పాఠశాలల బలోపేతానికి కృషి
చిలుకూరు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషిచేస్తానని ఎమ్మెల్సీ పూల రవీందర్ తెలిపారు. సోమవారం మండలంలోని బేతవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బేతవోలు జిలా పరిషత్ పాఠశాలకు అదనపు గదులు, పోస్టులు మంజూరు చేయడానికి పాటుపడతానన్నారు.
నర్సిరెడ్డిసేవలు మరువలేనివి
ఉపాధ్యాయ వృత్తికి నర్సిరెడ్డి చేసిన సేవలు మరవలేనివని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. బేతవోలు గ్రామంలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో జరిగిన బజ్జూరి నర్సిరెడ్డి సంతాప సభలో మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడు నర్సిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధణకు కృషి చేయాలన్నారు. అనంతరం నర్సిరెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ తాళ్ళూరి పద్మా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఎంపీపీలు దొడ్డా నారాయణరావు, బజ్జూరి వెంకట్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గన్నా చంద్రశేఖర్, ఎంఈఓ ఈశ్వర్‌రావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు భిక్షంగౌడ్, నరసింహారెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు సామినేని శ్రీనివాస్‌రావు, మండల అధక్ష, కార్యదర్శులు తీగెల నరేష్, జగన్‌మోహన్‌రావు, సంఘం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు రావెళ్ల సీతరామయ్య, బొల్లు రాంబాబు, గొల్లికొండ కోటయ్య, ఓరుగంటి రవి, వివిధ ఉపాధ్యాయ సంఘం నాయకులు,పార్టీల నాయకులు పాల్గొన్నారు.