
సాక్షి, అమరావతి: మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మండలిలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఒక చరిత్ర అన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు రైతులకు కార్యాలయాలు వంటివన్నారు. 1,778 రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. నాణ్యమైన యంత్రాల కొనుగోలుకు 40 శాతం రాయితీ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
►వ్యవసాయ బడ్జెట్ రూ.31,256.36 కోట్లు
►ఉపాధి హామీ పథకం కోసం రూ.8,116.16 కోట్లు
►వైఎస్‌ఆర్ జలకళ పథకం కోసం రూ.200 కోట్లు
►వ్యవసాయ పథకాల కోసం రూ.11,210.80 కోట్లు
►వైఎస్‌ఆర్ రైతు భరోసా కోసం రూ.3,845.30 కోట్లు
►వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు
►వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు
►రాష్ట్రీయ కృషి వికాస యోజన(RKVY) రూ.583.44 కోట్లు
►ధరల స్థిరీకరణ ఫండ్ రూ.500 కోట్లు
►రైతులకు సున్నా వడ్డీ చెల్లింపుల కోసం రూ.500 కోట్లు
►ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన(PMKSY) రూ.300 కోట్లు
►రైతులకు విత్తనాల సరఫరా కోసం రూ.100 కోట్లు
►వ్యవసాయ మార్కెట్ మౌలిక వసతుల కోసం రూ.100 కోట్లు
►వైఎస్‌ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ కోసం రూ.88.57 కోట్లు
►రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు
►పశువుల నష్టపరిహార పథకం కోసం రూ.50 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment