న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళలు, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై ప్రధానమంత్రినరేంద్ర మోదీ స్పందించారు.
యువత నైపుణ్యాలను పెంచే బడ్జెట్ అని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదమిచ్చే బడ్జెట్ అన్నారు. ముద్ర రుణాలను రూ. 20 లక్షలకు పెంచామని, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. భారత్‌ను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారుస్తామని చెప్పారు.
చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చే బడ్జెట్‌గా మోదీ అభివర్ణించారు. అన్ని వర్గాల అభివృద్ధికి దోహదం చేసే బడ్జెట్ ఇదని తెలిపారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
కోటి మందికి ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తున్నాం. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్. మౌలిక తయారీ రంగాలను బలోపేతం చేసే బడ్జెట్. బడ్జెట్‌లో నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేశాం. దేశ ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతో దోహదం చేస్తుంది. కొత్త ఉద్యోగులకు తొలి జీతం మా ప్రభుత్వమే ఇస్తుంది. ’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment