న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ 3.0 కేబినెట్‌లో తొలి బడ్జెట్‌ను ఈ నెల 23న ప్రవేశపెట్టనుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
కాగా ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు శనివారం ప్రకటించారు. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను జులై 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
కాగా లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఫిబ్రవరి 1న పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు అప్పట్లోనే చెప్పారు. ఎప్పటిలా సూట్‌కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే కొత్త సంప్రదాయానికి నిర్మలా శ్రీకారం చుట్టారు.
.
Comments
Please login to add a commentAdd a comment