న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ముందుగా, జనవరి చివరి వారంలోనే ప్రారంభించాలనే విషయంపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నేడు నిర్ణయం తీసుకోనుంది. సాధారణంగా ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి సమావేశాలను ముందే ప్రారంభించి, ఫిబ్రవరి 1వ తేదీననే బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్‌పై 4న జైట్లీ సంప్రదింపులు: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్రాల మంత్రులతో బడ్జెట్ పూర్వ సమాలోచనలు జనవరి 4 నుంచి ప్రారంభించనున్నారు. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం ఆయన ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.