
కాకినాడ: సంక్రాంతి ఇలా ముగిసిందో లేదో రైతులను భయపెట్టేలా గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టేశారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఏపీలో వ్యవసాయ రంగంపై ఈనాడు తప్పుడు రాతలు రాయడంపై కన్నబాబు ధ్వజమెత్తారు.
ప్రభుత్వంపై ఈర్షతోనే తప్పుడు కథనాలు రాస్తున్నారని విమర్శించారు. వర్షాల వల్ల పంటలు దెబ్బ తిన్నా ధాన్యం దిగుబడి తగ్గలేదని, సగటున ఎకరాకి 20 క్వింటాళ్లు వస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు.