లోక్‌సభలో గందరగోళం | Parliament Monsoon Budget Session 31 July 2024 Updates | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో గందరగోళం

Published Wed, Jul 31 2024 10:46 AM | Last Updated on Wed, Jul 31 2024 1:20 PM

Parliament Monsoon Budget Session 31 July 2024 Updates

updates

  • వయనాడ్ జల విలయంపై లోక్ సభలో కాంగ్రెస్ సావధాన తీర్మానం
  • మధ్యాహ్నం లోక్ సభలో చర్చ

 

  • లోక్‌సభలో గందరగోళం
  • అనురాగ్‌ ఠాకూర్ వ్యాఖ్యలపై విపక్షాల ఆగ్రహం.
  • కులగణనపై వ్యాఖ్యలు చేసిన అనురాగ్‌ ఠాకూర్‌
  • అనురాగ్‌కు వ్యతిరేకంగా విపక్షాల నినాదాలు
  • ‘తమది ఏ కులమో కూడా తెలియని వారు కులగణన కోరుతున్నారు’ అంటూ మంగళవారం బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేపాయి. అవి రాహుల్‌ను ఉద్దేశించినవేనంటూ విపక్ష సభ్యులంతా తీవ్రంగా మండిపడ్డారు.

 

  • రాజ్యసభలో బీజేపీ విప్‌గా ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ నియామకం

 

 

  • మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్
  • వయనాడ్ వరదలు దురదృష్టకర సంఘటన, ఇది జాతీయ విపత్తు
  • వయనాడ్‌లో పరిస్థితిని చాలా సీరియస్‌గా తీసుకున్నాం.
  • రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో పర్యటిస్తారు.
  • పార్టీ కార్యకర్తలు పునరావాస పనుల్లో నిమగ్నమయ్యారు.
  • రాజ్యసభలో వయనాడ్ వరదల అంశాన్ని లేవనెత్తుతాం.
  • కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
  • వరద బాధితులకు నష్టపరిహారం అందించాలి.

 

  • పార్లమెంట్‌లోని సంవిధావ్ సధన్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
  • పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్  సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశం ప్రారంభం
  • సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఎంపీలు
  • వాయనాడ్ మృతులకు, రాజేంద్రనగర్ కోచింగ్ సెంటర్లో మృతి చెందిన విద్యార్థులకు సంతాపం తెలిపిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ

 

  • కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు
  • సరిహద్దు పరిస్థితులు, చైనాతో భారీ వాణిజ్య లోటుపై చర్చ జరగాలని ఆయన లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

 

  • అస్సాం వరదలపై కాంగ్రెస్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది
  • లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ అసోంలో వరద నిర్వహణ సమస్యను లేవనెత్తుతూ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement