు ఉన్నారు. నరేష్ రైతు సమన్వయ సమితి కొండాపురం గ్రామ కోఆర్డి నేటర్‌గా ఇటీవల నియామకమయ్యాడు. చెరువు వెంట బావి ఉండడం వల్లే.. వీరి వ్యవసాయ బావి చెరువు వెంట ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. పలువురు పేర్కొంటున్నారు. బావి చాలా పెద్దగా ఉండడం.. చెరువు బావి కలిసినట్లు ఉండడం వల్ల అన్నను కాపాడే ప్రయత్నంలో నరేష్ కూడా మృతి చెందాడని అంటున్నారు. గ్రామంలో విషాదఛాయలు ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. చేతికొచ్చిన ఇద్దరు కుమారులు మృతి చెందడంతో తండ్రి రంగయ్య, తల్లి ఆర్తనాదాలు పలువురుని కంటతడి పెట్టించాయి. రంగయ్య సర్పంచ్‌గా అందరి పరిచయస్తుడు కావడంతో ప్రజలు పెద్దఎత్తున్న సంఘటన స్థలానికి చేరుకున్నారు. గోపాలరావు, నరేష్ భార్యాపిల్లలను చూసి బోరున విలపించారు. సంఘటన స్థలాన్ని కోదాడ డీఎస్పీ రమణారెడ్డి, రూరల్ సీఐ రవి పరిశీలించారు. తండ్రి రంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నర్సయ్య తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
చిలుకూరు బాలాజీకి ఉత్సవ శోభ
మొయినాబాద్: వీసా దేవుడిగా పిలుచుకునే చిలుకూరు బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. యేటా ఉగాది పండుగ అనంతరం చైత్ర శుక్ల దశమి నాడు ప్రారంభమై చైత్ర బహుళ విధియ వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు కొనసాగడం ఆనవాయితీ. ఈ నెల 6న ఉదయం సెల్వర్కుత్తుతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది. 7న ధ్వజారోహణం, సాయంత్రం శేష వాహనం, 8న ఉదయం గోప వాహనము, సాయంత్రం హనుమంత వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు. 9న ఉదయం సూర్య ప్రభ, సాయంత్రం గరుడ వాహనం, రాత్రికి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీదేవి, భూదేవి, బాలాజీల కల్యాణోత్సవం ఉంటుంది. 10న వసంతోత్సవం, గజ వాహనంపై ఊరేగింపు, 11న పల్లకి సేవ, రాత్రికి రథోత్సవం జరుగుతుంది. 12న మహాభిషేకం, ఆస్థాన సేవ, అశ్వ వాహనము, దోప్ సేవ, పుష్పాంజలి, 13న బాలాజీ బ్రహ్మోత్సవాల చివరి రోజున ధ్వజారోహణం, ద్వాదశారాధనము, చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది. మెహిదీపట్నం, లక్డీకపూల్, రాణిగంజ్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, మియాపూర్, సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, హయత్‌నగర్, అఫ్జల్‌గంజ్, రాజేంద్రనగర్ ప్రాంతాల మీదుగా సర్వీసులు నడుస్తాయి. -
విలేజ్‌లో వినాయకుడు
సాక్షి, సిటీబ్యూరో: 93.5 రెడ్ ఎఫ్ఎం ‘విలేజ్‌లో వినాయకుడు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చిలుకూరు దేవస్థానం సమీపంలో రెడ్ ఎఫ్ఎం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి దర్శకులు అవసరాల శ్రీనివాస్, గాయనీ పర్ణికా మాన్యా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెడ్ ఎఫ్ఎం దాతల నుంచి విరాళాలు సేకరించి స్వచ్ఛంద సంస్థలకు అందజేసి, ఒక బడిని దత్తత తీసుకొని పునరుద్ధరిస్తుంది. ఈ వినూత్న కార్యక్రమానికి ‘సాక్షి’ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. -
పాఠశాలల బలోపేతానికి కృషి
చిలుకూరు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషిచేస్తానని ఎమ్మెల్సీ పూల రవీందర్ తెలిపారు. సోమవారం మండలంలోని బేతవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బేతవోలు జిలా పరిషత్ పాఠశాలకు అదనపు గదులు, పోస్టులు మంజూరు చేయడానికి పాటుపడతానన్నారు. నర్సిరెడ్డిసేవలు మరువలేనివి ఉపాధ్యాయ వృత్తికి నర్సిరెడ్డి చేసిన సేవలు మరవలేనివని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. బేతవోలు గ్రామంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో జరిగిన బజ్జూరి నర్సిరెడ్డి సంతాప సభలో మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడు నర్సిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధణకు కృషి చేయాలన్నారు. అనంతరం నర్సిరెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ తాళ్ళూరి పద్మా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఎంపీపీలు దొడ్డా నారాయణరావు, బజ్జూరి వెంకట్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గన్నా చంద్రశేఖర్, ఎంఈఓ ఈశ్వర్రావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు భిక్షంగౌడ్, నరసింహారెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు సామినేని శ్రీనివాస్‌రావు, మండల అధక్ష, కార్యదర్శులు తీగెల నరేష్, జగన్మోహన్రావు, సంఘం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు రావెళ్ల సీతరామయ్య, బొల్లు రాంబాబు, గొల్లికొండ కోటయ్య, ఓరుగంటి రవి, వివిధ ఉపాధ్యాయ సంఘం నాయకులు,పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
విపక్షాలది అనవసర రాద్ధాంతం
చిలుకూరు : మల్లన్న సాగర్‌పై విపక్షాలు కావాలని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం అన్ని విధాలుగా నిబంధనల ప్రకారం డిజైన్ చేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 2.70 లక్షల ఎకరాలకు సాగునీరందనుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకంగా పోలేదని, చట్ట ప్రకారమే భూసేకరణ చేపట్టిందన్నారు. విపక్షాలు విమర్శలు చేసేటప్పుడు ఆలోచించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, తిప్పన విజయసింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. -
హరితహారాన్ని ప్రారంభించిన కేసీఆర్
-
కీచక ఉపాధ్యాయుడిపై నిరసనల వెల్లువ
చిలుకూరు, న్యూస్‌లైన్: విద్యార్థినికి మాయ మాటలు చెప్పి గర్భవతిని చేసిన రామాపురం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడి ఉదంతంపై గ్రామంలో తీవ్ర నిరసన వెల్లువెత్తింది. మంగళవారం ఉదయం ‘సాక్షి’లో వార్తను చూసిన గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులను లోనికి వెళ్లకుండా గేటు వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ కీచక పీఈటీ విజయ్‌కుమార్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. కాగా, మంగళవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. మండల కేంద్రంలో రాస్తారోకో కీచక ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ చిలుకూరులో ఏఐఎస్ఎఫ్, టీఎన్ఎస్ఎఫ్, బీసీఎస్ఎఫ్, జీవీఎస్, బీసీ విద్యార్థి సంఘం, టీఆర్ఎల్డీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో కోదాడ-హుజూర్నగర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఉపాధ్యాయుడిపై నిర్భయ చట్టం కింద కేసునమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాలో చేపూరి కొండలు, నజీర్, సంగారపు ప్రసాద్, వావిళ్ల రమేష్‌గౌ డ్, బాబు, బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినిని వంచించిన పీఈ టీని కఠినంగా శిక్షించాలని వివిధ ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరు ప్రకటనల్లో కోరాయి. అదే విధంగా ఉపాధ్యాయుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ బీజేపీ నాయకులు చిలుకూరు తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.