న్యూఢిల్లీ: ఈ నెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు తొలి విడత సమావేశాలు జరుగుతాయి.
పార్లమెంట్ సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 1న సభలో సాధారణ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాగా ఈ ఏడాది నుంచి రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టడాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే శాఖకు కేటాయింపులు ఉంటాయి.
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
Published Tue, Jan 3 2017 3:33 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
Advertisement
Advertisement