ఫిబ్రవరిలో శాసనసభ శీతాకాల సమావేశాలు!
స్పీకర్ కోడెల శివప్రసాదరావు
సాక్షి, అమరావతి: జనవరి నెలాఖరు లోపు అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తయితే వచ్చేనెల మొదటి వారంలో శీతాకాల సమావేశాలు, మూడోవారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. వెలగపూడిలోని అసెంబ్లీ భవన నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఒకవేళ ఈ నెలాఖరులోపు భవన నిర్మాణ పనులు పూర్తి కాకపోతే శీతాకాల, బడ్జెట్ సమావేశాలను వచ్చేనెలాఖరులో ఒకేసారి జరుపుతామని చెప్పారు.