హైదరాబాద్: తెలంగాణలో విపక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అంశంపైనైనా అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధమని సవాల్ విసిరారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.