
ఏపీలో కట్ కట్.. ఇక్కడ రికార్డు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత మైక్‌ను పదేపదే కట్ చేస్తున్నారని.. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో శాసన సభ జరుగుతున్న తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటు తోందని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలు సజా వుగా సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నాయన్నారు.
రికార్డు స్థాయిలో గురువారం పన్నెండున్నర గంటలకుపైగా చర్చ జరిగిందని, పద్దులపై మునుపెన్నడూ లేని విధంగా చర్చలు సాగుతున్నాయని చెప్పారు. ‘గత ప్రభుత్వాలు అనుసరించిన గిలిటిన్ విధానానికి స్వస్తి చెప్పాం. పద్దులపై సభ్యులం దరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తపరిచే వాతావరణముంది. అందరూ సందర్భో చితంగా వ్యవహరిస్తున్నారు.. పరస్పరం క్షమాపణలు సైతం చెప్పుకుంటూ హుం దాగా వ్యవహరిస్తున్నారు’ అన్నారు. సభలో జరిగిన కీలకమైన చర్చల కంటే లాబీల్లో జరిగే చిట్‌చాట్ ముచ్చట్లకే మీడియా ప్రాధాన్యమిస్తోందని మంత్రి అన్నారు.